పోలీసు స్టేషన్‌లో లొంగి పోయిన కాడే సుబ్బయ్యతో ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి,కానిస్టేబుల్
సిద్దవటం: కోడలి పై మచ్చుకత్తితో దాడిచేసి గాయ పరచిన కేసులో కాడే సుబ్బయ్యను బుధవారం అరెస్టు చేశామని ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం లోని భాకరాపేట గ్రామానికి చెందిన కాడే సుగుణ పై ఆమె మామ కాడే సుబ్బయ్య ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం మచ్చుకత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. బుధవారం నిందితుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడన్నారు. ఈమేరకు నిందతుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్‌ఐ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment