జమ్మూ: వైష్ణోదేవీ యాత్రలో ఓ భర్త తన భార్యను చంపేశాడు. ఆమెను గొంతునులిమి హత్య చేసి ఎవరికీ తెలియకుండా ఓ పెద్ద కొండపై నుంచి కిందపడేశాడు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారీపడి ఇలా జరిగిందని నమ్మించేందుకు ఈ పని చేశాడు. వీరిద్దరికి ఈ మధ్యే గత మార్చి 10న పెళ్లి జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన లక్ష్మీ గుప్తా(25), శక్తి గుప్తాలకు గత మార్చి నెలలో వివాహం అయింది.
అయితే, వైష్ణోదేవీ ఆలయ దర్శనం పేరిట రియాసీ జిల్లాలోని కాట్రాకు వచ్చి అక్కడే ఒక హోటల్లో రూము తీసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఎవరికీ తెలియకుండా వారు తగువుపడుతునే ఉన్నారు. అయితే, భార్యతో గొడవపడిన రాత్రే ఆమెను గొంతు నులిమి చంపేసి చీకట్లోనే ఓ కొండపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి లోయలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడ్ని విచారించగా అసలు నేరం ఒప్పుకున్నాడు.
భార్యను చంపి కొండపైకి తీసుకెళ్లి..
Published Wed, Jun 15 2016 12:21 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement