
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలె షారక్ మక్కాను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం షారుక్ పఠాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shah visited Vaishno Devi Temple ❤️
— 👸Sharania Jhanvi𓀠🌹BesharamRang (@SharaniaJ) December 12, 2022
May Devi Maa fulfill all his wishes 🙏🏻 #ShahRukhKhan𓀠 pic.twitter.com/1XrL82XaCW