మనామా(బహ్రెయిన్): రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవత్వానికి ఉగ్రవాదం అతిపెద్ద ప్రమాదంగా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అంటూ వేర్వేరుగా పరిగణించడానికి వీల్లేదని చెప్పారు. ప్రస్తుతం మూడు రోజుల పర్యటనలో భాగంగా బహ్రెయిన్లో ఉన్న ఆయన అక్కడ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సోమవార భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు.
అనంతరం ఉగ్రవాదం అంశంపై అధికారిక ప్రకటనను ఆయన చేశారు. 'ఉగ్రవాదాన్ని సమగ్ర రీతితో ఎదుర్కోవాలి. పాక్షికంగా చర్యలు చేపట్టిన కొన్ని దేశాలు ఉగ్రవాదం విషయంలో ఇప్పటికే విఫలమయ్యాయి' అని రాజ్నాథ్ అన్నారు. బహ్రెయిన్తో వర్తక సంబంధాలు మరింత పెంపొందించుకునేందుకు భారత్ ఎంతో ఉత్సాహంతో ఉందని, ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయని, వర్తకం బిలియన్ డాలర్లకు చేరుకుందని తెలిపారు.
'మానవత్వానికి అదే పెద్ద ప్రమాదం'
Published Mon, Oct 24 2016 7:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
Advertisement