సూదంటురాళ్లైన సర్కారీ డిగ్రీ కళాశాలలు | govt degree colleges 'Private' students | Sakshi
Sakshi News home page

సూదంటురాళ్లైన సర్కారీ డిగ్రీ కళాశాలలు

Published Tue, Jul 12 2016 3:56 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

సూదంటురాళ్లైన సర్కారీ డిగ్రీ కళాశాలలు

సూదంటురాళ్లైన సర్కారీ డిగ్రీ కళాశాలలు

* బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులపై పెరిగిన మొగ్గు
* ఎక్కువ మార్కులతో సీట్లు దక్కించుకుంటున్న ‘ప్రైవేట్’ విద్యార్థులు
* పోటీ పడలేక నష్టపోతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభ్యర్థులు

బాలాజీచెరువు (కాకినాడ) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంతవరకూ ఇంజనీరింగ్, మెడిసిన్, పాలిటెక్నిక్, ఐటీఐ  సీట్లకు మాత్రమే ఉన్నడి మాండ్ ఇప్పుడు డిగ్రీ కళాశాలల్లో సీట్లకూ పెరిగింది. ఒకప్పు డు ఇంటర్మీడియట్ ప్రభు త్వ జూనియర్ కాలేజీల్లో చదివి, అంతంత మాత్రపు మార్కులతో ఉత్తీర్ణులైన వారు మాత్రమే సర్కారీ డిగ్రీ కళాశాల ల్లో చేరే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లను ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల విద్యార్థులు దక్కించుకుంటుండగా.. వారితో పోటీ పడలేక ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి వచ్చిన వారు అవకాశాలకు దూరమవుతున్నారు. ఇంటర్‌మీడియట్  కార్పొరేట్ కళాశాలల్లో చదివి, 90 శాతం పైబడి మార్కులు సాధించిన విధ్యార్దులు ప్రభుత్వ కళాశాలల్లో చదవడానికి మక్కువ చూపుతున్నారంటే డిగ్రీ కోర్సులకు గిరాకీ  ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఉదాహరణకు ఇంటర్‌మీడియట్ సీఈసీ గ్రూపులో  800 మార్కులు వచ్చిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థికి కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌లో సీటు రాలేదు.
 
దరఖాస్తుల వెల్లువ
జిల్లాలో పిఠాపురం, అన్నవరం, ఏలేశ్వరం, పెద్దాపురం, అమలాపురం, రాజ మండ్రి, తుని, రాజోలు, కొత్తపేట తదితర ప్రాంతాల లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలుం డగా వీటిలో బీఏ, బీకాం, బీఎస్సీ  విభాగాల్లో  దాదాపు నాలుగు వేల సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దరఖాస్తులు వెల్లువెత్తారుు. ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్ గ్రూపు చదివిన విద్యార్థులు బీకాం (కంప్యూటర్స్)లో చేరడానికీ, సైన్స్ గ్రూపు విద్యార్థులు బీఎస్సీ (మ్యాథ్స్)లో చేరడానికీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బీకాంలో సీఏ సంబంధిత కోర్సు, బీఎస్సీ మ్యాథ్స్‌లో ఇంజనీరింగ్ సబ్జెక్టులైన పెట్రోకెమికల్స్, ఫుడ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు ఉండటం, కార్పొరేట్ కళాశాలలతో  సమానంగా ప్రభుత్వ కళాశాలల్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించడం వారి ఆసక్తికి ఓ ప్రధాన కారణం.

కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బీకాం సీట్లు 160 ఉండగా ఆరు వందల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటర్‌లో 800 మార్కులు పైబడి వచ్చిన వారికే కాల్ లెటర్లు పంపించారు. బీఎస్సీకి సంబంధించి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఇంజనీరింగ్ తరహాలో సెమిస్టర్ విధానం ఉండటం కూడా విద్యార్థుల ఆసక్తికి మరో కారణమని చెప్పవచ్చు.
 ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారికి
 
సీట్లు కేటాయించాలి..
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివే పేద, సామాన్య వర్గాల విద్యార్థులు ఇంటర్ అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు రాక నిరుత్సాహపడుతున్నారు. కార్పొరేట్ కళాశాలల విద్యార్థులే 90 శాతం పైగా మార్కులతో డిగ్రీ సీట్లను దక్కించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన వారు నష్టపోతున్నారు. అలాంటి వారికి సీట్లు కేటాయించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
 
జేకేసీల వల్లా పెరుగుతున్న ఆసక్తి
ప్రభుత్వ కళాశాలల్లో కూడా కార్పొరేట్ కాలేజీల తరహాలో అత్యాధునిక పరికరాలు, ఈ లైబ్ర రీ, ల్యాబ్‌ల వంటి సౌకర్యాలు ఉండటంతో విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా డిగ్రీ విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించడానికి తోడ్పడేలా జేకేసీల ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందింపజేయడానికి శిక్షణ ఇవ్వడంతో విద్యార్థుల ఆసక్తి పెరుగుతోంది.
- డాక్టర్ చప్పిడి కృష్ణ, ప్రిన్సిపాల్, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement