హైదరాబాద్: గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) రెండేళ్లకోసారి నిర్వహించే ప్రవాసీ సమ్మేళన్ సదస్సును ఈసారి బహ్రెయిన్‌లో నిర్వహిస్తోంది. జనవరి 6 నుంచి 8 వరకు బహ్రెయిన్‌లోని మనామ లో గల్ఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరవనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
6న జరిగే ‘ఇండియన్ విమెన్ అచీవర్స్’ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు వీకే సింగ్, అల్ఫోన్స్ కన్నతానం పాల్గొననున్నారు. 7న జరిగే కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, మహారాష్ట్ర చీఫ్ విప్ రాజ్ పురోహిత్, మంత్రి కేటీఆర్ çహాజరవనున్నారు. 8న ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ, టెలికం నిపుణుడు శ్యామ్ పిట్రోడా పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment