హద్దు మీరిన అధ్యాపకులు
► విద్యార్థుల తల వెంట్రుకలు కత్తిరించిన లెక్చరర్లు
► ధర్మపురి జూనియర్ కళాశాలలో ఘటన
ధర్మపురి: క్రమశిక్షణ పేరిట జగి త్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు హద్దుమీరి ప్రవర్తించారు. జుట్టు ఎక్కువ పెంచారని, కళాశాలకు సరిగ్గా రావడం లేదని తరగతి గదిలోనే పది మంది విద్యార్థుల జట్టు కత్తిరించిన ఘటన ఇది. గురువారం జువాలజీ, కామర్స్ లెక్చరర్లు వెంకటరెడ్డి, శ్రీనివాస్ తరగతి గదుల్లోకి వచ్చారు. కొందరు జుట్టు ఎక్కువగా పెంచారని, కళాశాలకు రెగ్యులర్‌గా రావడం లేదని విద్యార్థులనుద్దేశించి అన్నారు. తమ జుట్టు చిన్నదిగా ఉన్నదని, రోజూ కళాశాలకు వస్తున్నామని విద్యార్థులు తెలిపినా పట్టించు కోలేదు.
అంజయ్య, కాల్ల వంశీకృష్ణ, రామన్న, రాజ్‌కుమార్, ముఖేశ్, శేఖర్, అనిల్, హరీశ్ తదితరుల జుట్టును అధ్యాపకులు కత్తిరించారు. జుట్టు కత్తిరించడం అవ మానంగా భరించిన విద్యార్థులు భోరు మన్నారు. బాధ్యులైన అధ్యాపకులపై చర్య లు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కామర్స్ లెక్చరర్ శ్రీనివాస్ మాట్లా డుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ కోసమే తాము జట్టు కత్తిరించామని తెలిపారు. ఒకరికి మాత్రమే తాను కత్తిరించానని చెప్పారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీవాణి మాట్లాడుతూ కొందరు విద్యార్థులు టీసీలు కావాలని కోరారని, తాము నిరాకరించడంతో కావాలనే తమ జుట్టు కత్తిరించుకున్నారని అన్నారు.