కులాంతర వివాహం చేసుకున్నందుకే తనపై మాధవి తండ్రి మనోహరాచారి క్షక్ష్య గట్టాడని సందీప్ ఆరోపించాడు. కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా మనోహరాచారి అనే వ్యక్తి ఈ బుధవారం ఎర్రగడ్డలో కూతురు, అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన కూతురు మాధవి పరిస్థితి విషమంగా ఉండగా అల్లుడు సందీప్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. మాధవి తండ్రి తనను కులంపేరుతో చాలా సార్లు దూషించాడని అన్నాడు. కులాంతర వివాహం చేసుకోవటమే నేరమా అని ప్రశ్నించాడు. కేవలం కులాంతర వివాహం చేసుకున్నామనే కోపంతో తమపై కత్తితో దాడి చేశాడని తెలిపాడు.