పారిస్లో మరో ఉగ్రదాడికి కుట్ర! | French police arrested three female suspects to have been planning fresh attacks | Sakshi
Sakshi News home page

పారిస్లో మరో ఉగ్రదాడికి కుట్ర!

Sep 9 2016 2:13 PM | Updated on Nov 6 2018 8:51 PM

పారిస్లో మరో ఉగ్రదాడికి కుట్ర! - Sakshi

పారిస్లో మరో ఉగ్రదాడికి కుట్ర!

ఫ్రాన్స్లో మరో ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ కుట్ర పన్నిందా? అవుననే అంటున్నాయి అక్కడి నిఘా వర్గాలు.

పారిస్: ఫ్రాన్స్లో మరో ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ కుట్ర పన్నిందా? అవుననే అంటున్నాయి అక్కడి నిఘా వర్గాలు. అయితే, ఈ సారి దాడిని మహిళలతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు ఉగ్రవాద అనుమానిత మహిళలను  పారిస్లో అదుపులోకి తీసుకోవడంతో ఉగ్రకుట్ర బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆరు గ్యాస్ సిలిండర్లతో అనుమానాస్పదంగా పార్కింగ్లో ఉన్న కారును ఆదివారం పారిస్లో గుర్తిచారు. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు గురువారం రాత్రి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు మహిళలు 39, 23, 19 సంవత్సరాల వయస్సు గల వారిగా గుర్తించారు. అరెస్ట్ సమయంలో వారు తీవ్రంగా ప్రతిఘటించి పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు కాల్పుల్లో ముగ్గురిలో ఓ మహిళ గాయపడింది. ఎట్టకేలకు వీరిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్న పోలీసులు ఒకరికి ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నట్లు ప్రాధమికంగా నిర్థారించారు.

అరెస్ట్కు ముందు వీరిని గమనించిన ఓ స్థానికుడు మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు మహిళలు చాలా ఉద్వేగంగా కనిపించారని, అనుమానాస్పదంగా సంచరించారని వెల్లడించాడు. విదేశీ టూరిస్టులతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాన్ని వీరు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరు కొత్త తరహాలో దాడి చేయడానికి ప్రణాళికలు వేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ కెజ్న్యూవ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement