
ప్రతీకాత్మక చిత్రం
లూబెక్/బెర్లిన్: బస్సు ప్రయాణంలో అంతా ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉండగా ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. సహ ప్రయాణికుడు విచక్షణా రహితంగా కత్తితో తోటి వారిపై దాడి చేసి 14 మందిని గాయపరిచాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటన ఉత్తర జర్మనీలోని లూబెక్ పోర్టు వద్ద శుక్రవారం సాయంత్ర చోటుచేసుకుంది.
బాధితుల్లో ఒకరు వెల్లడించిన వివరాలు.. అప్పుడే బయల్దేరిన బస్సు నిర్ధిష్ట వేగంలో ప్రయాణిస్తోంది. సీట్లు నిండుకోవడంతో కాస్త సర్దుకుని ఒక ముసలావిడకి సీటు ఇచ్చాను. అంతలోనే పక్కసీట్లో ఉన్న ఓ వ్యక్తి నా ఛాతీలోకి కత్తి దింపాడని బాధితుడు ఘటనను గుర్తు చేసుకుని వణికిపోయాడు. ఉన్మాదంతో రెచ్చిపోయిన దుండగుడు చూస్తుండగానే చుట్టూ ఉన్నవాళ్లపై కత్తితో విరుచుకు పడ్డాడని వెల్లడించాడు. దాడికి పాల్పడిన వ్యక్తికి ముప్పయేళ్లుంటాయని తెలిపాడు. కాగా, వెంటనే స్పందించిన పోలీసులు దుండగున్నిఅరెస్టు చేసి, జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment