ముంబై: దేశీయ మార్కెట్ కోసం వచ్చే ఏడాది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు జీప్ ఇండియా హెడ్ నిపుణ్ మహాజన్ తెలిపారు. ‘వచ్చే ఏడాది కూడా వృద్ధిని చూస్తున్నాం. ఉత్పత్తిని జోడించినప్పుడు వృద్ధి జరుగుతుంది. కస్టమర్ సంఖ్యను, పరిమాణాన్ని పెంచుతాం. మరింత వ్యాపారాన్ని జోడిస్తామని ఆయన ప్రకటించారు.
ఇదీ చదవండి: Zomato డెలివరీ ఫెయిల్: భారీ మూల్యం చెల్లించిన జొమాటో
పరిమాణం పరంగా 2023 మెరుగ్గా ఉంటుంది. 2022లో మూడు ఉత్పాదనలను పరిచయం చేశాం.నూతన శ్రేణిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం నాలుగు ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి పూర్తిగా ఖరీదైన విభాగంలో పోటీపడుతున్నాయి. మార్కెట్ పనితీరు బాగుంది’ అని అన్నారు. భారత్‌లో కంపెనీ జీప్ కంపాస్, రాంగ్లర్, మెరీడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లను విక్రయిస్తోంది. గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిపుణ్ ఈ విషయాలను వెల్లడించారు.
కాగా, ఈ ఎస్‌యూవీ ధర రూ.77.5 లక్షలు. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 110కిపైగా అత్యాధునిక భద్రతా ఫీచర్లను జోడించారు. యాక్టివ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎనమిది ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ, డ్రౌజీ డ్రైవర్ డిటెక్షన్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్, ఆక్యుపెంట్ డిటెక్షన్ వీటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment