హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి! | ABVP Protest Outside Karnataka Home Minister Residence | Sakshi
Sakshi News home page

Karnataka HM: హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!

Published Sun, Jul 31 2022 7:18 AM | Last Updated on Sun, Jul 31 2022 7:18 AM

ABVP Protest Outside Karnataka Home Minister Residence - Sakshi

శివాజీనగర: దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్‌ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. శనివారం బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్‌ చేసి 30 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు.

ఇదీ చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement