Vaishno Devi temple
-
కశ్మీర్‌కు వందేభారత్ రికార్డు పరుగు
శ్రీనగర్: కశ్మీర్‌ను రైలు మార్గం ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే బృహత్ కార్యక్రమం విజయవంతమైంది. శనివారం ప్రఖ్యాత వైష్ణో దేవి ఆలయం నెలకొన్న జమ్మూలోని కాట్రా నుంచి కశ్మీర్‌లోని బుద్గాం వరకు వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నౌగావ్ ప్రాంతంలోని శ్రీనగర్ స్టేషన్‌కు ఉదయం 11.30 గంటల సమయంలో ఆరెంజ్– గ్రే– కలర్ రైలు చేరుకుంది. ఆ రైలులో వచ్చిన వారికి జనం పూల దండలతో స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో మంచు, అతిశీతల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అత్యాధునిక వసతులతో రూపొందించిన ప్రత్యేక రైలు శుక్రవారం జమ్మూకు చేరుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన అంజి ఖాద్ వంతెనతోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ వంతెన మీదుగా ఈ రైలు పరుగులు తీసిందని అధికారులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రైలు బుద్గాం స్టేషన్ నుంచి ముందుకు వెళ్లి ట్రయల్ రన్‌ను పూర్తి చేసింది. ఉత్తర రైల్వే చీఫ్ ఏరియా మేనేజర్(శ్రీనగర్) సకీబ్ యూసఫ్ మాట్లాడుతూ.. ఈ ట్రయల్ రన్ చారిత్రక ఘట్టంగా అభివరి్ణంచారు. ఇంజినీరింగ్ అధికారుల పదేళ్ల శ్రమకు తగిన ప్రతిఫలమన్నారు. రైల్వే సేఫ్టీ కమినర్ కూడా ధ్రువీకరించినందున కాట్రా–బారాముల్లా సెక్షన్లో నడిచే ఈ రైలును త్వరలోనే ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశముంది. సుమారు 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్–శ్రీనగర్– బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టును రైల్వే శాఖ డిసెంబర్లో పూర్తి చేసింది. వాతావరణానికి తగ్గ ఏర్పాట్లు కాట్రా–శ్రీనగర్ రైలు మార్గం కోసం జమ్మూకశ్మీర్‌లోని పర్వత ప్రాంతంలోని శీతాకాల పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేసిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును గతేడాది జూన్ 8వ తేదీన అధికారులు ఆవిష్కరించారు. ఇందులో ఇతర వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉండే వసతులతోపాటు అనేక ప్రత్యేకతలున్నాయి. శీతాకాలంలో రైలులోని పైపులు, బయో టాయిలెంట్ ట్యాంకుల్లో నీరు గడ్డకట్టకుండా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను అమర్చారు. వాక్యూమ్ సిస్టమ్‌కు వెచ్చని గాలి అందేలా చేశారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఎయిర్ బ్రేక్ వ్యవస్థ యథా ప్రకారం పనిచేస్తుంది. తీవ్రంగా మంచు కురుస్తున్న సమయంలో సైతం డ్రైవర్ ముందున్న వస్తువులను స్పష్టంగా చూడగలిగేలా విండ్ షీల్డ్‌పై పేరుకుపోయిన మంచును స్వయంచాలితంగా తొలగించే ఏర్పాటుంది. అదనంగా మిగతా వందే భారత్ రైళ్లలో ఉండే ఇతర అన్ని వసతులు..ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ చార్జింగ్ సాకెట్ల వంటివి ఉన్నాయి. దేశంలోనే మొట్టమొదటి కేబుల్ రైలు వంతెన అంజి ఖాద్ బ్రిడ్జి, చినాబ్ నదిపై కౌరి వద్ద నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జిల మీదుగా గత నెలలో ఈ రైలును ఆరుసార్లు ప్రయోగాత్మకంగా నడిపారు. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులోని భాగమైన అంజి ఖాద్ వంతెన ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఒకే ఒక పైలాన్‌పై నిర్మితమైన వారధి ఇది. పునాది నుంచి దీని ఎత్తు 191 మీటర్లు. దీనిని పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులకు ఏళ్లు పట్టింది. మొత్తం 473.25 మీటర్ల పొడవైన అంజి ఖాద్ వంతెన ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు, చినాబ్ నదిపైప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మించారు. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల పొడవెక్కువ. -
India Famous Durga Temples Images: భారతదేశంలోని ప్రసిద్ధ దుర్గా దేవాలయాలు (ఫొటోలు)
-
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ జూన్ 8న నిర్వహిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. జమ్మూలోని ఆలయంలో జరుగుతున్న పనులను మంగళవారం ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించిందని, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు ఇతర సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ ఆలయంలో జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ - కాట్రా మార్గంలో ఈ ఆలయం ఉందని, భక్తులు బాలాజీ ఆశీస్సులు కూడా అందుకోవచ్చని అన్నారు. ఈ ఆలయం నగరానికి దూరంగా ఉందని, ఇక్కడ 24 గంటల పాటు శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని జమ్మూ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. కాగా, ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఆలయాల నిర్మిస్తున్నామని, ఇటీవల చెన్నై, విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతి, తదితర ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. త్వరలో ముంబైలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, అదేవిధంగా అహ్మదాబాద్, రాయపూర్‌లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవో వీరబ్రహ్మం, ఎస్పీ రాహుల్, సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్ నుంచి ఏపీకి 'అంతా క్షేమంగా'.. -
వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన షారుక్ ఖాన్, వీడియో వైరల్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలె షారక్ మక్కాను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. Shah visited Vaishno Devi Temple ❤️ May Devi Maa fulfill all his wishes 🙏🏻 #ShahRukhKhan𓀠 pic.twitter.com/1XrL82XaCW — 👸Sharania Jhanvi𓀠🌹BesharamRang (@SharaniaJ) December 12, 2022 -
వైష్ణోదేవి మందిరంలో విషాదం.. అసలేం జరిగింది?
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భక్తుల్లో కొందరు టీనేజర్ల మధ్య వాగ్వివాదం ఆరంభమైందని పోలీసు డీజీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఈ గొడవకు కారణం తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందని, గందరగోళం ఎక్కువకావడంతో ఒక్కమారుగా ఇరుకు సందులోకి అనేకమంది దూసుకువచ్చారని తెలిపారు. ఈ గందరగోళంలో ఊపిరాడక పలువురు మరణించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అధికారులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. చదవండి: (హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు) కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉన్నా పలువురు భక్తులు నిర్ణీత స్థాయిని మించి ఆలయంలోకి వచ్చారని ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ సింగ్ చెప్పారు. ఆలయ బోర్డు ఏర్పాట్లలో లోపమే ఘటనకు కారణమని ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ కొందరు ఆరోపించారు. చాలామంది కనీసం మాస్కులు కూడా ధరించలేదని చెప్పారు. అధిక రద్దీతో తొక్కిసలాట జరగవచ్చని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారని, కానీ ఆలయ బోర్డు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల దుర్ఘటన జరిగిందని విమర్శించారు. ఘటన సమయంలో వెనక్కు వెళ్లకుండా చాలామంది నేలపై పడుకున్నారని, దీంతో రద్దీ మరింత పెరిగిందని మరో సాక్షి చెప్పారు. ఇతర సాక్షులు కూడా ఈ విషయాలను ధృవీకరించారు. అయితే ఆలయ బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. 50 వేల మందికి అనుమతి ఉన్నా 35 వేల మందికే అనుమతిచ్చామని తెలిపింది. రెండు గ్రూపుల మధ్య ఆరంభమైన గొడవ అంతిమంగా తొక్కిసలాటకు దారితీసిందని ఆలయ బోర్డు ప్రకటించింది. చదవండి: (వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట) -
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
