ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదంటే హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్ జట్టు తప్పకుండా తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా పాక్ గడ్డ మీద ఆడితే చూడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం టీమిండియాను అక్కడికి పంపేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానం(టీమిండియా మ్యాచ్‌లకు వేరే వేదిక)లో ముందుకు వెళ్లాలని ఐసీసీని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
టీమిండియా ఇక్కడకు రావాలి
ఈ నేపథ్యంలో షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. రోహిత్ సేన పాకిస్తాన్ పర్యటనకు వస్తే చూడాలని ఉందన్నాడు. రాజకీయాలతో ఆటను ముడిపెట్టకుండా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.
ముఖ్యంగా విరాట్ కోహ్లికి తమ దేశంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. అతడిని చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆఫ్రిది తెలిపాడు. భారత్‌లోని అభిమానుల ప్రేమను మరిపించేలా అతడిని తమ ప్రేమలో ముంచెత్తుత్తామని పేర్కొన్నాడు.
‘‘భారత క్రికెట్ జట్టు తప్పకుండా ఇక్కడికి రావాలి. మేము ఇండియాలో పర్యటించినపుడు మాకెంతో ఘనంగా స్వాగతం పలకడం పాటు గౌరవమర్యాదలు ఇచ్చారు.
ఆ ప్రేమను మరచిపోతాడు
అదే విధంగా మా దేశంలో టీమిండియాను 2005లో ఇలాగే సాదరంగా ఆహ్వానించాం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్‌ను చూడాలి. ఒక్కసారి విరాట్ ఇక్కడికి వచ్చాడంటే భారత్‌లో తనకు దొరికే ప్రేమను కూడా మరిచిపోతాడు.
పాకిస్తాన్‌లో అతడికి అంతటి క్రేజ్‌ఉంది. ఇక్కడి ప్రజలకు అతడంటే ఎంతో ఇష్టం’’ అని షాహిద్ ఆఫ్రిది ఓ యూట్యూబ్ చానెల్‌తో పేర్కొన్నాడు. కాగా వన్డే, టీ20లలో కోహ్లికి పాక్‌పై మెరుగైన రికార్డు ఉంది. వన్డే, టీ20లలో పాక్‌పై అతడి పరుగుల సగటు 52.15, 70.29.
చదవండి: మిస్టరీ గర్ల్‌తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment