bahrain tour
-
2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 వరల్డ్‌కప్- 2022 క్వాలిఫియర్ మ్యాచ్‌లో భాగంగా జర్మనీతో బహ్రెయిన్ తలపడింది. ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ స్పిన్నర్ జునైద్ అజీజ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో జునైద్ అజీజ్ తన స్పిన్ మయాజాలంతో ప్ర్యతర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అజాజ్ 2 ఓవర్లు పూర్తి చేయకుండానే 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం 10 బంతుల్లోనే 5 వికెట్లు సాధించాడు. తొలి ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టిన అజాజ్.. రెండో ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. అయితే టీ20 క్రికెట్లో రెండు ఓవర్లు పూర్తి కాకుండానే 5 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అజాజ్ నిలిచాడు. అజాజ్ స్పిన్ ధాటికి 106 పరుగులకే జర్మనీ కుప్పకూలింది. జర్మనీ బ్యాటర్లలో విజయ్ శంకర్ ఒక్కడే 50 పరుగులతో రాణించాడు. ఇక బహ్రెయిన్ బౌలర్లలో అజాజ్ వికెట్లు పడగొట్టగా, వసీం అహ్మద్ రెండు వికెట్లు సాధించాడు. ఇక 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బహ్రెయిన్ 4 వికెట్లు కోల్పోయి చేధించింది. బహ్రెయిన్ బ్యాటర్లలో సర్ఫరాజ్ ఆలీ(69) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND Vs WI 3rd T20: దంచి కొట్టిండు.. దండం పెట్టిండు.. వైరలవుతున్న సూర్యకుమార్ నమసెలబ్రేషన్స్ 1 2 W W . W 2 W . W Bahrain's Junaid Aziz delivered a dream spelling taking five wickets in 10 balls against Germany! 🤯#T20WorldCup pic.twitter.com/a33aPdlqIU — T20 World Cup (@T20WorldCup) February 19, 2022 -
6 నుంచి బహ్రెయిన్‌లో ప్రవాసీ సమ్మేళన్
హైదరాబాద్: గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (గోపియో) రెండేళ్లకోసారి నిర్వహించే ప్రవాసీ సమ్మేళన్ సదస్సును ఈసారి బహ్రెయిన్‌లో నిర్వహిస్తోంది. జనవరి 6 నుంచి 8 వరకు బహ్రెయిన్‌లోని మనామ లో గల్ఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 40 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరవనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 6న జరిగే ‘ఇండియన్ విమెన్ అచీవర్స్’ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు వీకే సింగ్, అల్ఫోన్స్ కన్నతానం పాల్గొననున్నారు. 7న జరిగే కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, మహారాష్ట్ర చీఫ్ విప్ రాజ్ పురోహిత్, మంత్రి కేటీఆర్ çహాజరవనున్నారు. 8న ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ, టెలికం నిపుణుడు శ్యామ్ పిట్రోడా పాల్గొననున్నారు. -
'మానవత్వానికి అదే పెద్ద ప్రమాదం'
మనామా(బహ్రెయిన్): రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవత్వానికి ఉగ్రవాదం అతిపెద్ద ప్రమాదంగా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అంటూ వేర్వేరుగా పరిగణించడానికి వీల్లేదని చెప్పారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా బహ్రెయిన్‌లో ఉన్న ఆయన అక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సోమవార భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. అనంతరం ఉగ్రవాదం అంశంపై అధికారిక ప్రకటనను ఆయన చేశారు. 'ఉగ్రవాదాన్ని సమగ్ర రీతితో ఎదుర్కోవాలి. పాక్షికంగా చర్యలు చేపట్టిన కొన్ని దేశాలు ఉగ్రవాదం విషయంలో ఇప్పటికే విఫలమయ్యాయి' అని రాజ్‌నాథ్ అన్నారు. బహ్రెయిన్‌తో వర్తక సంబంధాలు మరింత పెంపొందించుకునేందుకు భారత్ ఎంతో ఉత్సాహంతో ఉందని, ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయని, వర్తకం బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు. -
గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం: కవిత
ఎడారిలో ఉన్నా.. ప్రవాసీయులు నూటికి నూరుపాళ్లు తెలంగాణ బిడ్డలేనని, వాళ్ల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించకుండా చూస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర పరిధిలోని ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తానని తెలిపారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న కవిత.. తెలంగాణ జాగృతి నేత హరిప్రసాద్‌తో కలిసి శుక్రవారం బహ్రెయిన్‌లో కార్మిక క్యాంపులను సందర్శించి, అక్కడ కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్ కాకతీయతో గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయం పెరుగుతుందని, ఇక ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస రావాల్సిన అవసరం ఉండబోదని ఆమె చెప్పారు. సుదూర తీరాలకు వచ్చి నాలుగైదు వేల రూపాయలు సంపాదించేకంటే, ఇంట్లోనే ఉండి వ్యవసాయం చేసుకుని అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చని కవిత తెలిపారు. గల్ఫ్‌లో ఉన్నవాళ్లు తమ పిల్లలను బాగా చదివించి, వృత్తిపరమైన కోర్సులు చేయాలని, ఈ వికాసం బంగారు తెలంగాణకు ఉపయోగపడుతుందని, ఇందులో ప్రవాసీయుల పాత్ర గణనీయమైనదని ఆమె అన్నారు. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నవి ఏడు సెగ్మెంట్లు కావని, గల్ఫ్‌తో కలుపుకొంటే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లని కవిత అన్నారు. అంతకుముందు హరిప్రసాద్ నివాసంలో తెలంగాణ మహిళలతో సమావేశమై బహ్రెయిన్‌లో బతుకమ్మ నిర్వహణపై సమీక్షించారు. బహ్రెయిన్ దుర్గా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత వెంట సామా రాజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.