జమ్మూ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. గర్భాలయానికి వెలుపల గేట్ నెంబర్ 3 వద్ద శనివారం ఉదయం 2.30– 2.45 ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఆరంభమైంది. ఒక్కమారుగా జరిగిన ఈ ఘటనతో భీతావహ వాతావరణం నెలకొందని, ఊపిరి ఆడక పలువురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు యూపీ, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా హరియాణా, కశ్మీర్ నుంచి ఒక్కొక్కరున్నారు. గాయపడినవారికి మాతా వైష్ణోదేవి నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని, వారంలో నివేదిక ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఆదేశించారు. తొక్కిసలాట అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. దుర్ఘటన జరిగిన గంటకు తిరిగి దర్శనాలకు అనుమతించారు. అయితే పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించకుండా వెనుదిరిగారు. ప్రముఖుల సంతాపం దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై రాష్ట్ర యంత్రాంగంతో సంప్రదిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వెలిబుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. మరణించినవారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆలయ బోర్డు చెల్లిస్తుంది. మరణించినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రధాని జాతీయ ఉపశమన నిధి నుంచి ఈ మొత్తాలందిస్తారు. పర్వదినాల్లో దేవాలయానికి రద్దీ పెరుగుతుందని, నూతన సంవత్సరాదిన యువత రద్దీ పెరగడం తాజా ట్రెండ్‌గా మారిందని, అందువల్ల ఇకమీదట న్యూఇయర్ రోజున తగిన ఏర్పాట్లు చేయాల్సిఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం తమ వారు మరణించడంతో రోదిస్తున్న కుటుంబసభ్యులు గత దుర్ఘటనలు ► 2003, ఆగస్టు 27: మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 39మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు. ► 2005, జనవరి 25: మహారాష్ట్రలోని మంధర్ దేవీ ఆలయంలో కొబ్బరికాయలు భారీగా కొట్టడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. బురదపై భక్తులు హఠాత్తుగా జారిపడి తొక్కిసలాట ఆరంభమైంది. ఈ ఘటనలో 340 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ► 2008, ఆగస్టు 3: హిమాచల్‌ప్రదేశ్ నైనా దేవీ మందిరం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయన్న పుకార్లు గందరగోళానికి దారితీసాయి. దీనివల్ల జరిగిన తోపులాటలో 162మంది మరణించగా 47మంది గాయపడ్డారు. ► 2010, మార్చి 4: యూపీలోని కృపాల్ మహరాజ్‌కు చెందిన రామ్ జానకీ ఆలయం వద్ద ఉచితంగా ఆహారం, దుస్తులు పంచారు. వీటికోసం జరిగిన తొక్కిసలాట 63మందిని బలి తీసుకుంది. ► 2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని హర్ కా పౌరీ ఘాట్‌లో తొక్కిసలాట 20మంది మృతికి కారణమైంది. ► 2012, నవంబర్ 19: పాట్నా వద్ద ఛాత్‌పూజ జరిగే అదాలత్ ఘాట్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలి 20మంది మరణించారు. ► 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని రత్నగిరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నదిపై వంతెన కూలిపోతోందన్న పుకార్లు భారీ తొక్కిసలాటకు కారణమయ్యాయి. దీంతో 115మంది మరణించగా, 100మంది గాయపడ్డారు. ► 2014, అక్టోబర్ 3: పాట్నాలోని గాంధీ మైదానంలో దసరా ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆరంభమైన తోపులాట 32మం దిని బలికొంది. 26మంది గాయపడ్డారు. ► 2015, జూలై 14: ఏపీలో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు. -
దర్శనానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి.. ఫోటోలు వైరల్
Shilpa Shettys Vaishno Devi Trip: పోర్నోగ్రఫీ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దైవ దర్శనం కోసం జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ ఆలయానికి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైష్ణోదేవీ ఆలయంలో శిల్పాశెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి పిలుపు మేరకే దర్శననానికి వచ్చాను' అని శిల్పా పేర్కొంది. స్నేహితురాలితో కలిసి జమ్ముకశ్మీర్ పర్యటనను వచ్చిన శిల్పా దీనికి సంబంధించి పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని గురువారం ముంబై పోలీసులు సాక్షిగా చార్జ్‌షీట్‌లో పేరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బిజీ షెడ్యూల్స్ వల్ల భర్త రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో తనకు తెలియదని శిల్పా పేర్కొంది. అంతేకాకుండా సంబంధిత హాట్‌షాట్స్, బాలీఫేమ్ యాప్స్‌ల గురించి కూడా తెలియదని స్టేట్మెంట్లో వివరించింది. అనంతరం అట్నుంచి నేరుగా జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లింది. చదవండి : 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' సీత కోసం ఆ హీరోయిన్స్‌ని సంప్రదించలేదు -
తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు. -
కశ్మీర్ ప్రగతి ప్రస్థానం షురూ
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 కారణంగా ఇప్పటి వరకు నిలిచిన కశ్మీర్ అభివృద్ధి ప్రస్థానం, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి మొదలయిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గురువారం ఆయన రైల్వే మంత్రి గోయెల్‌తో కలిసి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో ఢిల్లీ–కత్రా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారం భంతో నవ భారతం, నవ జమ్మూకశ్మీ ర్కు కొత్త చరిత్ర సృష్టించ నున్నాయ న్నారు. ‘ఆర్టికల్ 370 దేశ ఐక్యతకు అవరోధంగా నిలవడమే కాదు, కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద అడ్డుగా మారిందని నా అభిప్రాయం. ఈ ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవా దాన్ని, ఉగ్ర భావజాలాన్ని పూర్తిగా రూపుమా పుతాం’ అని అమిత్ షా ప్రకటించారు. ‘వచ్చే 10 ఏళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా జమ్మూకశ్మీర్ మారనుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఈ ప్రగతి ప్రస్థానం ప్రారంభమైంది. ఈ రైలు ద్వారా అభివృద్ధికి,, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం లభించనుంది’ అని ప్రకటించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రాకతో ఢిల్లీ–కత్రా ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గనుందన్నారు. వైష్ణోదేవి భక్తులకు బహుమతి: ప్రధాని ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ వైష్ణోదేవి భక్తులకు నవరాత్రి కానుక అని మోదీ అన్నారు. గురువారం ఆయన ట్విట్టర్లో..‘జమ్మూలోని నా సోదరసోదరీమణులకు, వైష్ణోదేవి మాత భక్తులకు నవరాత్రి కానుక. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో న్యూఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయం ఉన్న కత్రాకు అనుసంధానత, ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి కానుంది’ అని పేర్కొన్నారు. వందేభారత్ విశేషాలు.. ► ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం ► మంగళవారం మినహా అన్ని రోజులు ► ప్రయాణ వేగం గంటకు 130 కి.మీ.లు ► ఎయిర్ కండిషన్డు కోచ్‌లు 16 ► ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు 2 ► కోచ్‌లను కలిపే సెన్సార్ డోర్లు ► కోచ్ మొత్తాన్ని పొడవుగా కలుపుతూ ఒకే మందపాటి కిటికీ ► సూర్య కిరణాలు సోకని, రాళ్లు రువ్వినా పగలని కిటికీలు. ► పశువులు అడ్డుగా వచ్చినా రైలుకు నష్టం కలగని, పట్టాలు తప్పకుండా ఇంజిన్ ముందుభాగంలో పటిష్టమైన అల్యూమినియంతో రక్షణ. ► ప్రతి కోచ్‌లోనూ సీసీటీవీ కెమెరాలు. ► ఫేసియల్ టెక్నాలజీ ద్వారా వ్యక్తుల అనుమానాస్పద కదలికలను గుర్తించేæ సాంకేతికత. ► కోచ్‌ల్లో రివాల్వింగ్ సీట్లు, కొత్త రకం వాష్ బేసిన్లు, ఆటోమేటిక్ డోర్లు, వైఫై. ► ప్రయాణికులు వదిలేసిన లగేజీని గుర్తించే టెక్నాలజీ ► డీప్ ఫ్రీజర్‌తో కూడిన విశాలమైన ప్యాంట్రీ, నీటి శుద్ధి యంత్రం, రెండు బాటిల్ కూలర్స్ ► కోచ్‌ల్లో ప్లాస్టిక్ బాటిల్స్ క్రషర్ మెషీన్లు ► డ్రైవర్, గార్డుల మధ్య నేరుగా సమాచారం అందించుకోవటానికి ప్రత్యేకంగా హ్యాండ్సెట్ ఫోన్లు. -
