hair cut.
-
కిమ్ జోంగ్ హెయిర్ కట్ కావాలి.. వైరలవుతోన్న వీడియో
-
‘ఆ హెయిర్ కట్ చాలా దారుణంగా ఉంటుంది’
న్యూయార్క్ : గురువు అనే పదానికి సరైన అర్థం చెప్పాడో ఓ ప్రిన్సిపల్. స్కూలు నిబంధనలకు విరుద్ధంగా హ్యాట్ పెట్టుకుంటున్న విద్యార్థికి హెయిర్ కట్ చేసి అందరి మన్ననలు పొందాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికా, ఇండియానాకు చెందిన ఆంథోనీ మూరే ఇండియానాపొలిస్‌లోని స్టోనీ బ్రూక్ ఇంటర్ మీడియట్ అండ్ మిడిల్ స్కూల్లో చదువుతున్నాడు. అతడు రోజూ హ్యాట్ పెట్టుకుని స్కూలుకు హాజరయ్యేవాడు. స్కూలు యూనీఫాం నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థి హ్యాట్ పెట్టుకుని తిరగటం ప్రిన్సిపల్ జాషన్ స్మిత్‌కు నచ్చలేదు. హ్యాట్ తీసేయమని అతడ్ని అడిగాడు. ఆంథోనీ అందుకు ఒప్పుకోలేదు. ప్రిన్సిపల్ అతడిమీద కోపం తెచ్చుకోకుండా హ్యాట్ ఎందుకు తీయనంటున్నాడో అడిగాడు. ‘‘ నా జుట్టు పెరిగినట్లు అనిపిస్తే మా అమ్మానాన్న హెయిర్ కట్ చేయిస్తారు. ఆ హెయిర్ కట్ చాలా దారుణంగా ఉంటుంది’’ అని చెప్పాడు. దీంతో బాగా ఆలోచించిన జాషన్ తానే ఆంథోనికి హెయిర్ కట్ చేయటానికి పూనుకున్నాడు. ‘‘చూడు ఆంథోనీ! నేను నీ అంత వయసున్నప్పటినుంచి హెయిర్ కట్ చేస్తున్నాను. నేనింటికెళ్లి ట్రిమ్మర్ తెచ్చి నీకు హెయిర్ కట్ చేస్తాను. సరేనా!’’ అని అడిగాడు. ఆ విద్యార్థి మొదట ఇందుకు ఇబ్బందిపడ్డా.. తర్వాత సరేనన్నాడు. అనంతరం జాషన్.. ఆంథోనికి హెయిర్ కట్ చేశాడు. ఆ పిల్లాడు హ్యాట్ పెట్టుకోవటం మానేశాడు. దీనిపై స్పందించిన ఆంథోనీ తల్లి.. కుమారుడి పరిస్థితిని అద్భుతమైన పద్ధతిలో డీల్ చేసినందుకు జాషన్కు కృతజ్ఞతలు తెలిపింది. తమ అబ్బాయిని స్కూలు నుంచి సస్పెండ్ చేయనందుకు సంతోషం వ్యక్తం చేసింది. చదవండి : ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు డ్రైనేజీలో తండ్రి అస్థికలు కలిపిన కొడుకు.. కారణం.. -
80 ఏళ్లుగా జుట్టు కత్తిరించలేదు..!
లాక్డౌన్ కాలంలో సెలూన్ షాపులు మూతపడిన నేపథ్యంలో కొంతమంది పురుషులు పెరిగిన జుట్టుతో చికాకు పడుతూ సొంతంగానే కటింగ్ చేసుకున్నారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు చాలా మంది స్వయంగా క్షవరం చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు రిలీఫ్‌గా ఉందని, హెయిర్ కటింగ్ షాపులు ఇంకొన్నాళ్లు మూసి ఉంటే తమ పరిస్థితి ఏమయ్యేదోనంటూ కామెంట్లు చేశారు. అలాంటి వాళ్లు వియత్నాంకు చెందిన 92 ఏళ్ల గుయెన్ వాన్ చిన్ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే దాదాపు 80 ఏళ్లుగా చిన్ ఒక్కసారి కూడా తన జుట్టును కత్తిరించుకోలేదు. దీంతో సుమారు ఐదు మీటర్ల పొడవు మేర పెరిగిన జుట్టుతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మూడో తరగతి చదువుతున్న సమయంలోనే జీవితంలో ఎప్పుడూ హెయిర్‌కట్ చేయకూడదని నిశ్చయించుకున్నారట. అయితే చిన్ ఇలా చేయడం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. (చదవండి: కాలు చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు) ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఒకవేళ నేను నా జట్టు కత్తిరించుకుంటే చనిపోతానని నమ్ముతాను. అందుకే కనీసం ఒక్కసారి కూడా దువ్వెన ఉపయోగించలేదు. ముడివేసి కొప్పులా మార్చి దానిపై ఓ వస్త్రాన్ని చుడతాను. ఎల్లపుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి నా జుట్టు ఎంతో బలంగా, నల్లగా, ఒత్తుగా ఉండేది. అప్పుడు చక్కగా దువ్వుకొనేవాడిని. అయితే దేవుడి పిలుపు విన్న తర్వాత అంతా మారిపోయింది. జుట్టుకు, అమరత్వానికి మధ్య బలమైన సంబంధం ఉందని నేను నమ్ముతాను’’ అని రాయిటర్స్‌తో చెప్పుకొచ్చారు.(చదవండి: స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!) కాగా స్థానికంగా ప్రాచుర్యం పొందిన ‘కొకొనట్’ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్నారు. 1963లో స్థాపించిన ఈ మతాచారం ‘దువా’పై ప్రస్తుతం వియత్నాంలో నిషేధం ఉంది. ఇక తాను కేవలం కొబ్బరికాయల వల్లే తమ మనుగడ కొనసాగిందని, వాటి కారణంగానే శారీకరంగా దృఢంగా ఉన్నానని ఈ మత స్థాపకులు బోధించినట్లు స్థానికులు చెప్పుకొంటారు. -
వదినకు అవకాశమిస్తున్నావా..కవిత ట్వీట్
-
భార్య చేసిన పనికి ఏడ్వలేక నవ్వేశాడు
-
ధోని బర్త్‌డే : పాండ్యా స్పెషల్ గిఫ్ట్ !
కార్డిఫ్ : టీమిండియా మాజీ సారథి, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లు, అభిమానులు, సహచర ఆటగాళ్ల నుంచి ధోనికి విషేస్ పోటెత్తాయి. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), జట్టు ఆటగాళ్లు, ధోని కూతురు జీవాతో కలిపి రూపోందించిన ఓ వీడియోతో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇచ్చింది. అయితే అందరూ ధోనితో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ విషెస్ తెలియజేస్తే.. టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మాత్రం తన రూటే సపరేట్ అంటూ ధోని ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ధోని హెయిర్ కట్ చేస్తున్న ఫొటోను జత చేసి దానికి క్యాప్షన్‌గా..‘ఈ ప్రత్యేకమైన రోజు నాడు ధోనికి నా ప్రత్యేకమైన హెయిర్ కట్ గిఫ్ట్.. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసిన పని.. ఇంట్లో ఎవరూ ప్రయత్నించకూడదు’ అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20తో ధోని 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తిచేసుకుని రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈఘనత సాధించిన మూడో భారత్ క్రికెటర్‌గా.. ఓవరల్‌గా 9వ ఆటగాడిగా ఈ జార్ఖండ్ డైనమైట్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో సచిన్ 664, ద్రవిడ్ 509 మ్యాచ్‌లతో ధోని కన్నా ముందు వరుసలో ఉన్నారు. రెండో టీ20లో పరాజయం పాలైన కోహ్లిసేన నేడు సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌కు సిద్దమవుతోంది. Special day calls for a special haircut. Here’s my birthday gift for the one and only @msdhoni . 💇♂✌ 😘 ⚠ This stunts is performed by experts, don't try this at home ⚠😉😂 pic.twitter.com/F1TTwYlvoa — hardik pandya (@hardikpandya7) July 7, 2018 -
హద్దు మీరిన అధ్యాపకులు
► విద్యార్థుల తల వెంట్రుకలు కత్తిరించిన లెక్చరర్లు ► ధర్మపురి జూనియర్ కళాశాలలో ఘటన ధర్మపురి: క్రమశిక్షణ పేరిట జగి త్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు హద్దుమీరి ప్రవర్తించారు. జుట్టు ఎక్కువ పెంచారని, కళాశాలకు సరిగ్గా రావడం లేదని తరగతి గదిలోనే పది మంది విద్యార్థుల జట్టు కత్తిరించిన ఘటన ఇది. గురువారం జువాలజీ, కామర్స్ లెక్చరర్లు వెంకటరెడ్డి, శ్రీనివాస్ తరగతి గదుల్లోకి వచ్చారు. కొందరు జుట్టు ఎక్కువగా పెంచారని, కళాశాలకు రెగ్యులర్‌గా రావడం లేదని విద్యార్థులనుద్దేశించి అన్నారు. తమ జుట్టు చిన్నదిగా ఉన్నదని, రోజూ కళాశాలకు వస్తున్నామని విద్యార్థులు తెలిపినా పట్టించు కోలేదు. అంజయ్య, కాల్ల వంశీకృష్ణ, రామన్న, రాజ్‌కుమార్, ముఖేశ్, శేఖర్, అనిల్, హరీశ్ తదితరుల జుట్టును అధ్యాపకులు కత్తిరించారు. జుట్టు కత్తిరించడం అవ మానంగా భరించిన విద్యార్థులు భోరు మన్నారు. బాధ్యులైన అధ్యాపకులపై చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కామర్స్ లెక్చరర్ శ్రీనివాస్ మాట్లా డుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ కోసమే తాము జట్టు కత్తిరించామని తెలిపారు. ఒకరికి మాత్రమే తాను కత్తిరించానని చెప్పారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీవాణి మాట్లాడుతూ కొందరు విద్యార్థులు టీసీలు కావాలని కోరారని, తాము నిరాకరించడంతో కావాలనే తమ జుట్టు కత్తిరించుకున్నారని అన్నారు.