husband kills
-
Bathalapalli: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది
సాక్షి, బత్తలపల్లి (సత్యసాయి జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య... ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. గత నెల 28న అప్పరాచెరువు గ్రామానికి చెందిన బ్యాళ్ల రామకృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను బత్తలపల్లి పోలీసు స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీహర్షతో కలిసి సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. జ్వాలాపురానికి చెందిన డిష్ శివతో 15 సంవత్సరాలుగా రామకృష్ణ భార్య త్రివేణి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం పసిగట్టిన రామకృష్ణ తరచూ శివతో గొడవపడేవాడు. దీంతో ఎలాగైనా రామకృష్ణ అడ్డు తొలగించుకోవాలని త్రివేణి, శివ భావించారు. రామకృష్ణ పెద్ద కుమార్తె మతాంతర వివాహం చేసుకుని భర్తతో కలిసి వేరే గ్రామంలో స్థిరపడింది. ఈ క్రమంలోనే రామకృష్ణ తనకున్న 4 ఎకరాల భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో రూ.20 లక్షలు వెచ్చించి నూతన గృహ నిర్మాణం చేశాడు. మిగిలిన డబ్బుతో బత్తలపల్లిలో స్థలం కొనుగోలు చేశాడు. ఇటీవల కుటుంబసభ్యులు రామకృష్ణతో గొడవపడి చేయి విరగొట్టారు. అనంతరం చిన్న కుమార్తెను పిలుచుకుని పెద్ద కుమార్తె ఇంటికి త్రివేణి వెళ్లింది. చదవండి: (గదిలోకి దూరి లైంగిక దాడికి యత్నం.. యువతిని కాపాడిన హిజ్రాలు) ఇదే అనువైన సమయంగా భావించిన త్రివేణి, శివ.. రామకృష్ణ హత్యకు పథకం రచించారు. అనంతపురంలో ఆటో నడుపుకుంటున్న తన మిత్రుడు రామాంజనేయులు అలియాస్ రాముతో శివ చర్చించాడు. జూన్ 28న రాము అనంతపురం నుంచి వస్తూ తోడుగా మరో వ్యక్తిని పిలుచుకువచ్చాడు. ఇద్దరూ కలిసి బత్తలపల్లిలో మద్యం సేవించారు. అనంతరం శివతో కలిసి మద్యం బాటిళ్లు తీసుకుని ఆటోలో వేల్పుమడుగు రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ మద్యం సేవించి రాత్రి 9 గంటలకు రామకృష్ణకు శివ ఫోన్ చేసి బత్తలపల్లికి రావాలని, త్వరలో తాను బెంగళూరుకు వెళ్లిపోతానని, చివరిసారిగా కలిసి మందు పార్టీ చేసుకుందామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి అక్కడకు చేరుకున్న రామకృష్ణకు ఫుల్‌గా మద్యం తాపించారు. మత్తులో పడిపోయిన రామకృష్ణ తలపై శివ, రాము బండరాళ్లతో మోది హత్య చేశారు. అనంతరం ఆటోలో అనంతపురం వెళుతూ మార్గమధ్యంలో సంజీవపురంలో పెద్ద కుమార్తె వద్ద రామకృష్ణ భార్య త్రివేణిని కలిసి విషయాన్ని వివరించారు. త్రివేణి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో త్రివేణి, శివ, రాముని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
మాట వినడం లేదని భార్య దారుణం.. భర్తకు పూటుగా మద్యం తాగించి..
సాక్షి, దేవరకొండ (నల్లగొండ): నాలుగు ఎకరాల భూమిని తన పేరిట పట్టా చేయడం లేదని ఓ వివాహిత దారుణానికి తెగబడింది. మద్యంలో పురుగుల మందు కలిపి భర్తను మట్టుబెట్టింది. ఈ దారుణ ఘటన దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బీసన్న, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) భార్య లలితతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. గొడవపడి వేర్వేరుగా.. దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో లలిత ఆరేళ్లుగా పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని గుర్రంగూడలో నివాసం ఉంటోంది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటుండగా మోతీలాల్ స్వగ్రామంలోనే వ్యవసాయం, కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బంధువుల శుభకార్యానికి వచ్చి.. కాగా, మోతీలాల్ పేరిట ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన పేరిట చేయాలని కొంతకాలంగా లలిత కోరుతోంది. ఇదే విషయం ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. కాగా బుధవారం స్వగ్రామమైన శేరిపల్లి పెద్ద తండాలో బంధువులు శుభకార్యానికి లలిత హైదరాబాద్ నుంచి వచ్చింది. రాత్రి సమయంలో ఇదే అదునుగా భావించిన లలిత మద్యంలో పురుగుల మందు కలిపి భర్తకు తాగించింది. దీంతో మోతీలాల్ మృతిచెందాడు. అతిగా మద్యం తాగి మృతిచెందాడని.. కాగా, గురువారం తెల్లవారుజామున లలిత బోరున విలపిస్తుండడంతో ఇరుగుపొరుగు వచ్చారు. ఏం జరిగిందని ఆరా తీయగా అతిగా మద్యం తాగి తన భర్త మోతీలాల్ మృతిచెందాడని తెలిపింది. లలిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు నిలదీయడంతో మద్యంలో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. హైదరాబాద్‌లో లలిత మరొకరితో సఖ్యతగా మెలుగుతూ మోతీలాల్‌ను మట్టుబెట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం మేరకు సీఐ బీసన్న ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి సోదరుడు శివరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బీసన్న పేర్కొన్నారు. కాగా, నేరం అంగీకరించిన నిందితురాలు లలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. చదవండి: గిట్టనివారు చేతబడి, మంత్రాలు చేస్తున్నారని.. మూడేళ్లలో.. -
ప్రియుళ్లతో కలిసి భర్త హత్యకు భార్య ప్లాన్
కమాన్‌చౌరస్తా(కరీంనగర్): ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హత్య చేసేందుకు భార్య యత్నించగా తప్పించుకున్నానని కరీంనగర్‌కు చెందిన వంశీకృష్ణ కరీంనగర్ టూ టౌన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంట్లోకి వచ్చి తీవ్రంగా కొట్టి, చంపుతామని బెదిరించారని గంగారపు సమన్విత్ అలియాస్ సన్నీ.. వంశీకృష్ణతోపాటు మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 తేదీన వంశీకృష్ణ ఇంట్లో ఉండగా సన్నీ, గణేశ్ అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దిండుతో అదిమిపెట్టి శ్వాస ఆడకుండా చేసి హత్యచేయాలని చూడగా బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. కాగా, ఈనెల 17న తన ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి చంపుతామని బెదిరించి తన భార్యకు ఫోన్ చేయవద్దంటూ చితకబాదారని వంశీకృష్ణ, శివ, శ్రీధర్‌లతోపాటు మరోముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై సన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా వంశీకృష్ణ భార్యతో సమన్విత్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వివాహేతర సంబందం గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం వంశీకృష్ణ భార్య ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరగా, ఇద్దరు పిల్లలు మాత్రం వంశీకృష్ణ వద్దనే ఉన్నట్లు సమాచారం. -
మేనమామను కడతేర్చిన అల్లుడు
సాక్షి, ఓజిలి(నెల్లూరు) : పిల్లనిచ్చి వివాహం చేసిన మేనమామను అల్లుడే గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని అత్తివరం గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్న కారూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కారూరుకు చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (80), అతని భార్య రత్నమ్మకు ఇద్దరు కుమార్తెలున్నారు. మొదటి కుమార్తెను సొంత ఊరులోని వ్యక్తికిచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె ఆదిలక్ష్మిని రత్నమ్మ అన్న మోడిబోయిన కిష్టయ్య కుమారుడైన మోడిబోయిన వెంకటేశ్వర్లుకు ఇచ్చి రాపూరు మండలం వేపినాపి గ్రామంలో 20 సంవత్సరాలు క్రితం వివాహం చేశారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై భార్యను నిత్యం చిత్రహింసలను గురిచేసేవాడు. దీంతో ఆమె ఐదు సంవత్సరాలు క్రితం పుట్టింటికి వచ్చేసింది. నిందితుడు అప్పుడప్పుడు అత్తివరం గ్రామానికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. తనతో పంపలేదని.. రెండునెలల క్రితం భార్య ఆదిలక్ష్మిని తనతో ఊరికి పంపాలని వెంకటేశ్వర్లు మేనమామతో ఘర్షణకు దిగాడు. అప్పటినుంచి భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తామామలను అడగ్గా వారు మద్యం మానేసి వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో వెంకటేశ్వర్లు అలిగి వేపినాపికి వెళ్లిపోయాడు. భార్యను కాపురానికి తీసుకెళ్లాలంటే మేనమామ శ్రీనివాసులు అడ్డుగా ఉన్నాడని భావించాడు. దీంతో ఆయన్ను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈక్రమంలో వెంకటేశ్వర్లు భార్య ఇంటికి వచ్చి మద్యం తాగడం మానేశాని చెప్పి అక్కడే ఉన్నాడు. పనినిమిత్తం అని చెప్పి నాయుడుపేటకు ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. దీంతో అల్లుడు మారిపోయాడని అత్తామామ, భార్య నమ్మారు. ఆరుబయట నిద్రిస్తుండగా.. సోమవారం అర్ధరాత్రి రత్నమ్మ, ఆదిలక్ష్మి, ఆమె పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు ఆరుబయట పడుకున్నారు. ఇదే అదనుగా భావించిన వెంకటేశ్వర్లు కట్టెలు కొట్టే గొడ్డలితో మేనమామ మెడ, ఎడమకాలుపై నరికి పరారైయ్యాడు. తీవ్ర రక్తస్రావమై శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదిలక్ష్మి కుమారుడు శ్రీధర్ మరుగుదొడ్డికి వెళ్లేందుకు తలుపు తీశాడు. ఈక్రమంలో నెత్తుటిమడుగులో ఉన్న తాతను చూసి కేకలు వేశాడు. బంధువులు, చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వాకాడు సీఐ నరసింహారావు, ఎస్సై నరహరిలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం చేయించారు. హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య గొంతు కోసిన భర్త
గుంటూరు, కొండపల్లి(ఇబ్రహీంపట్నం): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కత్తితో దాడి చేసిన ఘటన కొండపల్లి శ్రామికనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన బురుసు పద్మావతికు గుంటూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బురుసు వెంకటేశ్వరరావుతో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తాయి. ఆమె 20 రోజుల క్రితం శ్రామికనగర్‌లోని పుట్టింటికి పిల్లలను తీసుకుని వచ్చింది. తండ్రి దగ్గర ఉంటున్న ఆమెను గుంటూరు తీసుకెళ్లేందుకు శుక్రవారం ఉదయం భర్త వెంకటేశ్వరరావు వచ్చాడు. ఇంటికి రమ్మని భార్యను కోరాడు. ఇద్దరు గొడవపడ్డారు. అప్పటికే జేబులో తెచ్చుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. ఈ ఘటనతో కుప్పకూలిపోయిన భార్యను హతమార్చేందుకు యత్నించాడు. స్థానికులు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలని చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భార్యను చంపి కొండపైకి తీసుకెళ్లి..
జమ్మూ: వైష్ణోదేవీ యాత్రలో ఓ భర్త తన భార్యను చంపేశాడు. ఆమెను గొంతునులిమి హత్య చేసి ఎవరికీ తెలియకుండా ఓ పెద్ద కొండపై నుంచి కిందపడేశాడు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారీపడి ఇలా జరిగిందని నమ్మించేందుకు ఈ పని చేశాడు. వీరిద్దరికి ఈ మధ్యే గత మార్చి 10న పెళ్లి జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన లక్ష్మీ గుప్తా(25), శక్తి గుప్తాలకు గత మార్చి నెలలో వివాహం అయింది. అయితే, వైష్ణోదేవీ ఆలయ దర్శనం పేరిట రియాసీ జిల్లాలోని కాట్రాకు వచ్చి అక్కడే ఒక హోటల్లో రూము తీసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఎవరికీ తెలియకుండా వారు తగువుపడుతునే ఉన్నారు. అయితే, భార్యతో గొడవపడిన రాత్రే ఆమెను గొంతు నులిమి చంపేసి చీకట్లోనే ఓ కొండపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి లోయలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడ్ని విచారించగా అసలు నేరం ఒప్పుకున్నాడు. -
సెలైన్‌లోకి విషం ఎక్కించిన భర్తకు....
నరసరావుపేట టౌన్: గుంటూరు జిల్లాలో సెలైన్‌లోకి విషం ఎక్కించి భార్యను చంపిన భర్తకు జీవితఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. బొల్లాపల్లి మండలం కనుమలచెర్వు గ్రామానికి చెందిన రవికుమార్‌కు భార్య విమలమ్మపై అనుమానం ఉండేది. విమలమ్మ వినుకొండలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో 2013 అక్టోబర్ 4వ తేదీన ఆడశిశువుకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల తరువాత ఆస్పత్రికి వెళ్లిన భర్త ఎవరూ గమనించకుండా ఆమెకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్లో ఇంజెక్షన్ ద్వారా పురుగుమందు కలిపాడు. కొద్దిసేపటి తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారడంతో గమనించిన వైద్యులు విషప్రయోగం జరిగిందని గుర్తించి విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం విమలమ్మను వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితురాలు న్యాయమూర్తికి మరణవాగ్మూలాన్ని ఇచ్చి అదే నెల 6వ తేదీన చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వినుకొండ పోలీసులు కేసునమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిపై అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువుకావడంతో జీవిత ఖైదీ విధిస్తూ తీర్పుచెప్పారు. -
భార్య గొంతు నులిమి హత్య చేసిన భర్త
-
కట్టుకున్నోడే కాలయముడు
తలకొండపల్లి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు.. జీవితాంతం తోడుంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలు మరిచాడు.. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపేశాడు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. భార్యను చంపిన భర్త మద్యం మత్తులో ఘాతుకం అంతారంలో ఘటన మండలంలోని అంతారానికి చెందిన గొర్రె అంజమ్మ (50), అంజయ్య దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యకు చిన్నప్పటి నుంచి పోలియో కారణంగా ఓ కాలు పనిచేయదు. భర్త మద్యానికి బానిైసై ఏ పనిచేయకుండా ఊర్లో జులాయిగా తిరగసాగాడు. దీంతో భార్యపైనే కుటుంబ భారం పడటంతో కూలిపని చేస్తోంది. ఇటీవల ఉపాధికోసం కుమారుడు ఇస్తారి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. పెద్దకూతురు గతంలోనే చనిపోగా చిన్న కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. ఈ క్రమంలోనే భర్త మద్యం తాగడానికి డబ్బులివ్వాలని తరచూ వేధించసాగాడు. ఎప్పటిలాగే శనివారం రాత్రి అంజమ్మ ఆరుబయట నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి పీకలదాకా తాగి ఇంటికి భర్త వచ్చి భోజనం పెట్టాలని భార్యను లేపి గద్దించాడు. ఉదయం వండిన చల్ల అన్నం తినమనగా కోపంతో గొడ్డలితో మోది చంపేసి పారిపోయాడు. ఆదివారం ఉదయం చుట్టుపక్కలవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకట్, ఎస్ఐ మహేందర్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అక్కడే ఉన్న పదునైన ఆయుధం, అగ్గిపెట్టె, రబ్బరుచెప్పుల జత స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.