
Shilpa Shettys Vaishno Devi Trip: పోర్నోగ్రఫీ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దైవ దర్శనం కోసం జమ్ముకశ్మీర్‌కు వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ ఆలయానికి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైష్ణోదేవీ ఆలయంలో శిల్పాశెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ అమ్మవారి పిలుపు మేరకే దర్శననానికి వచ్చాను' అని శిల్పా పేర్కొంది. స్నేహితురాలితో కలిసి జమ్ముకశ్మీర్ పర్యటనను వచ్చిన శిల్పా దీనికి సంబంధించి పలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది.
కాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని గురువారం ముంబై పోలీసులు సాక్షిగా చార్జ్‌షీట్‌లో పేరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బిజీ షెడ్యూల్స్ వల్ల భర్త రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో తనకు తెలియదని శిల్పా పేర్కొంది. అంతేకాకుండా సంబంధిత హాట్‌షాట్స్, బాలీఫేమ్ యాప్స్‌ల గురించి కూడా తెలియదని స్టేట్‌మెంట్‌లో వివరించింది. అనంతరం అట్నుంచి నేరుగా జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లింది.
చదవండి : 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
సీత కోసం ఆ హీరోయిన్స్‌ని సంప్రదించలేదు
Comments
Please login to add a commentAdd a comment