కొండపల్లిలో భర్త వెంకటేశ్వరరావు చేతిలో తీవ్రంగా గాయపడిన భార్య
గుంటూరు, కొండపల్లి(ఇబ్రహీంపట్నం): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసిన ఘటన కొండపల్లి శ్రామికనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన బురుసు పద్మావతికు గుంటూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బురుసు వెంకటేశ్వరరావుతో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆమె 20 రోజుల క్రితం శ్రామికనగర్‌లోని పుట్టింటికి పిల్లలను తీసుకుని వచ్చింది.
తండ్రి దగ్గర ఉంటున్న ఆమెను గుంటూరు తీసుకెళ్లేందుకు శుక్రవారం ఉదయం భర్త వెంకటేశ్వరరావు వచ్చాడు. ఇంటికి రమ్మని భార్యను కోరాడు. ఇద్దరు గొడవపడ్డారు. అప్పటికే జేబులో తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. ఈ ఘటనతో కుప్పకూలిపోయిన భార్యను హతమార్చేందుకు యత్నించాడు. స్థానికులు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment