ధోని బర్త్‌డే : పాండ్యా స్పెషల్‌ గిఫ్ట్‌ ! | Hardik Pandyas Special Gift For Birthday Boy MS Dhoni | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 2:02 PM | Last Updated on Sun, Jul 8 2018 2:12 PM

Hardik Pandyas Special Gift For Birthday Boy MS Dhoni - Sakshi

పాండ్యా, ధోని

కార్డిఫ్‌ : టీమిండియా మాజీ సారథి, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు, అభిమానులు, సహచర ఆటగాళ్ల నుంచి ధోనికి విషేస్‌ పోటెత్తాయి. ఇక భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), జట్టు ఆటగాళ్లు, ధోని కూతురు జీవాతో కలిపి రూపోందించిన ఓ వీడియోతో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ కూడా ఇచ్చింది. అయితే అందరూ ధోనితో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ విషెస్‌ తెలియజేస్తే.. టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా మాత్రం తన రూటే సపరేట్‌ అంటూ ధోని ఓ స్పెషల్‌ గిఫ్ట్‌  ఇచ్చాడు.  ధోని హెయిర్‌ కట్‌ చేస్తున్న ఫొటోను జత చేసి దానికి క్యాప్షన్‌గా..‘ఈ ప్రత్యేకమైన రోజు నాడు ధోనికి నా ప్రత్యేకమైన హెయిర్ కట్‌ గిఫ్ట్‌.. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసిన పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు’ అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. 

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20తో ధోని 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తిచేసుకుని రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈఘనత సాధించిన మూడో భారత్‌ క్రికెటర్‌గా.. ఓవరల్‌గా 9వ ఆటగాడిగా ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్ 664, ద్రవిడ్ 509 మ్యాచ్‌లతో  ధోని కన్నా ముందు వరుసలో ఉన్నారు. రెండో టీ20లో పరాజయం పాలైన కోహ్లిసేన నేడు సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు సిద్దమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement