
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్‌సీఈ) 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలను ఐసీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఎస్‌ఈ వెల్లడించింది. ఫలితాలను ఐసీఎస్‌ఈ వెబ్‌సైట్ https://www.cisce.orgని ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.
కాగా.. ఈ సంవత్సరం 85,611 మంది విద్యార్థులు ఐఎస్‌సీ పరీక్షలకు హాజరవ్వగా 2,798 విద్యార్థులు ఫెయిలయ్యారు. ఐసీఎస్‌ఈ పరీక్షలకు 2,07,902 మంది హాజరవ్వగా 99.34 శాతంతో రికార్డు స్థాయిలో 2,06,525 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.