Sitting Squad
-
ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నిరోధానికి చర్యలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు విద్యాశాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోంది. మొదట 358 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన సిట్టింగ్ స్క్వాడ్లను తాజాగా అన్ని కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఆయా మండలాల్లోని పోలీసు, రెవెన్యూ, వైద్యా రోగ్య తదితర శాఖల అధికారులు, సిబ్బందితో స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. దీంతో శుక్రవారం జరిగిన గణితం పరీక్ష ప్రశ్నపత్రం బయటకు రాకుండా అడ్డుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 144 ఫ్లయింగ్ స్క్వాడ్లు... ఇన్విజిలేటర్లు, ప్రైవేటు యాజమాన్యాలు కుమ్మక్కై సెల్ఫోన్లను రహస్యంగా తీసుకెళ్తూ ప్రశ్నపత్రాలను బయటకు పంపిస్తుండటాన్ని విద్యా శాఖ సీరియస్‌గా తీసుకుంది. జిల్లాల డీఈవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాజా ఆదేశాలు జారీ చేసింది. 2,556 పరీక్ష కేంద్రాల్లో 842 కేంద్రాలు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నాయి. పేపరు లీకులు ప్రైవేటు పాఠశాలల్లోని కేంద్రాల్లోనే ఎక్కువగా జరుగుతుండటంతో వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. 144 ఫ్లయింగ్ స్క్వాడ్లు తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టేలా చర్యలు చేపట్టింది. దీనికితోడు 2,198 పరీక్ష కేంద్రాల్లోనూ సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. బిట్ పేపరు అవసరమా..! మరోవైపు విద్యార్థికి ప్రశ్నపత్రం ఇవ్వగానే మొదటిపేజీపై మాత్రమే కాకుండా... అన్ని పేజీలపైనా హాల్‌టికెట్ నంబరు వేసేలా చర్యలు చేపట్టింది. తద్వారా వాట్సాప్ వంటి సోషల్ మీడి యా ద్వారా బయటకు వచ్చే ప్రశ్నాపత్రం ఎవరిదని గుర్తించడం, ఏ పాఠశాలకు చెందిన వారు పేపరు లీక్‌కు పాల్పడ్డారనేది తెలుసుకునే వీలుంటుంది. మరోవైపు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్న బిట్ పేపరు అవసరమా అని విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఇంటర్ తరహాలో షార్ట్, వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా ఉంటుందనేది పరిశీలిస్తోంది. -
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 5 నిమిషాలకు మించి ఆలస్యమైతే అనుమతి లేదు విద్యారణ్యపురి : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నారుు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 53,507 మంది రెగ్యులర్ విద్యార్థులు, 298 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ వారిలో 27,064 మంది బాలురు, 26,443 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 254 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 254 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 254 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 3 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిర్ణీత సమయం దాటిన 5 నిమిషాల వరకు కూడా అనుమతి ఉంటుందని, అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కాపీయింగ్ నిరోధానికి పది సిట్టింగ్ స్క్వాడ్లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌సెంటర్లను మూసివేస్తారు. హాల్‌టికెట్లు అందనివారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ తెలంగాణ. ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. -
9 నుంచి ఇంటర్ పరీక్షలు
ఆదిలాబాద్ అర్బన్ : ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 25వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేటు యూజమాన్యాలు ఏవైనా ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పది సిట్టింగ్స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడిపించాలని ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయూలని, నిరంతరం విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయూ శాఖల అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతోపాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు. పరీక్ష ప్రశ్నపత్రాల రవాణా సమయంలో బందోబస్తు ఏర్పాటు చేయూలని ఎస్పీకి సూచించారు. రీజినల్ తనిఖీ అధికారి సీహెచ్.ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 19,613 మంది, ఒకేషనల్‌లో 3,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 22,250 మంది, ఓకేషనల్‌లో 2,756 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌లో మొదటి సంవత్సరం జనరల్‌లో 5,071 మంది, ఒకేషనల్‌లో 832 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా 53,523 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం 89 పరీక్ష కేంద్రాలు, నాలుగు ఫ్లరుుంగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ప్రసాదరావు, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, దిలావర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెగ్జాండర్, సీఐ పోతం శ్రీనివాస్, విద్యా శాఖ ఏడీ జలీల్ పాషా, పోస్టల్ శాఖ అధికారి విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అవును.. మాకూ ‘పరీక్షే’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వరుసగా పురపాలక, ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలు, ఆపై సాధారణ ఎన్నికలు.. ఈ సమయంలోనే పదో తరగతి పరీక్షలు. అటు పరీక్షల విధులు నిర్వహిస్తూ.. ఇటు ఎన్నికల విధులు, శిక్షణ తరగతులకు హాజరుకావడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అయినప్పటికీ ప్రత్యేక దృష్టిసారించి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సోమిరెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి ఏర్పాట్లకు సంబంధించి సోమవారం డీఈఓ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పరీక్షా కేంద్రాలు 427.. జిల్లాలో టెన్త్ పరీక్షలకు 427 కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి పరిధిలో 1,804 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి 98,447 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో 82,405 మంది రెగ్యులర్, 16,042 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారితోపాటు మొత్తంగా 4,992 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. ఏర్పాట్లు పూర్తి పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 20 ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు, 40 సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలు ఏర్పాటు చేశాం. గతంలో సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలు 15 ఉండగా ఈసారి 40కి పెంచడంతో పరీక్షలు మరింత కట్టుదిట్టంగా జరుగుతాయని భావిస్తున్నాం. పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్పకుండా గుర్తింపు కార్డులు పెట్టుకోవాలి. ప్రతి కేంద్రంలో మౌలికవసతులు పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఫర్నిచర్, విద్యుత్తు, తాగునీరు, శానిటేషన్ వసతులు కల్పించాం. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుంది. పరీక్ష ముగిసిన వెంటనే చీఫ్ సూపరింటెండెంట్లు జవాబుపత్రాలను పాలిథిన్ కవర్లు, కాటన్ బ్యాగులో సీల్ చేయాల్సి ఉంటుంది. టీచర్లూ.. రాజకీయాలొద్దు.. ఎన్నికల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనొద్దు. ఎన్నికల ప్రచారంలో, బహిరంగ సభల్లో పాత్ర పోషించొద్దు. లిఖిత పూర్వక ఫిర్యాదులు, పూర్తిస్థాయి ఆధారాలతో ఫిర్యాదులొస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలకు వెనకాడం. విద్యార్థులూ.. ఆల్ ది బెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. అన్ని పాఠశాలలకు ఇప్పటికే హాల్‌టిక్కెట్లు పంపిణీ చేశాం. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్షా కేంద్రాన్ని ముందురోజే చూసుకుని, సమయం కంటే గంట ముందు కేంద్రానికి చేరితే సరిపోతుంది.