Regular students
-
సర్వం సిద్ధం
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 5 నిమిషాలకు మించి ఆలస్యమైతే అనుమతి లేదు విద్యారణ్యపురి : పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నారుు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 53,507 మంది రెగ్యులర్ విద్యార్థులు, 298 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ వారిలో 27,064 మంది బాలురు, 26,443 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 254 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 254 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 254 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 3 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, నిర్ణీత సమయం దాటిన 5 నిమిషాల వరకు కూడా అనుమతి ఉంటుందని, అంతకంటే ఎక్కువ ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 9 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కాపీయింగ్ నిరోధానికి పది సిట్టింగ్ స్క్వాడ్లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్‌సెంటర్లను మూసివేస్తారు. హాల్‌టికెట్లు అందనివారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ తెలంగాణ. ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. -
ప్రభుత్వ బడి పదిలం
గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రభుత్వ, గుర్తిం పు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 54 వేల మంది హాజ రు కానున్నారు.ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అవగాహన పెరగడం, విద్యా హక్కు చట్టం ప్రభావం వంటి కారణాలను గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడినట్టుగా చెప్పుకోవచ్చు.గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ రెగ్యులర్‌గా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య మూడేళ్ల నుంచి క్రమేణా పెరుగుతోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 వేల మంది విద్యార్థులు పెరిగారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు అధిక సంఖ్యలో దరఖాస్తు చేశారు. 2012 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి 45 వేలు, ప్రైవేటుగా 15 వేల మంది విద్యార్థులు ఉన్నారు.2013లో 60,216 మంది దరఖాస్తు చేయగా వారిలో 52,047 మంది రెగ్యులర్ కాగా, 8,169 మంది మాత్రమే ప్రైవేటు విద్యార్థులు. గుర్తింపు లేని స్కూళ్లతో చదివితే ప్రైవేటు విద్యార్థులే... పరీక్షల్లో ఒకసారి తప్పిన విద్యార్థులతో పాటు ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదువుతూ పరీక్షలకు దరఖాస్తు చేసే విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటుగా పరిగణిస్తోంది. జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలల్లో కొన్నిటికి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటుగా పరిగణించడాన్ని వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులు అవమానంగా భావిస్తున్నారు. గుర్తింపు పొందని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల అనంతరం ప్రభుత్వం జారీ చేసే మార్కుల జాబితాపై ప్రైవేటు అభ్యర్థి అని ముద్రిస్తోంది. అలాగే గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే టీసీలకు ప్రభుత్వపరంగా ఎలాంటి విలువ ఉండదని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. అంతేగాకుండా గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పదో తరగతి అనంతరం పై చదువులకు వెళ్లే సమయంలో ఇబ్బందులు వస్తాయి. 9,10 తరగతులను ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితేనే పదో తరగతి విద్యార్థులను రెగ్యులర్‌గా పరిగణించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఆయా పాఠశాలల్లో చదివినా ప్రయోజనం లేదని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించేందుకు వెనకాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య... పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి హాజరు కానున్న విద్యార్థుల సంఖ్య గత ఏడాది కంటే మూడు వేలు పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివితేనే విద్యార్థుల సర్టిఫికెట్లకు విలువ ఉంటుందని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్య అందిస్తూ, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నాం. - కేవీ శ్రీనివాసులురెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
లేరు లేరంటూనే.. ఎనిమిది వేలు!
బాలకార్మికులు రెండు వేలకు మించిలేరు... అనాథపిల్లల సంఖ్య అంతంత మాత్రమే... డ్రాపవుట్లు వెతికినా పదుల సంఖ్యలోనే ఉన్నారు... బడికి దూరంగా ఉన్న పిల్లలు కూడా వేళ్లపై లెక్కించే సంఖ్యలోనే ఉన్నారు. కానీ... కేవలం వీరికోసం నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) 7,930 మంది బాలికలు చదువుతున్నారు. అంటే అధికారులు చెప్పేదానికి.. వాస్తవానికి ఎక్కడా పొంతన లేదని అర్థమవుతోంది. ప్రధానంగా కేజీబీవీల్లో చదువుతున్న బాలికల సంఖ్య అంచనాకు మించి ఉండటం అనుమానాలకు దారితీస్తోంది. రెగ్యులర్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. అందుకే ఈ గణాంకాల్లో తేడా ఉందని తేలిపోతోంది. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఇటీవల కరీంనగర్ డివిజన్లో ఒక ఎంఈవో అక్కడి కేజీబీవీలో 40 మందికిపైగా రెగ్యులర్ విద్యార్థులు ఉన్న ట్లు స్వయంగా గుర్తించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వారిని తిరిగి రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారులు సైతం బిత్తరపోయారు. అన్ని కేజీబీవీల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందనే ఆందోళన వ్యక్తమైంది. ఒకవైపు రెగ్యులర్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుంటే కేజీబీవీలకు విద్యార్థులను మళ్లించటం కొత్త అనుమానాలకు తెరలేపింది. జిల్లాలో మొత్తం 51 కేజీబీవీలున్నాయి. వీటిలో 42 విద్యాలయాలను స్వయంగా రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షిస్తోంది. బాలకార్మికులు.. అనాథపిల్లలు... డ్రాపవుట్లు.. బడికి దూరంగా ఉన్న బాలికలను మాత్రమే వీటిలో చేర్చుకోవాలి. ఇవన్నీ స్పెషలాఫీసర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల అధ్వర్యంలో నడుస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్లు, సర్కారు పాఠశాలలతో పోలిస్తే ఈ విద్యాలయాలకు ప్రభుత్వం దాదాపు రెండింతలు ఖర్చు చేస్తోంది. ఒక్కో విద్యార్థినికి రోజుకు అల్పాహారం భోజనం ఖర్చుల కింద రూ.33 విడుదల చేస్తోంది. ఎంబ్రాయిడరీ తదితర ఉపాధి కోర్సుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని కేజీబీవీల నిర్వహణను రాజీవ్ విద్యామిషన్ తమ గుప్పిట బిగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోధన, భోజన వసతి సదుపాయాలు ఒకేచోట ఉంటాయని ఆశజూపి కొన్నిచోట్ల రెగ్యులర్ విద్యార్థులను మళ్లించటం.. కొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నా ఎక్కువ సంఖ్య చూపించటం వెనుక ఎక్కువ పర్సెంటేజీలు మిగులుతాయనే కక్కుర్తి ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. నెల రోజులైనా కేజీబీవీ పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేయకుండా రాజీవ్ విద్యామిషన్ అధికారులు దాచిపెట్టిన నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఏ కార్యాలయంలో ఇటీవల వివిధ సెక్షన్ల అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం వెనుక కేజీబీవీలకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లే కారణమనే విమర్శలున్నాయి. గత ఏడాది కేజీబీవీలకు కుట్టుమిషన్లతో పాటు వివిధ సామగ్రిని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు, కమిషన్లలో ఎవకిరి వారుగా చేతివాటం ప్రదర్శించటమే కార్యాలయంలో వివిధ సెక్షన్ల మధ్య వివాదానికి తెర లేపిందని తెలుస్తోంది. ఆపన్నులకు, కొత్తగా బడిబాట పట్టిన బాలికలకు నాణ్యమైన బోధన అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేజీబీవీలు ఆర్వీఎం అధికారుల నిర్లక్ష్యం.. ఇష్టారాజ్యంతో గాడి తప్పుతున్న సంకేతాలు జారీ చేస్తున్నాయి. -
కిరణజన్యసంయోజక కాండం చూడబడుతుంది
b.rajendra senior Faculty,Hyderabad With new syllabus being introduced for the first time in EAMCET question papers it is the long term students rather than regular students face difficulty in last hour preparation and revision for the exam. For the convenience of the student for a better preparation and revision, at this hour of examination time, in Botany subject the entire subject can be divided into parts. As the topics of the Botany are not properly arranged for better understanding of the subject it is difficult for a comprehensive division into parts . The first year syllabus is divided here into three parts viz Units-I & II; Units- III & IV; Units-V, VI & VII. Similarly second year topics also divided into Unit-I; Units-II & VI ; Units- III, IV & V . A student can club first and second year topics for preparation according to his convenience. In the Unit- I of first year basic features of different plants groups are discussed with much ambiguity. This unit very important for the exam point of view. Unit-II is comparatively much easier and questions are also straight with no difficulty. Eamcet Botany Some model questions from Unit- I & II of First year 1. Nuclear membrane is absent in I. Mycoplasma II. Actinomycetes III. Diniflagellates IV. Euglenoids 1) A & B 2) B & C 3) C & D 4) A, B, C & D 2. Yeast is unicellular, eukaryote. It is included in 1) Mycetae 2) Monera 3) Protista 4) Mycobacteria 3. Chitin is cell wall component of 1) Spirogyra 2) Ustilago 3) Cuscuta 4) Riccia 4. True statement regarding Monera is 1) All are uninucleate 2) Nucleus is absent in most 3) Some of them are photosynthetic 4) Sexual reproduction is common 5. Assertion(A): Chlorella cannot be included in plant kingdom Reason(R): Chlorella is unicellular. 1) Both A and R are correct and R is the correct explanation of A. 2) Both A and R are correct but R is not the correct explanation of A. 3) A is true, R is false 4) A is false, R is true. 6. Bracket fungi belongs to 1) Phycomycetes 2)Ascomycetes 3) Basidiomycetes 4) Deuteromycetes 7. In six kingdom classification which group of five kingdom is replaced 1) Protista 2) Monera 3) Fungi 4) Plantae 8. The basis for evolutionary sequence of groups in six kingdom classification is 1) Nucleus 2) Cellwall 3) Flagella 4) RNA 9. One of the groups which has no mention in the Whittaker classification is A. Yeast B. Lichens C. Viruses D. Mycorrhiza 1) A & B 2) B & C 3) B, C & D 4) D & A 10. Viruses were described as venom by 1) Pasteur 2) Carl Woese 3) Diener 4) Jenner 11. Assertion(A): Viruses can be crystallized Reason (R): Viruses are chemical by nature 1) Both A and R are correct and R is the correct explanation of A. 2) Both A and R are correct but R is not the correct explanation of A. 3) A is true, R is false 4) A is false, R is true. 12. 'Scrapie disease' is caused by 1) Monera 2) Protista 3) Fungi 4) Proteins 13. True statement regarding protista 1) Cell wall is well developed 2) Nuclear membrane is absent 3) Nutrition is heterotrophic 4) All the above 14. Ficus belongs to family 1) Bromeliaceae 2) Moraceae 3) Annonaceae 4)Anacardiaceae 15. The primary root is 1) The prominent root in the dicot plant 2) The root that grows into soil 3) The root that bears secondary and tertiary roots 4) Root transformed from radical 16. Stilt roots are found in 1) Maiz 2) Corms 3) Asparagus 4) Casuariana 17. Photosynthetic stems are seen in 1) Opuntia 2) Euphorbia 3) Casuarina 4) All the above 18. Parietal placentation with two chambers are observed in 1) Datura 2) Mustard 3) Cucumber 4) Tomato 19. Fruit in Custard apple 1) Schizocarp 2) Multiple fruit 3) Aggregate fruit 4) False fruit 20. In a discoid inflorescence with acropetal succession of flowers the youngest flower is located at 1) Distal 2) Proximal 3) Central 4) Peripheral 21. True statement regarding Nepenthes I. Leaves perform three different functions II. It is a parasitic plant III. It is not a flowering plant IV. Leaves are secretary 1) I & II 2) II & III 3) III & IV 4) IV & I 22. Assertion (A): Root perform photosynthesis in Taeniophyllum. Reason (R): Root are aerial in Taeniophyllum, 1) Both A, R are true and R is the correct explanation of A. 2) Both A, R are true but R is not the correct explanation of A. 3) A is true but R is false 4) A is false but R is true 23. Swollen petiole helps in buoyancy in 1) Pistia 2) Eichornia 3) Paddy 4) Legume plants 24. Isogametes or gametes of similar size are seen in A. Chlamydomonas B.Spirogyra C. Volvox D. Chladophora 1) A & B 2) B & C 3) A, B & D 4) B, C & D 25. Assertion (A): the most common asexual spores in algae are zoospores Reason (R): Algae are largely aquatic 1) Both A, R are true and R is the correct explanation of A. 2) Both A, R are true but R is not the correct explanation of A. 3) A is true but R is false 4) A is false but R is true 26. Algae used as food supplements by space travelers 1) Porpyra & Laminaria 2) Gelidium & Gracilaria 3) Chlorella & Spirulina 4) Dictyota & Fucus. 