జమ్మూ కశ్మీర్‌కు భారీ బహుమతి: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వైష్ణోదేవి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఉదయం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో పచ్చజెండా ఊపి వందే భారత్‌ను ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య ఈ నెల 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అమిత్ షా ఈ సందర్భంగా రైల్వే సిబ్బందితో పాటు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను అభినందించారు. నవరాత్రి సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు అందించే భారీ బహుమతి ‘వందే భారత్’ అని పేర్కొన్నారు. దేవి నవరాత్రుల్లో వైష్ణో దేవి పవిత్ర దేవాలయాన్ని సందర్శించే లక్షలాది యాత్రికులకు వందే భారత్ అనుకూలంగా ఉండనుందని తెలిపారు. ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ–కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని ఎనిమిది గంటలకు తగ్గించనుంది. ఈ రైలులో న్యూఢిల్లీ నుంచి ఆఖరి స్టేషన్ అయిన శ్రీ వైష్ణో దేవి కత్రా వరకు ప్రయాణించడానికి కనీస చార్జీలు రూ.1,630 కాగా, గరిష్టంగా రూ.3,015గా నిర్ణయించారు. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ట్రైన్ నెం: 22439 న్యూఢిల్లీ–కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి, అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్ల మీదగా కత్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. కాగా ఇప్పటికే భారత్ మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఢిల్లీ-వారణాసీ మధ్య నడుస్తోంది. కాగా ఈ రైలు విజయవంతంగా నడుస్తుండటంతో ఇటీవలే భారత రైల్వే మరో 40 నూతన వందే-భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. -
రోజుకు 50 వేల మందికే దర్శనం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. అలాగే బ్యాటరీ కార్లతోపాటు కాలినడకన ఆలయానికి చేరుకునేవారి కోసం రూ.40 కోట్లతో ప్రత్యేకంగా నిర్మించిన రహదారిని ఈ నెల 24న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ దారిలో యాత్రికుల, సరకు రవాణా కోసం గుర్రాలు, గాడిదలు తదితర జంతువులను అనుమతించకూడదంది. పాత మార్గం నుంచి కూడా జంతువుల చేత రవాణాను క్రమక్రమంగా తొలగిస్తామంది. రోడ్లపైన, కాట్రా పట్టణ బస్టాండ్ సమీపాన చెత్త వేసే వారికి రూ.2,000 జరిమానా విధించాలని ట్రిబ్యునల్ చైర్మన్ స్వతంతర్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఆలయానికి చేరుకునే మార్గంలో 19 చోట్ల అగ్ని మాపక పరికరాలను ఏర్పాటుచేశారు. -
కశ్మీర్లో గుండెపోటుతో యాత్రికురాలి మృతి
కశ్మీర్: జమ్మూలోని పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి ఆలయ గర్భగుడి వద్ద ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన 45 ఏళ్ల మహిళా యాత్రికురాలు త్రికుటా భవన్‌కు వెళుతూ లంబికేరి ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో అదే దారిలో వెళ్లే కొందరు యాత్రికులు ఆ మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ మహిళ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మహిళ మృతికి కారణం గుండెపోటు లక్షణాలు కనపడుతున్నాయని వైద్యులు తెలిపారు. అనంతరం యాత్రికురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. -
భార్యను చంపి కొండపైకి తీసుకెళ్లి..
జమ్మూ: వైష్ణోదేవీ యాత్రలో ఓ భర్త తన భార్యను చంపేశాడు. ఆమెను గొంతునులిమి హత్య చేసి ఎవరికీ తెలియకుండా ఓ పెద్ద కొండపై నుంచి కిందపడేశాడు. ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారీపడి ఇలా జరిగిందని నమ్మించేందుకు ఈ పని చేశాడు. వీరిద్దరికి ఈ మధ్యే గత మార్చి 10న పెళ్లి జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన లక్ష్మీ గుప్తా(25), శక్తి గుప్తాలకు గత మార్చి నెలలో వివాహం అయింది. అయితే, వైష్ణోదేవీ ఆలయ దర్శనం పేరిట రియాసీ జిల్లాలోని కాట్రాకు వచ్చి అక్కడే ఒక హోటల్లో రూము తీసుకున్నారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఎవరికీ తెలియకుండా వారు తగువుపడుతునే ఉన్నారు. అయితే, భార్యతో గొడవపడిన రాత్రే ఆమెను గొంతు నులిమి చంపేసి చీకట్లోనే ఓ కొండపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి లోయలో పడేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడ్ని విచారించగా అసలు నేరం ఒప్పుకున్నాడు. -
