
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. బన్నీ నటించిన ‘ఆర్య’ మొదలు బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, డి.జె. దువ్వాడ జగన్నాథం’ చిత్రాలకు డీఎస్పీ సంగీతం అందించారు. తాజాగా అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప'కు మ్యూజిక్ అందిస్తున్నాడు వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో బన్నీ, డెస్పీల మధ్య స్నేహం మరింత బలపడింది. తన సన్నిహితులకు, స్నేహితులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్‌ప్రైజ్‌ను డీఎస్పీకి ఇచ్చాడు.
బన్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు... బన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సర్‌ప్రైజ్ ‘రాక్‌స్టార్’ గిఫ్ట్ . థాంక్యూ సో మచ్ మై డియరెస్ట్ బ్రదర్ బన్నీ బాయ్... లవ్లీ గిఫ్ట్... అస్సలు ఊహించలేదు. నువ్వు చాలా స్వీట్’అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఆ గిఫ్ట్ కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
A SURPRISE
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 8, 2021
“ROCKSTAR” Gift from the
“ICON STAR” @alluarjun 😍
Thank you so much my dearest Brother Bunny boy..🤗..
What a Lovely Surprise!!🕺
Totally unexpected !!😁
Daaaamn Sweet of U 😁🎶🤗😍#PUSHPA pic.twitter.com/xkn8TLKKW5