అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో వ్యోమగాములు నెలల తరబడి ఉండి.. పరిశోధనలు చేస్తుంటారని తెలిసిన విషయమే. అయితే వారు ఏం తింటారు.. ఎలా జీవిస్తారనే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. వారు తినేందుకు ఇక్కడి నుంచి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిస్తారు. అయితే వీటిల్లో సరైన పోషకాలు ఉండటేదని, వారికి మరిన్ని పోషకాలు అందేలా చేసేందుకు అక్కడే పంటలు పండించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో చాలా మొక్కలనే పెంచారు. ఆ జాబితాలోకి తాజాగా మరో రకం చేరనుంది. ఇస్పనోలా చిలీ పెప్పర్ అనే మిరప రకం మొక్కను ఇప్పుడు అంతరిక్షంలో పండించనున్నారు. ఈ మొక్కలను ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది మొదట్లో అంతరిక్షంలోకి పంపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అరుణగ్రహం వంటి చాలా దూరంగా ఉన్న గ్రహాలపైకి వెళ్లే వ్యోమగాములకు ఈ ప్రయోగం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు ఏం పండించారో తెలుసా?
- క్యాబేజీ
- గోధుమ
- వరి
- తులిప్
- ఉల్లి
- బఠానీలు
- ముల్లంగి
- వెల్లుల్లి
- దోస
- బంగాళదుంప
- పొద్దుతిరుగుడు తదితరాలు..
Comments
Please login to add a commentAdd a comment