భార్యపై హత్యాయత్నం | Husband Knife Attack on Wife in YSR Kadapa | Sakshi
Sakshi News home page

భార్యపై హత్యాయత్నం

Jan 6 2020 11:48 AM | Updated on Jan 6 2020 11:48 AM

Husband Knife Attack on Wife in YSR Kadapa - Sakshi

దాడిలో గాయపడిన విక్టోరియా, దాడి నుంచి తప్పించుకున్న సులోచన

వైఎస్‌ఆర్‌ జిల్లా ,బద్వేలు అర్బన్‌ : వేధింపులు భరించలేక కొన్నేళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్న ఓ వివాహితను పట్టపగలే ఆమె భర్త అంతమొందించేందుకు యత్నించాడు. ఆదివారం బద్వేలు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు .... బి.మఠం మండలం రేకలకుంట గ్రామానికి చెందిన పాణ్యంశేఖర్‌కు బద్వేలు మండలం తిరువెంగళాపురం గ్రామానికి చెందిన సులోచనతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండేళ్ల పాటు భార్యాభర్తలు కలిసే ఉన్నారు. ఆ తర్వాత అనుమానం, మద్యానికి బానిసైన శేఖర్‌ భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండేవాడు.

దీంతో చేసేది లేక సులోచన 8 ఏళ్లుగా తన ఇద్దరి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో శేఖర్‌ శనివారం రాత్రి తిరువెంగళాపురానికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. అక్కడ స్థానికులు వారించడంతో వెనుదిరిగాడు. రోజూ మాదిరే ఆదివారం పనికి వెళ్లేందుకు సులోచన ఆమె వదిన విక్టోరియాతో కలిసి మైదుకూరురోడ్డులోని ఎస్‌బీవీఆర్‌ డిగ్రీ కళాశాల సమీపంలో ఉండగా మచ్చుకత్తితో దాడికి యత్నించాడు.  సులోచన వదిన (అన్న భార్య) విక్టోరియా అడ్డుకోవడంతో ఆమెపై మచ్చుకత్తితో దాడి చేశాడు.   సులోచన, విక్టోరియాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అర్బన్‌ సీఐ రమేష్‌బాబు, ఏఎస్‌ఐ బాలగురన్నలు కేసులు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement