పరీక్షల ‘టెన్’షన్
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నారుు. ఏప్రిల్ 11 వరకూ జరిగే పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 50 వేల 408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, జిల్లా వ్యాప్తంగా 239 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రెగ్యులర్ విద్యార్థులు 45,683మంది కాగా, వారిలో బాలురు 22,674 మంది, బాలి కలు 23,009 మంది ఉన్నారు. 4,725 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, వారిలో బాలురు 3,065 మంది, బాలికలు 1,660 మంది ఉన్నారు. ప్రైవేటు విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ను నివారించేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. 239 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 239 మంది డిపార్టుమెం టల్ అధికారులు, 3,654మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
పటిష్ట ఏర్పాట్లు చేశాం : డీఈవో
పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈవో ఆర్.నరసింహరావు తెలి పారు. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చోకుండా పరీక్షలు రాసేలా సదుపాయం కల్పిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశామని, తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించామని పేర్కొన్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలివీ
ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించరు
సైన్సు సబ్జెక్టు పరీక్షలకు మినహా జామెట్రీ బాక్సులను అనుమతించరు.
ఓఎంఆర్ షీటుపై ఎటువంటి రాతలు రాయకూడదు.
దానిపై విద్యార్థి వివరాలు కరెక్టుగా ఉన్నాయో లేదో పరి శీలించి, తప్పులుంటే ఇన్విజిలేర్ దృష్టికి తీసుకువెళ్లాలి
ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై ఎటువంటి రాతలు ఉండకుండా జాగ్రత్త పాటించాలి.
జవాబు పత్రాలపై విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు రాయకూడదు. రాస్తే మూల్యాంకన చేయరు.జవాబులను బ్లాక్ లేదా బ్లూ ఇంక్ బాల్‌పాయింట్ పెన్‌తో రాయాలి.