- వివిధ శాఖలతో 12న రాష్ట్ర డీజీపీ సమావేశం
- స్మగ్లర్లపై దాడులకు కార్యాచరణ ప్రణాళిక
- ఎక్సైజ్ సిబ్బందికి ఆర్మ్‌డ్ రిజర్వు ఫోర్సు రక్షణ?
గంజాయిపై ఉక్కుపాదం
Published Tue, Jan 10 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
రాజమహేంద్రవరం క్రైం :
గంజాయి సాగు, అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న రాజమహేంద్రవరంలో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర డీజీపీ సాంబశివరావు సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు, అక్రమ రవాణా అధికంగా సాగుతోంది. పోలీస్, ఎక్సైజ్ అధికారులకు సవాలుగా మారిన గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏఓబీ ప్రాంతం పూర్తిగా కొండలు, లోయలు, దట్టమైన అడవులతో విస్తరించి ఉంది. దీంతో స్మగ్లర్లు గిరిజనులను ప్రోత్సహిస్తూ భారీ ఎత్తున గంజాయి పండిస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు డీజీపీ సాంబశివరావు పోలీస్, ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు, కస్టమ్స్, రెవెన్యూ తదితర శాఖలతో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ సిబ్బందిపై గంజాయి స్మగ్లర్లు దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ రైడింగ్ పార్టీలకు ఆర్మ్‌డ్ రిజర్వుఫోర్సు సమన్వయంతో దాడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, జి.మాడుగల తదితర ఎనిమిది మండలాల్లోనూ, తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం తదితర మండలాల్లోని అడవుల్లో గంజాయి సాగు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.
రవాణాలో కొత్త పుంతలు
గంజాయి రవాణా చేయడంలో సగ్లర్లు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కాయగూరలు, పండ్లు, «ధాన్యాలు, చింతపండు, పుచ్చకాయల లోడు, నర్సరీ మొక్కలు మాటున లారీలు, మినీ వ్యా¯ŒSలు, ఖరీదైన కార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. లారీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో గంజాయిని దాచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యలో గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు విశాఖ జిల్లాలో మూడు చెక్ పోస్టులు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
భారీగా గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో గంజాయి రవాణాలో అరెస్ట్‌లు ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలో 2015 – 16లో 8 కేసుల్లో 16,009 కేజీల గంజాయి, 91 వాహనాలు స్వాధీనం చేసుకొని 280 మందిని అరెస్ట్ చేశారు. 2016–17లో 7 కేసుల్లో 13,576 కేజీల గంజాయి, 71 వాహనాలు స్వాధీనం చేసుకుని 199 మందిని అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాలో 2015–16లో 129 కేసులు, 2016 –17 సంవత్సరాలలో 97 కేసులు నమోదు చేశారు.
రైడింగ్ సమయాల్లో పోలీసులపై దాడులు
గంజాయి స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ఎౖMð్సజ్, స్థానిక పోలీసులు రైడింగ్ చేస్తున్న సమయాలలో వారిపై దాడులకు పాల్ప డుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి స్మగ్లర్లపై రైడింగ్ చేసే పార్టీల రక్షణకు రిజర్వు ఫోర్సు సహకారం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులకు ఇచ్చే షూటింగ్ అర్డర్ వీరికి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
Advertisement
Advertisement