మానస సరోవర్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ ఏడాది కైలాస్ మానస సరోవర్ యాత్రను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం ఢిల్లీలో ప్రారంభించారు. మొదటి బృందం యాత్ర ప్రారంభం సందర్భంగా సుష్మా మాట్లాడుతూ... యాత్రికులు చైనాలో ప్రవేశించినప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. దాదాపు 1,430 మంది భక్తులు 25 బృందాలుగా చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న మానస సరోవర్‌ను సందర్శించుకుంటారు. వైష్ణోదేవి ఆలయం వద్ద హైఅలర్ట్ జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయ బేస్ క్యాంప్ సమీపంలో ఓ వంతెన వద్ద పోలీసులు జరిపిన తనిఖీలో ఆర్మీకి చెందిన రెండు యూనిఫాంలు, బూట్లు అనుమానస్పదంగా లభ్యమయ్యాయి. దీంతో అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. -
కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
-
కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురి దుర్మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. కాట్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ప్రతి రోజూ జమ్మూ నుంచి కాట్రాకు సమీపంలోని వైష్ణోదేవి ఆలయానికి హెలికాప్టర్ సర్వీసులు తిరుగుతుంటాయి. అందులో భాగంగానే సోమవారం కూడా హెలికాప్టర్ సిబ్బందితోపాటు ఐదుగురు ప్రయాణికులు వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరగా అది కాట్రాకు సమీపంలో కుప్పకూలింది. దీంతో సిబ్బందితో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల తర్వాత మరోసారి ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. -
సొరంగంలో ఆగిపోయిన రైలు!!
జమ్ము కాశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు బేస్ క్యాంపు అయిన కట్రాకు వెళ్లేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన రైలు ఇంజన్ చెడిపోయి.. సొరంగం మధ్యలో ఆగిపోయింది. అలా దాదాపు గంట పాటు రైలు కట్రా రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆగిపోయింది. మొత్తం ఏసీ ఉన్న ఈ శ్రీశక్తి ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ నుంచి కట్రా వెళ్తుంది. మరో ఐదు కిలోమీటర్లు వెళ్తే స్టేషన్ వచ్చేస్తుందనగా సొరంగంలో గంటపాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున 5.10 గంటలకు రైలు కట్రా చేరాల్సి ఉండగా, ఉదయం 7 గంటలకు వచ్చినట్లు ఫిరోజ్‌పూర్ డీఆర్ఎం ఎన్సీ గోయల్ తెలిపారు. కట్రా రైలును ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సొరంగంలో ఆగిపోయిన రైలును మళ్లీ తీసుకెళ్లేందుకు హుటాహుటిన ఉధంపూర్ నుంచి మరో ఇంజన్‌ను పంపారు. అప్పటికే అరగంట ఆలస్యంగా నడుస్తున్న రైలు, ఈ సంఘటనతో మరో గంట ఆలస్యమొంది. -
వైష్ణోదేవి గుడిలో 43 కిలోల నకిలీ బంగారం
దేవుడంటే భయం, భక్తి రెండూ ఉంటాయి. వాటివల్లే కాస్త జాగ్రత్తగా ఉంటారని అనుకుంటాం. కానీ, జమ్ము కాశ్మీర్‌లోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలలో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి.. అంతా నకిలీదేనట!! ఈ విషయం సమాచార హక్కు చట్టం దరఖాస్తులో వెల్లడైంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 193.5 కిలోల బంగారం, 81,635 కిలోల వెండిని కట్రా పట్టణంలోని వైష్ణోదేవి ఆలయంలో సమర్పించారు. ఇందులో 43 కిలోల బంగారం, 57 వేల కిలోల వెండి నకిలీవిగా తేలాయని ఆలయ పాలకమండలి సీఈవో ఎంకే భండారీ వెల్లడించారు. సాధారణంగా అయితే తాము ఇలా వచ్చిన బంగారం, వెండి మొత్తాన్ని ప్రభుత్వానికి పంపి, వాటిని కరిగించి బంగారు, వెండి నాణేలుగా మార్చి భక్తులకు ఇస్తామని ఆయన తెలిపారు. అయితే, భక్తులు కావాలని ఇలా నకిలీ బంగారం వేసి ఉండకపోవచ్చని, వారు కొనేటప్పుడు నాణ్యత పరీక్షలు చేయించుకోకపోవడమే ఇందుకు కారణం అయి ఉండొచ్చని భండారీ చెప్పారు. వైష్ణోదేవి ఆలయానికి గత సంవత్సరం కోటి మందికి పైగా భక్తులు వచ్చారు.