private students
-
సూదంటురాళ్లైన సర్కారీ డిగ్రీ కళాశాలలు
* బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులపై పెరిగిన మొగ్గు * ఎక్కువ మార్కులతో సీట్లు దక్కించుకుంటున్న ‘ప్రైవేట్’ విద్యార్థులు * పోటీ పడలేక నష్టపోతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభ్యర్థులు బాలాజీచెరువు (కాకినాడ) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంతవరకూ ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, ఐటీఐ సీట్లకు మాత్రమే ఉన్నడి మాండ్ ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో సీట్లకూ పెరిగింది. ఒకప్పు డు ఇంటర్మీడియట్ ప్రభు త్వ జూనియర్ కాలేజీల్లో చదివి, అంతంత మాత్రపు మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే సర్కారీ డిగ్రీ కళాశాల ల్లో చేరే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లను ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల విద్యార్థులు దక్కించుకుంటుండగా.. వారితో పోటీ పడలేక ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి వచ్చిన వారు అవకాశాలకు దూరమవుతున్నారు. ఇంటర్మీడియట్ కార్పొరేట్ కళాశాలల్లో చదివి, 90 శాతం పైబడి మార్కులు సాధించిన విధ్యార్దులు ప్రభుత్వ కళాశాలల్లో చదవడానికి మక్కువ చూపుతున్నారంటే డిగ్రీ కోర్సులకు గిరాకీ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఉదాహరణకు ఇంటర్మీడియట్ సీఈసీ గ్రూపులో 800 మార్కులు వచ్చిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థికి కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌లో సీటు రాలేదు. దరఖాస్తుల వెల్లువ జిల్లాలో పిఠాపురం, అన్నవరం, ఏలేశ్వరం, పెద్దాపురం, అమలాపురం, రాజ మండ్రి, తుని, రాజోలు, కొత్తపేట తదితర ప్రాంతాల లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుం డగా వీటిలో బీఏ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో దాదాపు నాలుగు వేల సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దరఖాస్తులు వెల్లువెత్తారుు. ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ గ్రూపు చదివిన విద్యార్థులు బీకాం (కంప్యూటర్స్)లో చేరడానికీ, సైన్స్ గ్రూపు విద్యార్థులు బీఎస్సీ (మ్యాథ్స్)లో చేరడానికీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బీకాంలో సీఏ సంబంధిత కోర్సు, బీఎస్సీ మ్యాథ్స్‌లో ఇంజనీరింగ్ సబ్జెక్టులైన పెట్రోకెమికల్స్, ఫుడ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు ఉండటం, కార్పొరేట్ కళాశాలలతో సమానంగా ప్రభుత్వ కళాశాలల్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం వారి ఆసక్తికి ఓ ప్రధాన కారణం. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం సీట్లు 160 ఉండగా ఆరు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటర్లో 800 మార్కులు పైబడి వచ్చిన వారికే కాల్ లెటర్లు పంపించారు. బీఎస్సీకి సంబంధించి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఇంజనీరింగ్ తరహాలో సెమిస్టర్ విధానం ఉండటం కూడా విద్యార్థుల ఆసక్తికి మరో కారణమని చెప్పవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారికి సీట్లు కేటాయించాలి.. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివే పేద, సామాన్య వర్గాల విద్యార్థులు ఇంటర్ అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు రాక నిరుత్సాహపడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులే 90 శాతం పైగా మార్కులతో డిగ్రీ సీట్లను దక్కించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు నష్టపోతున్నారు. అలాంటి వారికి సీట్లు కేటాయించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జేకేసీల వల్లా పెరుగుతున్న ఆసక్తి ప్రభుత్వ కళాశాలల్లో కూడా కార్పొరేట్ కాలేజీల తరహాలో అత్యాధునిక పరికరాలు, ఈ లైబ్ర రీ, ల్యాబ్‌ల వంటి సౌకర్యాలు ఉండటంతో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించడానికి తోడ్పడేలా జేకేసీల ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందింపజేయడానికి శిక్షణ ఇవ్వడంతో విద్యార్థుల ఆసక్తి పెరుగుతోంది. - డాక్టర్ చప్పిడి కృష్ణ, ప్రిన్సిపాల్, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ -
టెన్త్‌లో బాలికల హవా
బాలుర ఉత్తీర్ణత 84.70%.. బాలికల ఉత్తీర్ణత 86.57% పదో తరగతిలో మొత్తంగా 85.63% ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎప్పట్లాగే ఈసారి కూడా బాలికలే ముందంజలో నిలిచారు. బాలుర కంటే అధిక ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 2,62,187 మంది బాలురు హాజరు కాగా 2,22,071 మంది (84.70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,57,307 మంది హాజరు కాగా 2,22,757 మంది (86.57 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. జిల్లాలవారీగా చూస్తే 95.13 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ ప్రథమ స్థానంలో నిలువగా.. 76.23 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 2,379 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా.. 10 పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. పరీక్షలకు 99.71 శాతం హాజరు ఈసారి పదో తరగతి పరీక్షలు రాసేందుకు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి 5,56,885 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 5,55,265 మంది (99.71 శాతం) హాజరయ్యారు. ఇందులో 4,58,964 మంది ఉత్తీర్ణులు కాగా 95,301 మంది ఫెయిల్ అయ్యారు. పరీక్షలకు హాజరైన 5,19,494 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో 4,44,828 మంది (85.63 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 35,771 మంది హాజరు కాగా 14,136 మంది (39.52 శాతం) ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ గురుకులాలు 96.84 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ పాఠశాలలు 77.80 శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత 85.63 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణతను సాధించాయి. గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 5,13,473 మంది హాజరు కాగా 3,98,267 మంది (77.56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి 85.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 8.07 శాతం ఉత్తీర్ణత పెరిగింది. బాలికల ఉత్తీర్ణత శాతం కూడా ఈసారి పెరిగింది. గత ఏడాది 2,55,035 పరీక్షలకు హాజరు కాగా 2,01,582 మంది (79.04 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అదే ఈసారి 86.57 శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. ఈసారి పెరిగిన 10 జీపీఏ ఈసారి 3,419 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఏ1 గ్రేడ్‌తో పదికి 10 గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించారు. గతేడాది 10 జీపీఏ కేవలం 1,387 మందికే రాగా.. ఈసారి 3,419 మందికి రావడం విశేషం. అయితే ఇందులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే అత్యధికంగా (3,311 మంది) ఉన్నారు. ఇక 98,027 మందికి ఏ గ్రేడ్ రాలేదు. ఈ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత రాష్ట్రంలో మేనేజ్మెంట్ల వారీగా చూస్తే 2,379 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అందులో 121 ప్రభుత్వ పాఠశాలలు, 644 జిల్లా పరిషత్, 22 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా, 13 తెలంగాణ గురుకులాలు, 22 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 17 గిరిజన సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. మరో 6 బీసీ వెల్ఫేర్ గురుకులాలు, 30 కేజీబీవీ స్కూళ్లు, 43 మోడల్ స్కూళ్లు ఉండగా.. 1,461 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెరిగింది. 8 ప్రైవేటు స్కూళ్లలో సున్నా.. టెన్త్ ఫలితాల్లో 8 ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. మొత్తంగా 10 స్కూళ్లలో సున్నా ఫలితాలు రాగా అందులో 8 ప్రైవేటు పాఠశాలలే ఉన్నాయి. మిగతా రెండింటిలో ఒకటి ప్రభుత్వ పాఠశాల కాగా మరొకటి ఎయిడెడ్ పాఠశాల. -
‘వరుస కథనా’లకు వందనం
సాక్షి ఇటీవల సర్కారీ బడులపై ప్రచురించిన వరుస కథనాలు అద్భు తం. అహరహం పనిచేస్తున్న ఉపాధ్యాయ లోకానికి ఆక్సిజన్. కార్పొ రేట్ మాయలో, ప్రైవేటు మోజులో ఉన్న వారికెందరికో ఈ కథనాలు మేలుకొలుపు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో నేడు విద్యాభ్యాసం చేస్తున్న ఒక్క విద్యార్థిని ప్రగతిబాట పట్టించాలంటే ఉపాధ్యాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలై ఉండి విద్యార్థి తల్లికి, తండ్రికి, తోబుట్టువులకు సైతం విద్యపై సకారాత్మక వైఖరిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. నిక్కచ్చిగా చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక విద్యార్థి 10 మంది ప్రైవేట్ విద్యార్థులతో సమానం. ఎంతో పట్టుదల, వృత్తిపై మమకారం, సామాజిక స్పృహ అణువణువునా ఉపాధ్యాయుడిలో ఉంటే తప్ప, సిబ్బంది అంతా చెట్టపట్టాలేసుకొని ఐక్యంగా కృషి చేస్తే తప్ప ఫలితాలు రావు. అలాంటి ఫలితాల వెనుక కఠోరశ్రమ, కఠిన దీక్ష, ఐక్య పరిశ్రమలు ఉంటాయి. ఈ నిజాలను గమనించిన ‘సాక్షి’ ‘సత్తాచాటిన సర్కారీ బడులు’ ‘ప్రైవేటుకు దీటుగా సర్కారీ బడులు’ ‘థాంక్యూసర్’ వంటి కథనాలు ప్రచురించి నిజాలను నిర్మొహమా టంగా నిగ్గుతేల్చింది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యా సమా జానికి... సర్కారీ బడుల సత్తాను స్వచ్ఛంగా ప్రమోట్ చేస్తున్నందుకు ఉపాధ్యాయ లోకం పక్షాన నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ఇలాంటి ప్రోత్సాహం ముందు ముందు కూడా అందించాలి. - ఎస్.మురళీధర్ చిన్నపెండ్యాల, ఘన్పూర్ (స్టేషన్) -
బాబు వచ్చె.. సెలవులు తెచ్చె..
జిల్లాలో ప్రైవేట్ విద్యార్థులకు రెండు రోజులు అనధికారిక సెలవు సీఎం పర్యటనకు బలవంతంగా స్కూల్ బస్సుల తరలింపు బదులుగా సెలవుల్లో స్కూళ్లు పెట్టుకోవాలంటూ ఉచిత సలహా తప్పుబడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఏం చేసుకుంటారే ఏమో తెలీదు. మీ బస్సులను ముఖ్యమంత్రి కార్యక్రమాలకు పంపాలి. ఇది కలెక్టరు ఆర్డరు. కాదుగీదంటే మీ ఇష్టం. రేప్పొద్దున కలిగే ఇబ్బందులకు మేము బాధ్యులం కాము. ఆరోజు ఎవరూ కాపాడలేరు. -ఇదీ ఆర్టీఏ, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థలకు చేసిన బెదిరింపులు. ఆదివారం, రెండో శనివారం, పండుగలు, ప్రముఖుల జయంతి, వర్ధంతిలకు ప్రభుత్వ సెలవులు ఇవ్వడం పరిపాటి. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు సెలవులిచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన. సీఎం పర్యటించే ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి దాదాపు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను బలవంతంగా తీసుకెళ్లారు. ఎంకిపెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చిన్నట్టు.. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన విద్యార్థులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మామూలుగానైతే ఓ గంటపాటు అదనంగా తరగతులు పెట్టుకున్నా...సెలవురోజు తరగతులు పెట్టుకున్నా...ఆయా విద్యా సంస్థలపై నానాయాగీ చేసే అధికారులు ఇప్పుడేమో ఏకంగా రెండు రోజులుఅనధికారికంగా సెలవులు ఇచ్చారు. విద్యాశాఖ, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి బలవంతంగా ఒప్పించి స్కూలు బస్సులను సీఎం పర్యటనకు తరలించారు. సెలవుల్లోనేతే బస్సులను పంపేందుకు తమకేమీ బాధ లేదని, విద్యా సంస్థలు నడుస్తున్న రోజుల్లో ఇలా బలవంతం చేస్తే ఏం చేయాలంటూ ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇదిలాఉండగా గురువారం, శుక్రవారం ఇచ్చే సెలవులకు బదులుగా భవిష్యత్తులో ఏదైనా రెండో శనివారం, ఆదివారం లేదా ఇతర సెలవుల్లో విద్యా సంస్థలు నడుపుకోవాలంటూ విద్యాశాఖ అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు స్వయగా ఫోన్లు చేసి మరీ బస్సులను పంపాలని ఆదేశించడం విశేషం. ఓ విద్యా సంస్థ అధినేతే డీఈఓకు ఫోన్‌చేసి ‘సార్...బస్సులు పంపడం వీలు కాదు. పిల్లలకు ఇబ్బంది అవుతుంద’ని చెప్పుకొచ్చారు. ‘అదేందయ్యా...రెండ్రోజులు సెలవులిచ్చేయండి, ఇది కలెక్టరు ఆర్డరు అని చెబుతున్నా కదా. ఖచ్చితంగా బస్సులు పంపాల్సిందే’నంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది. 375 బస్సులు టార్గెట్ సీఎం పర్యటనకు విద్యా సంస్థల నుంచి 375 బస్సులను వినియోగించుకోవాలని ఆర్టీఏ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. బస్సుల తరలింపు బాధ్యతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) డి.శ్రీనివాసులు, డి.మనోహర్‌రెడ్డి, ఎంజే.పద్మభూషణరెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎస్.రమేష్, జి.శివారెడ్డి, సి.వాసుదేవరెడ్డి, వై.విశ్వనాథరెడ్డి తీసుకున్నారు. వీరు స్వాధీనం చేసుకున్న బస్సులను డీఆర్డీఏ, మెప్మా, హార్టికల్చర్, పశు సంవర్థకశాఖ, మైనర్ ఇరిగేషన్, హ్యాండ్లూమ్ శాఖల అధికారులకు అప్పగించారు. వారు ఆయా మండలాలకు తరలించారు. తప్పుబడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజల తరలింపుపై అభ్యంతరం లేదుకానీ, ప్రైవేటు విద్యా సంస్థలకు అనధికారిక సెలవులు ఇచ్చి మరీ వాటి బస్సులను వినియోగించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. అవసరమనుకుంటే డబ్బు ఖర్చుచేసి ప్రైవేట్ వాహనాలను సమకూర్చుచకోవాలి కానీ ఇలా విద్యా సంస్థల బస్సులను బలవంతంగా తీసుకెళ్లడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రథసారథులే ఇలా...విద్యార్థులకు ఇబ్బందులు కలిగేంచే వాటికి ఒడిగట్టడం ఏం బాగోలేదంటున్నారు. -
ప్రియమైన పాఠ్యపుస్తకం..
- భారీగా పెరిగిన టెక్స్ట్‌బుక్‌ల ధరలు - ప్రైవేటు విద్యార్థులకు అదనపు భారం - జిల్లాలో ఆ మొత్తం రూ.2.5 కోట్లకు పైనే.. రాయవరం, న్యూస్‌లైన్ : పిల్లలకు.. దీపావళి నాడు పొద్దు గుంకేసరికి కూడా బాణసంచా ఇంటికి రాకపోతే ఎంత వెలితిగా ఉంటుందో, బడులు తెరిచి, కొత్త తరగతిలోకి వెళ్లేసరికి కొత్త పాఠ్యపుస్తకాలు చేతికి రాకపోయినా అంతే వెలితిగా ఉంటుంది. కొత్త పుస్తకాల నుంచి వెలువడే ఓ విధమైన సుగంధం.. వారికి చదువుల తల్లి నిశ్వాసలా ఉంటుంది. వాటికి అట్టలు వేసుకోవడం, రంగురంగుల, బొమ్మల స్టిక్కర్లు అంటించి, పేర్లు రాసుకోవడం లేదా అమ్మానాన్నలతో రాయించుకోవడం అదో పండగ సందడే వారికి. అయితే తమ పిల్లల ఈ సరదాను తీర్చడం ఈసారి తల్లిదండ్రులకు భారం కానుంది. కారణం-2014-15 విద్యా సంవత్సరం నుంచి బోధించనున్న కొత్త పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడమే. పాఠ్యపుస్తకాల ధరలు గతేడాదితో పోల్చితే 80 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల సెట్ ధరల పెరుగుదల రూ.48 నుంచి రూ.242 వరకు ఉంది. ప్రభుత్వం మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగానే పాఠ్యపుస్తకాలను అందిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలను విధిగా బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే.పదో తరగతి సిలబస్ ఈ ఏడాది నుంచి పూర్తిగా మారిపోయింది. కొత్త సిలబస్‌లో పాఠ్యపుస్తకాలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వీటి ధర గతేడాది కంటే రూ.242 అధికంగా ఉంది. ఇప్పటికే తొమ్మిదో తరగతి వరకూ అమల్లో ఉన్న సీసీఈ విధానంలో కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించారు. జిల్లాలో 8.12 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 4.46 లక్షల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3.66 లక్షల మంది విద్యార్థులు చదవనున్నట్టు అంచనా. పాఠ్య పుస్తకాల ధరలు పెరగడంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులపై సుమారు రూ.2.5 కోట్ల అదనపు భారం పడనున్నట్టు అంచనా. జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు జూన్ మొదటి వారంలో పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ఆ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల కోసం పుస్తక విక్రయ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చిన వారు వచ్చిన పుస్తకాలను తెచ్చుకునే పనిలో పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు బుక్‌షాపులకు చేరుకోలేదని, జూన్ మొదటి వారానికి గానీ వచ్చే అవకాశం లేదని పలువురు పాఠశాల యజమానులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా పెంచిన పాఠ్యపుస్తకాల ధరలను తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పరీక్షల ‘టెన్’షన్
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నారుు. ఏప్రిల్ 11 వరకూ జరిగే పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 50 వేల 408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, జిల్లా వ్యాప్తంగా 239 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులు 45,683మంది కాగా, వారిలో బాలురు 22,674 మంది, బాలి కలు 23,009 మంది ఉన్నారు. 4,725 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా, వారిలో బాలురు 3,065 మంది, బాలికలు 1,660 మంది ఉన్నారు. ప్రైవేటు విద్యార్థుల కోసం 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ను నివారించేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. 239 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 239 మంది డిపార్టుమెం టల్ అధికారులు, 3,654మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పటిష్ట ఏర్పాట్లు చేశాం : డీఈవో పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈవో ఆర్.నరసింహరావు తెలి పారు. జిల్లాలో ఏ పరీక్షా కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చోకుండా పరీక్షలు రాసేలా సదుపాయం కల్పిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశామని, తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. పాటించాల్సిన జాగ్రత్తలివీ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించరు సైన్సు సబ్జెక్టు పరీక్షలకు మినహా జామెట్రీ బాక్సులను అనుమతించరు. ఓఎంఆర్ షీటుపై ఎటువంటి రాతలు రాయకూడదు. దానిపై విద్యార్థి వివరాలు కరెక్టుగా ఉన్నాయో లేదో పరి శీలించి, తప్పులుంటే ఇన్విజిలేర్ దృష్టికి తీసుకువెళ్లాలి ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై ఎటువంటి రాతలు ఉండకుండా జాగ్రత్త పాటించాలి. జవాబు పత్రాలపై విద్యార్థి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు రాయకూడదు. రాస్తే మూల్యాంకన చేయరు.జవాబులను బ్లాక్ లేదా బ్లూ ఇంక్ బాల్‌పాయింట్ పెన్‌తో రాయాలి.