మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైత్రీ వనం వైపు వస్తూ.. ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లి కొద్ది సేపు ఆగాడు. విజయనగరం నుంచి వలస వచ్చిన దాని యజమాని మూత్ర విసర్జనకు వెళ్లగా అక్కడున్న కొబ్బరి బొండాలు నరికే కత్తిని దొంగిలించి తన బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై బయల్దేరాడు.
ఈ దృశ్యాలు బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాను గోకుల్ థియేటర్ వద్ద ఉన్నానంటూ కుమార్తె నుంచి మనోహరాచారికి ఫోన్ వచ్చింది. 3.30–3.45 గంటల మధ్య అక్కడకు చేరుకున్న మనోహరాచారి.. కుమార్తె వెంట సందీప్‌ను చూసి మొదట అతడిపై, ఆ తర్వాత మాధవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొబ్బరి బొండాల దుకాణంలో ఆ కత్తి దొరక్కపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని పోలీసులు అంటున్నారు.