27. Multicellular sex organs and monoecious thallus is seen in A. Chara B. Marchantia C. Funaria D. Sphagnum 1) A & B 2) B & C 3) A,C& D 4) A, B, C & D 28. Flagella or motile structures are totally absent in the life cycle of 1) Cyanophyceae 2) Rhodophyceae 3) Angiosperms 4) All the above 29. The plant body of Pheophyceae is distinguished into 1) Hold fast, stipe & frond 2) Rhizoids, stipe & frond 3) Root, stem & leaf 4) Rhizoid, phylloid & cauloid. 30. Chlorophyll a & d is present in 1) Chlorophyceae 2) Chrysophyceae 3) Pheophyceae 4) Rhodophyceae 31. False statement regarding Bryophytes I. All Bryophytes are homosporous II. Haploid stage is dominant III. Sporophyte is partially parasitic in all Bryophytes IV. Sporophyte is distinguished into foot, seta and capsule 1) I & II 2) III 3) I & IV 4) III & IV 32. Sterile structure helping in the dispersal of spores 1) Paraphyses 2) Elaters 3) Indusial hairs 4) Ramenta 33. Match the following List-I A. Hair cup moss B. Bracket fungi C. Club moss D. Golden algae List-II I. Pteridophyta II. Bryophyta III. Pheophyceae IV. Basidiomycotina V. Chrysophyta A B C D 1) I III II V 2) II IV I V 3) II IV I III 4) IV I II V 34. The earliest information on medicinal plants and uses are recorded in 1) Vrikshayurveda 2) Krishiparasaram 3) Atharvanaveda 4) de Historia Plantarum 35. True statement regarding 'Krishiparasaram'. I. It is the oldest book on agriculture II. Information regarding the weeds is mentioned in this book III. External and internal characters of medicinal plants is described IV. Different types of forests were described 1) I & II 2) II & III 3) III & IV 4) IV & I 36. Sexual reproduction in plants is discovered by 1) Strausberger 2) Camerarius 3) Maheshwari 4) Stephen Hales 37. Match the following Scientist A. H.G.Khorana B. White C. J.B.Sumner D. Rama das Field of study I. Plant tissue culture II. C4 photosynthesis III. Synthesis of artificial gene IV. Crystallization of enzyme urease V. Light reactions of photosynthesis A B C D 1) III I IV II 2) III I IV V 3) IV V III II 4) IV III I V 38. Swollen petiole is found in 1) Leguminous plants 2) Eichornia 3) Opuntia 4) Citrus 39. The sheath like leaf base is seen in A. Grass B. Neem C. Musa D. Cocus 1) A & B 2) B & C 3) C & D 4) A, C & D 40. Alstonia is an example for 1) Underground stem modification 2) Insectivorous leaf 3) Tendrillar leaf 4) More than two leaves arising from a node Key 1) 4 2) 1 3) 2 4) 3 5) 1 6) 3 7) 2 8) 4 9) 3 10) 1 11) 1 12) 4 13) 4 14) 2 15) 4 16) 1 17) 4 18) 2 19) 3 20) 3 21) 4 22) 2 23) 2 24) 3 25) 1 26) 3 27) 3 28) 2 29) 1 30) 4 31) 2 32) 2 33) 2 34) 3 35) 1 36) 2 37) 1 38) 2 39) 4 40) 4 -
పరీక్షల ‘టెన్’షన్
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నారుు. ఏప్రిల్ 11 వరకూ జరిగే పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 50 వేల 408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, జిల్లా వ్యాప్తంగా 239 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 45,683మంది కాగా, వారిలో బాలురు 22,674 మంది, బాలి కలు 23,009 మంది ఉన్నారు. 4,725 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, వారిలో బాలురు 3,065 మంది, బాలికలు 1,660 మంది ఉన్నారు. ప్రైవేటు విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ను నివారించేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. 239 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 239 మంది డిపార్టుమెం టల్ అధికారులు, 3,654మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పటిష్ట ఏర్పాట్లు చేశాం : డీఈవో పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈవో ఆర్.నరసింహరావు తెలి పారు. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చోకుండా పరీక్షలు రాసేలా సదుపాయం కల్పిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశామని, తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించరు సైన్సు సబ్జెక్టు పరీక్షలకు మినహా జామెట్రీ బాక్సులను అనుమతించరు. ఓఎంఆర్ షీటుపై ఎటువంటి రాతలు రాయకూడదు. దానిపై విద్యార్థి వివరాలు కరెక్టుగా ఉన్నాయో లేదో పరి శీలించి, తప్పులుంటే ఇన్విజిలేర్ దృష్టికి తీసుకువెళ్లాలి ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై ఎటువంటి రాతలు ఉండకుండా జాగ్రత్త పాటించాలి. జవాబు పత్రాలపై విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు రాయకూడదు. రాస్తే మూల్యాంకన చేయరు.జవాబులను బ్లాక్ లేదా బ్లూ ఇంక్ బాల్‌పాయింట్ పెన్‌తో రాయాలి. -
