ఆదిలాబాద్ అర్బన్ : ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 25వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేటు యూజమాన్యాలు ఏవైనా ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పది సిట్టింగ్‌స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడిపించాలని ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయూలని, నిరంతరం విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయూ శాఖల అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతోపాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు.
పరీక్ష ప్రశ్నపత్రాల రవాణా సమయంలో బందోబస్తు ఏర్పాటు చేయూలని ఎస్పీకి సూచించారు. రీజినల్ తనిఖీ అధికారి సీహెచ్.ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్‌లో 19,613 మంది, ఒకేషనల్‌లో 3,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 22,250 మంది, ఓకేషనల్‌లో 2,756 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు.
ప్రైవేట్‌లో మొదటి సంవత్సరం జనరల్‌లో 5,071 మంది, ఒకేషనల్‌లో 832 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా 53,523 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి కోసం 89 పరీక్ష కేంద్రాలు, నాలుగు ఫ్లరుుంగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ప్రసాదరావు, డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, దిలావర్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అలెగ్జాండర్, సీఐ పోతం శ్రీనివాస్, విద్యా శాఖ ఏడీ జలీల్ పాషా, పోస్టల్ శాఖ అధికారి విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
9 నుంచి ఇంటర్ పరీక్షలు
Published Thu, Mar 5 2015 2:42 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement
Advertisement