బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొంత కాలంగా లులియా వాంతూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ప్రేమ వ్యవహారాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా.. పలు వేదికల మీద ఇద్దరు కలిసి సందడిచేశారు. అంతేకాదు సల్మాన్ ఇంట్లో జరిగే వేడుకల్లోనూ లూలియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన లులియా, సల్మాన్ అంటే నాకు గౌరవం మాత్రమే మా మధ్య ఏమీ లేదంటూ షాక్ ఇచ్చారు.
అంతేకాదు నా పై వస్తున్న రూమర్స్ గురించి తెలిసింది. కానీ అవి ఎవరో పుట్టించిన రూమర్స్. వాటిని నేను ఆపలేను. నా జీవితం నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో నాకు తెలియడం లేదు. మూడు సంవత్సరాల క్రితం నేను నా జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను అంటూ వేదాంత ధోరణిలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త‍్వరలో ఈ భామ మనీశ్ పాల్ జంటగా ‘హర్ జై’ అనే వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment