ISC
-
ఐసీఎస్ఈ, ఐఎస్ఈ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను ఐసీఎస్ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఎస్ఈ వెల్లడించింది. ఫలితాలను ఐసీఎస్ఈ వెబ్సైట్ https://www.cisce.orgని ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. కాగా.. ఈ సంవత్సరం 85,611 మంది విద్యార్థులు ఐఎస్సీ పరీక్షలకు హాజరవ్వగా 2,798 విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐసీఎస్ఈ పరీక్షలకు 2,07,902 మంది హాజరవ్వగా 99.34 శాతంతో రికార్డు స్థాయిలో 2,06,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
భారత కార్మికులకు సాయంగా ఐఎస్సీ సంఘం
అబుదాబి: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలో కూడా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవనోపాధి కోసం వెళ్లిన భారతీయుల ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థమంగా మారింది. వారు పని చేసే చోట యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో వారి బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారింది. ఇక అక్కడి మన భారత వలస కూలీలను ఆదుకునేందుకు తాము ఉన్నామంటూ అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ) వారు ముందుకు వచ్చారు. (నిరుపేదలకు చేయూతగా నిలిచిన జీవీఎంసీ) ఈ సంస్థ గత 52 సంవత్సరాలుగా యూఏఈలోని మన తెలుగువారికి ఎన్నో విధాలుగా సేవలందిస్తోంది. ఇక కోవిడ్-19 నేపథ్యంలో అక్కడి తెలుగు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కొక్కరికి 3 వారాలకు సరిపడే విధంగా వంట సామగ్రిని అందించింది. పరిస్థితులు మెరుగయ్యే వరకు కార్మికులను ఆదుకుంటామని ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా వ్యవహరిస్తున్న లూలూ గ్రూప్ అధినేత అజిత్ జాన్సన్ తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఐఎస్సీ సంస్థ అధ్యక్షుడు యోగేష్ చెప్పారు. ఇవే కాకుండా అన్ని కార్మిక గృహాలలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లతో పాటు చేతి గ్లౌజులను కూడా అందజేస్తున్నామని సంఘం సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాస రావు పేర్కొన్నారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇక్కడి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తమ సంఘం తరపున ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశామని సంఘ కోశాధికారి షజీల్, కార్యదర్శి జయప్రదీప్ చెప్పారు. -
అంతరిక్ష పంట.. అదిరెనంట!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములు నెలల తరబడి ఉండి.. పరిశోధనలు చేస్తుంటారని తెలిసిన విషయమే. అయితే వారు ఏం తింటారు.. ఎలా జీవిస్తారనే విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. వారు తినేందుకు ఇక్కడి నుంచి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిస్తారు. అయితే వీటిల్లో సరైన పోషకాలు ఉండటేదని, వారికి మరిన్ని పోషకాలు అందేలా చేసేందుకు అక్కడే పంటలు పండించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో చాలా మొక్కలనే పెంచారు. ఆ జాబితాలోకి తాజాగా మరో రకం చేరనుంది. ఇస్పనోలా చిలీ పెప్పర్ అనే మిరప రకం మొక్కను ఇప్పుడు అంతరిక్షంలో పండించనున్నారు. ఈ మొక్కలను ఈ ఏడాది నవంబర్ లేదా వచ్చే ఏడాది మొదట్లో అంతరిక్షంలోకి పంపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. అరుణగ్రహం వంటి చాలా దూరంగా ఉన్న గ్రహాలపైకి వెళ్లే వ్యోమగాములకు ఈ ప్రయోగం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏం పండించారో తెలుసా? క్యాబేజీ గోధుమ వరి తులిప్ ఉల్లి బఠానీలు ముల్లంగి వెల్లుల్లి దోస బంగాళదుంప పొద్దుతిరుగుడు తదితరాలు.. -
6 నుంచి బహ్రెయిన్‌లో ప్రవాసీ సమ్మేళన్
హైదరాబాద్: గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) రెండేళ్లకోసారి నిర్వహించే ప్రవాసీ సమ్మేళన్ సదస్సును ఈసారి బహ్రెయిన్‌లో నిర్వహిస్తోంది. జనవరి 6 నుంచి 8 వరకు బహ్రెయిన్‌లోని మనామ లో గల్ఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరవనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 6న జరిగే ‘ఇండియన్ విమెన్ అచీవర్స్’ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు వీకే సింగ్, అల్ఫోన్స్ కన్నతానం పాల్గొననున్నారు. 7న జరిగే కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, మహారాష్ట్ర చీఫ్ విప్ రాజ్ పురోహిత్, మంత్రి కేటీఆర్ çహాజరవనున్నారు. 8న ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ, టెలికం నిపుణుడు శ్యామ్ పిట్రోడా పాల్గొననున్నారు. -
ఐఎస్సీ సేవలు షురూ
ప్రయోగాత్మకంగా ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ - బుధవారం నుంచి ప్రారంభమైన ఐఎస్సీ సేవలు - వివిధ కేసుల దర్యాప్తులో దిశానిర్దేశానికి ఏర్పాటు - ప్రతి ఠాణాకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయింపు - వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించిన నగర కొత్వాల్ సాక్షి, హైదరాబాద్: నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు తీరును మెరుగుపరచడం, శిక్షల శాతం పెంచడం లక్ష్యంగా హైదరాబాద్ నగర పోలీసు విభాగం ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్(ఐఎస్సీ) బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా పని చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్ని విభాగాలు, పోలీసుస్టేషన్ల అధికారులకు ఐఎస్సీ పనితీరును వివరించారు. ప్రస్తుతం నగరానికి మాత్రమే సేవలందిస్తున్న దీని పరిధిని రాష్ట్ర స్థాయికి విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ దర్యాప్తు అధికారికి ఎలాంటి సందేహం వచ్చినా నివృత్తి చేయడానికి అనువుగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగాత్మక పరిశీలన తర్వాత లోపాలను సరిచేసి సిటీలో శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువస్తారు. రెండో దశలో రాష్ట్రంలోని అన్ని విభాగాలు, ఠాణాలకు సేవలు అందించనున్నారు. మూడు కోణాలూ ఎంతో కీలకం.. ఏదైనా నేరం జరిగినప్పుడు ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించడం, దర్యాప్తు చేయడం నుంచి అభియోగపత్రాలు దాఖలు చేయడం వరకు మూడు కోణాలు అత్యంత కీలక భూమిక పోషిస్తుంటాయి. ప్రాథమికంగా పోలీసులకు సంబంధించిన మాన్యువల్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు దీన్ని అనుసరిస్తూనే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుంటూ వాటిని పక్కాగా అమలు చేయాల్సిందే. ఈ రెండింటికీ మించి ఘటనాస్థలి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలంటే దానికీ కొన్ని నియమనిబంధనల్ని పాటించాల్సిందే. పోలీసు, లీగల్, ఫోరెన్సిక్.. ఈ 3 కోణాలను పరిగణనలోకి తీసుకుంటూ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే కేసుల దర్యాప్తు మధ్యలోకి వచ్చేసరికో, అభియోగపత్రాలు దాఖలు చేసేటప్పుడో కేసు దర్యాప్తులో ఈ మూడింటికీ మధ్య పొంతన లేకపోవడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే ఐఎస్సీ రూపుదిద్దుకుంది. కేసులపై బదిలీల ప్రభావం ఉండదు.. పోలీసు అధికారులను నిర్దిష్ట సమయాల్లో బదిలీ చేయడం సాధారణం. అయితే ప్రస్తుతం ఓ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి బదిలీ అయితే.. ఆయన స్థానంలోకి వచ్చిన వారే ఆ బాధ్యతలు స్వీకరించాలి. ఇలా కొత్తగా వస్తున్న వారికి ఆ కేసుపై పట్టు ఉండట్లేదు. ఫలితంగా సగం పక్కాగా సాగిన దర్యాప్తు ఆపై లొసుగులతో సాగుతోంది. న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పే సమయంలో ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి సమస్యలకు ఐఎస్సీ పరిష్కారంగా నిలవనుంది. ఓ కేసు నమోదైనప్పటి నుంచి ప్రతి దశలోనూ దీనిపై సెంటర్ అధికారులకు పరిజ్ఞానం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారులు మారినా కేసులు పక్కాగా ముందుకు సాగేలా ఐఎస్సీ నిపుణులు జాగ్రత్తలు తీసుకుంటారు. కాల్‌సెంటర్ మాదిరిగా ఐఎస్సీ.. నగర పోలీసు కమిషనరేట్ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఐఎస్సీలో అనుభవజ్ఞులైన రిటైర్డ్ అధికారులు, నిపుణులే ఉంటారు. పదవీ విరమణ చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఇద్దరు న్యాయ నిపుణులు, మరో ఇద్దరు ఫోరెన్సిక్/క్లూస్ ఎక్స్‌పర్ట్‌లను నియమించారు. ఒక్కో షిఫ్ట్‌లో ముగ్గురు చొప్పున రెండు షిఫ్టుల్లో 24 గంటలూ ఐఎస్సీ లో అందుబాటులో ఉంటారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లినప్పటి నుంచి ఆ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేసే వరకు ఎలాంటి అనుమానం వచ్చినా ఈ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఫోన్‌కాల్, వీడి యో కాన్ఫరెన్స్, చాటింగ్‌లతో పాటు హైదరా బాద్ పోలీసు కాప్ యాప్ ద్వారానూ నిపుణుల్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. దీనికోసం ప్రతి ఠాణాకు ఓ ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయించారు. -
ఐఎస్సీ అభివృద్ధి పనుల్లో అవినీతి వరద