అడ్మిషన్ల దందా
సాక్షి, అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏసీ తరగతి గదులు, ఇతర హంగులతో ఓ ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలకు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే... పదో తరగతి అడ్మిషన్లు కూడా చేసుకున్నారు. మొత్తం 15 మంది విద్యార్థులు ఇక్కడ పదో తరగతి చదువుతున్నారు. వీరికి పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఆ పాఠశాల యాజమాన్యం రాంనగర్‌లోని ‘గుర్తింపు’ ఉన్న మరో పాఠశాలలో పేర్లు నమోదు చేయించి... రెగ్యులర్ విద్యార్థులుగా పరీక్షలు రాయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విద్యార్థుల నుంచి భారీగానే వసూలు చేసింది. కేవలం ఈ పాఠశాలలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలలో అడ్మిషన్ల దందా కొనసాగుతోంది. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే అన్ని తరగతుల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల సమయంలో దొడ్డిదారులను వెతుకుతున్నారు. గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ‘రెగ్యులర్’గా చదివినట్లు చూపుతూ... పరీక్షలు రాయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై తల్లిదండ్రులకూ ఏయేటికాయేడు మోజు పెరుగుతూనే ఉంది. వాటిలో చదివితే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది వారి ఆశ. ఆర్థిక స్థోమత లేకపోయినా కూలీలు, ఆటోడ్రైవర్లు సైతం నానా అవస్థలు పడి రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వాటి యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 762 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 217 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఇందులో గుర్తింపులేనివి 53 ఉన్నట్లు విద్యాశాఖ రికార్డులు చెబుతున్నాయి. గుర్తింపు లేని పాఠశాలల్లో పదో తరగతికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.20-25 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల సమయంలో మరో రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు దండుకుంటున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని విద్యార్థులు ‘రెగ్యులర్’గానే పరీక్షలు రాస్తారు. వీరికి ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు రూ.125. కానీ.. వాటి నిర్వాహకులు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,350కు పైగా దండుకుంటున్నారు. ‘గుర్తింపు’ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం దాదాపు 13 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వాటి యాజమాన్యాలు ఏ మేరకు సొమ్ము చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం తమ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు లేదనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం తెలియనివ్వడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా వేరే పాఠశాలల్లో బోగస్ హాజరు వేయించి.. వాటి నుంచే విద్యార్థులను పరీక్షలకు పంపడానికి రంగం సిద్ధం చేశారు. ఇలా పరీక్షలు రాస్తే ఆ విద్యార్థి ఉత్తీర్ణత సాధించిన తరువాత మార్కుల జాబితా, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, స్టడీ, కాండక్టు సర్టిఫికెట్లు ‘వేరే పాఠశాల’ మీదుగానే వస్తాయి. కార్పొరేట్, పేరెన్నికగల పాఠశాలలో చదివినట్లు గుర్తింపు ఉండదు. కాదు..కూడదనుకుంటే ‘ప్రైవేటు’ విద్యార్థులుగానే పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ద్వారా పరీక్షలకు హాజరైతే స్టడీ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా చాలా ఉద్యోగాలకు అభ్యర్థులను ‘లోకల్ ఏరియా’గా పరిగణించాలంటే స్థానికంగా కనీసం ఐదేళ్ల పాటు చదివి ఉండాలనే నిబంధన ఉంది. ప్రైవేటుగా పరీక్ష రాసినప్పుడు ఆ ధ్రువపత్రం పాఠశాల నుంచి తీసుకునే అవకాశం లేదు. అప్పుడు రెవెన్యూ పరంగా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అందుకు నానా అవస్థలు పడాలి. అంటే విద్యాసంస్థలు చేస్తున్న మోసాలకు విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్మిషన్ల దందా గురించి తెలిసినా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గుర్తింపులేని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు గుర్తింపు ఉన్న విద్యాసంస్థలలో బోగస్ హాజరుతో రెగ్యులర్ విద్యార్థులుగా నమోదవుతున్నారు. అందుకు ఆ పాఠశాలల యాజమాన్యాలు గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకు ఒక్కొక్క విద్యార్థిపై రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు చెల్లిస్తున్నాయి. నిబంధనల ప్రకారమైతే గుర్తింపులేని పాఠశాలల విద్యార్థులు ‘ప్రైవేటు’గా పరీక్షలు రాయాలి. అందుకు ప్రభుత్వానికి హాజరు మినహాయింపు కింద రూ.650, పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూపంలోనూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ విద్యావ్యవస్థనే భ్రష్టుపట్టిస్తున్నారు.