పర్వతగిరి జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం సస్పెన్షన్
Published Fri, Jul 29 2016 12:06 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
విద్యారణ్యపురి : మహబూబాబాద్ మండలం పర్వతగిరి జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం కె.సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడి వై.బాలయ్య ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాలలో పీఈటి ప్రేమ్‌కుమార్, హెచ్‌ఎం సుభాష్ నడుమ కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై మహబూబాబాద్ డివిజన్ డిప్యూటీ డీఈఓ తోట రవీందర్ ఇటీవల విచారణ జరిపి నివేదిక అందజేశారు. ఈ మేరకు హెచ్‌ఎం సుభాష్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆర్‌జేడీ ఉత్తర్వులు జారీ చేశారు.
నలుగురు ఉపాధ్యాయులకు నోటీసులు
భూపాలపల్లి : భూపాలపల్లి మండలంలోని ఇద్దరు హెచ్‌ఎంలు, ఇద్దరు ఉపాధ్యాయలకు ములుగు డిప్యూటీ ఈఓ సారంగపాణి అ య్యంగార్ గురువారం షోకాజ్ నోటీసులు జా రీ చేశారు. మండలంలోని గొల్లబుద్ధారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దీక్షకుంట ప్రాథమిక పాఠశాల, పంబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. డిప్యుటీ ఈవో మధ్యాహ్నం 3.30 గంటలకు పంబాపూర్ పాఠశాలకు చేరుకోగా తాళం వేసి ఉండడంతో ప్రధానోపాధ్యాయుడితో పాటు అక్కడ పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం దీక్షకుం ట పాఠశాలను తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు విద్యార్థులే ఉన్నారు. అయితే, రికార్డుల్లో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు చూపించడం పట్ల డిప్యూటీ ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హెచ్‌ఎం కృష్ణమూర్తికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మరో ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై నందిగామకు పంపించాలని ఎంఈఓ దేవానాయక్‌ను డిప్యుటీ ఈవో ఆదేశించారు.
Advertisement