‘వరుస కథనా’లకు వందనం
సాక్షి ఇటీవల సర్కారీ బడులపై ప్రచురించిన వరుస కథనాలు అద్భు తం. అహరహం పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకానికి ఆక్సిజన్. కార్పొ రేట్ మాయలో, ప్రైవేటు మోజులో ఉన్న వారికెందరికో ఈ కథనాలు మేలుకొలుపు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో నేడు విద్యాభ్యాసం చేస్తున్న ఒక్క విద్యార్థిని ప్రగతిబాట పట్టించాలంటే ఉపాధ్యాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలై ఉండి విద్యార్థి తల్లికి, తండ్రికి, తోబుట్టువులకు సైతం విద్యపై సకారాత్మక వైఖరిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. నిక్కచ్చిగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక విద్యార్థి 10 మంది ప్రైవేట్ విద్యార్థులతో సమానం.
ఎంతో పట్టుదల, వృత్తిపై మమకారం, సామాజిక స్పృహ అణువణువునా ఉపాధ్యాయుడిలో ఉంటే తప్ప, సిబ్బంది అంతా చెట్టపట్టాలేసుకొని ఐక్యంగా కృషి చేస్తే తప్ప ఫలితాలు రావు. అలాంటి ఫలితాల వెనుక కఠోరశ్రమ, కఠిన దీక్ష, ఐక్య పరిశ్రమలు ఉంటాయి. ఈ నిజాలను గమనించిన ‘సాక్షి’ ‘సత్తాచాటిన సర్కారీ బడులు’ ‘ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు’ ‘థాంక్యూసర్’ వంటి కథనాలు ప్రచురించి నిజాలను నిర్మొహమా టంగా నిగ్గుతేల్చింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యా సమా జానికి... సర్కారీ బడుల సత్తాను స్వచ్ఛంగా ప్రమోట్ చేస్తున్నందుకు ఉపాధ్యాయ లోకం పక్షాన నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి ప్రోత్సాహం ముందు ముందు కూడా అందించాలి.
- ఎస్.మురళీధర్ చిన్నపెండ్యాల, ఘన్‌పూర్ (స్టేషన్)