- గడువు పెంపుపై సందిగ్ధత
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో శనివారం రాత్రికి మొత్తం 8,286 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసున్నారు. వీరిలో 5,812 మంది తప్పనిసరిగా బదిలీలు కావాల్సిన వారున్నారు. మరో 2,474 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు పెంపుపై సందిగ్ధత నెలకొంది. శనివారం నాటికే గడువు ముగిసింది.'
అయితే పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదు. వాటిని కమిషనర్‌కు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. ఈ క్రమంలో కొందరు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈనెల మూడు రోజులు గడువు పెంచారని ప్రచారం సాగుతున్నా...ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు అందలేదు.
పాయింట్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని అంశాల్లో స్పష్టత ఇచ్చింది. ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంలకు పాయింట్లు వర్తిస్తాయి. 8 అకడమిక్ ఇయర్లు పూర్తయింటే స్పౌజ్ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు. సర్దుబాటు కింద పని చేసిన టీచర్లకు పాయింట్లు వర్తిస్తాయి. ఇంకా చాలా అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది.