
థ్యాంక్యూ కోహ్లీ: పాక్ ఆల్‌రౌండర్
న్యూఢిల్లీ: భారత్ పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఇందుకు ఉదాహరణ. వీరు ఇద్దరు మంచి స్నేహితులు. గతంలో టెస్టులు, వన్డేల నుంచి అఫ్రీది రిటైర్మెంట్ సందర్భంగా కోహ్లీ తనతో పాటు పలువురు భారత ఆటగాళ్లు సంతకం చేసిన తన జెర్సీని అతనికి కానుకగా అందించాడు. అప్పుడు అఫ్రీది భారత జట్టుకు కృతజ్ఞతలు తెలిపాడు.
ఇప్పుడు తాజాగా విరాట్ చేసిన మరో సాయానికి అఫ్రీది కృతజ్ఞలు తెలిపాడు. అది ఏంటంటే క్రికెట్ నుంచి రిటైర్డ్ అనంతరం అఫ్రీది క్రికెట్ ఫౌండేషన్ నెలకొల్పి స్థానిక యువతకు క్రికెట్ పాఠాలు చెప్తున్నాడు. ఈ ఫౌండేషన్‌కు విరాట్ తను సంతకం చేసిన బ్యాట్‌ను విరాళంగా ఇచ్చాడు. దీంతో ఆఫ్రీది కోహ్లీకి థ్యాంక్యూ కోహ్లీ అంటూ సోషల్ మీడియా ట్వట్టర్‌లో పోస్టు చేశాడు. గతంలో భారత ఆటగాళ్లు సంతకం చేసిన టీషర్ట్‌ను లండన్‌లో వేలం వేయగా రూ.3లక్షలు పలికింది.
Thank you @imVkohli for your kind gesture in support of @SAFoundationN. Friends & supporters like you ensure #HopeNotOut for everyone pic.twitter.com/T6z7F2OYLb
— Shahid Afridi (@SAfridiOfficial) August 1, 2017