Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan fires on Chandrababu Naidu1
తప్పుడు కేసులకు భయపడం మేమెప్పుడూ ప్రజాపక్షం

ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు ఎలాగూ చేయడని తెలిసే ఆయన్ను ఎవ్వరూ కలవడం లేదు. మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే అని మా తలుపులు తడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ప్రజలు వాళ్లకు జరిగిన అన్యాయాలు, సమస్యల గురించి చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిచంద్రబాబూ.. మాపై నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. నువ్వు పెట్టే తప్పుడు కేసులకు నీతోపాటు నీకు పావులుగా మారిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తూ వేసిన విత్తనమే రేపు విష వృక్షమవుతుంది. రేపు మేం అధికారంలోకి వచ్చాక మీతోపాటు టీడీపీ నేతల పరిస్థితి ఏమిటి? ఈ రోజు దెబ్బతిన్న వారు రేపు ఊర్కోరు కదా.. నేను చెప్పినా సరే మావాళ్లు వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలిన వాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. - వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంగా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలను సమీకరించడం.. ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం.. ప్రజలకు తోడుగా నిలబడి వారి పక్షాన పోరాటం చేయడం ప్రతిపక్షం ధర్మం. విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్షంగా మా ధర్మాన్ని మేం నిర్వర్తి­స్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ సహా ఎన్నికల్లో ఇచ్చి న 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను అడ్డగోలుగా మోసం చేసి పరిపాలన సాగిస్తున్నారని ఎత్తి చూపారు. ‘చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది.. ఏ సమస్య వచ్చి నా చంద్రబాబు పరిష్కరించండని, ఆయన్ను కలిసినా వృథాయేనని ప్రజలకు బాగా అర్థమైంది. గట్టిగా మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ఓడిపోతాడు. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని ప్రజలు మా తలుపులు తడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలు, సమస్యల గురించి ప్రజలు మాకు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్ప­డుతూ తప్పుడు ఫిర్యాదులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని పద్ధతి మార్చుకోకపోతే, రేపు తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే మూడేళ్లు ఉంటుంది.నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు.. ఇద్దరికీ వార్నింగ్‌ ఇస్తున్నా.. వడ్డీతో మీరంతా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో పరిస్థితిపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని కడిగి పారేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ » చంద్రబాబు చేసే ప్రతిపని కూడా టాపిక్‌ డైవర్ట్‌ చేసే ఆలోచనతో చేస్తున్నారు. నా పర్యటనల తర్వాత చంద్రబాబు దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. » మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో క్వింటా మిర్చి ధర రూ.21వేలు–రూ.27 వేలు పలికితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది రూ.8–11వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతు ఇస్తూ మిర్చి యార్డుకు వెళ్లింది జగనే. అది తప్పా? అలా వెళ్లినందుకు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ ఉన్న నాకు సెక్యూరిటీని విత్‌డ్రా చేశాడు. ఆయనకు మూడ్‌ వచ్చి నప్పుడు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు సహకరించకపోగా, మాపైనే కేసు పెట్టారు. » ఏప్రిల్‌ 8న శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల చేతిలో హత్యకు గురైన మా పార్టీ బీసీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. హెలిప్యాడ్‌ దగ్గర సరైన భ్రదత లేదు. జనం తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. తిరిగి మాపైనే తప్పుడు ప్రచారం చేశారు. పైలట్ల పైనా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగించి విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యాటన తర్వాత మా పార్టీ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాశ్‌పై కూడా కేసు పెట్టారు. ఇది ధర్మమేనా? » జూన్‌ 11న ప్రకాశం జిల్లా పొదిలిలో ధరలేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్లాను. 40–50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చారు. అదే సమయంలో చంద్రబాబు ఓ 40 మందితో 200 మంది పోలీసుల సెక్యూరిటీ ఇచ్చి రాళ్లు వేయించి, టాపిక్‌ను డైవర్ట్‌ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడికీ రైతులు చాలా సమ్యమనంతో వ్యవహరించారు. 50 వేల మంది.. చంద్రబాబు పంపిన 40 మందిపై పడి ఉంటే బతికేవాళ్లా? అయినా ఆ తర్వాత మూడు కేసులు పెట్టి, 15 మంది రైతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మేము రైతులకు అండగా నిలబడితే చంద్రబాబుకు వచ్చి న నష్టమేంటి? ఇదీ చంద్రబాబు శాడిజం! » గత ఏడాది పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్‌ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లాను. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నా కార్యక్రమాలకు ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకోవడం.. నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం.. ఇళ్లల్లోనే నిర్బంధించేలా చెక్‌పోస్టులు పెట్టడం.. లాఠీచార్జీలు చేయించడమే చంద్రబాబు పని. అక్కడ పోలీసులు నాకు భ్రదత కల్పించడానికి లేరు.. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా చూసుకోవడానికి నిలబడ్డారు. మాపై ఐదు కేసులు పెట్టారు. చంద్రబాబు కుట్రల నేపథ్యంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. పొలిటికల్‌ గవర్నెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరుతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రంలో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న పార్టీ కూడా వైఎస్సార్‌సీపీనే. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్సార్‌సీపీనే స్పందిస్తోంది. ప్రతిపక్షంగా మేము ఏడాదిగా అదే చేస్తున్నాం. -వైఎస్‌ జగన్‌ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ అయిన బీసీ మహిళ హారికకు ఆత్మగౌరవం లేదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. చేతిలో అధికారం ఉంది కదా అని చంద్రబాబు శాడిజం ప్రదర్శిస్తున్నారు. ఇంతటి హేయమైన దాడి చేసి, సిగ్గులేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను పట్టుకుని మహానటి అని టీడీపీ వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మీరు తప్పు చేసి, కారు అద్దాలు పగలగొట్టి.. తిరిగి ఆమెను మహానటి అంటారా? (దాడి చేసిన వీడియో క్లిప్పింగ్‌ ప్రదర్శిస్తూ). ఎవరు మహా నటులు? దాన వీర శూర కర్ణ కంటే గొప్పగా యాక్టింగ్‌ చేస్తున్న చంద్రబాబు కాదా! చంద్రబాబు లైవ్‌ యాక్టింగ్‌ చూసి ఎన్టీఆర్‌ ఎక్కడికో వెళ్లిపోవాలి. ఈ ఘటనలో నాగార్జున యాదవ్‌ అనే మరో జెడ్పీటీసీ భర్తను దారుణంగా కొట్టారు. - వైఎస్‌ జగన్‌ విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యం» చంద్రబాబు ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్‌ చేస్తూ, రైతులకు గిట్టుబాటు ధరరాని దుస్థితిని లేవనెత్తుతూ, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరిస్థితుల్లో ప్రశ్నిస్తూ, సమయానికి ఇచ్చి న ఇన్‌పుట్‌ సబ్సిడీని నీరుగార్చిన విధానాన్ని ఎండగడుతూ గత ఏడాది డిసెంబర్‌ 13న అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలిచింది. » డిసెంబర్‌ 24న కరెంట్‌ చార్జీల బాదుడుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. ఎన్నికలప్పుడు చార్జీలు తగ్గిస్తానన్న పెద్దమనిషి తగ్గించకపోగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడా­ది తిరగక మునుపే రూ.15 వేల కోట్లు బాదడాన్ని నిరసిస్తూ పోరుబాట నిర్వహించాం. » పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం ఆడుతూ వారికి ఇవ్వాల్సిన విద్యా, వసతి దీవెన బకాయిలు ఇవ్వకపోగా, చివరికి పిల్లల చదువులు ఆపేసి పనులకు వెళ్తున్న పరిస్థితుల మధ్య వారికి తోడుగా నిలబడుతూ మార్చి 12న యువత పోరు చేపట్టాం. నిరుద్యోగ భృతి సంగతి ఏమిటని.. గత ఏడాదికి సంబంధించి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.36 వేలు ఎగ్గొట్టిన తీరుపై యువతకు తోడుగా పోరాటం చేశాం. » జూన్‌ 4న చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన సూపర్‌ సిక్స్, సెవన్‌ హామీలను ఎత్తి చూపించాం. ఏడాదిగా ప్రజలకు చంద్రబాబు ఇవ్వాల్సిన బాకీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల సంగతి ఏమిటని నిలదీస్తూ వెన్నుపోటు దినం చేశాం. » ఇప్పుడు బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తి చూపిస్తున్నాం. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ.. చంద్రబాబు ఇచ్చిన బాండ్ల గురించి ప్రజలకు తెలియజేస్తూ.. ఆ బాండ్లను టీడీపీ నాయకులకు చూపిస్తూ ఏడాదిలో ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని లెక్కించి చంద్రబాబును అడిగేట్టుగా జూన్‌ 25న కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో జోరుగా సాగుతోంది. » జూలై 21 నుంచి గ్రామ స్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చంద్రబాబు గతంలో అన్న మాటలు.. గతంలో ఇచ్చిన బాండ్లు.. మేనిఫెస్టో .. చంద్రబాబు చేస్తున్న మోసం.. ఏడాదిగా ఎంత బాకీ ఉన్నాడు.. అన్ని వివరాలు ఒక్కచోటే తెలుస్తాయి. తద్వారా గ్రామ స్థాయిలో చంద్రబాబును నిలదీసేట్టుగా చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. మేము చేసే ప్రతి పనిలో విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయించడమే మా బాధ్యత. మాట వినకుంటే వేధింపులే » మా ప్రభుత్వ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరుతో తలెత్తుకుని సేవలందించారు. మా సంస్కరణలతో పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ నడిచింది. స్పందన కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమస్యల కంటే పోలీసులు, కలెక్టర్లు టీడీపీ వారి సమస్యలనే ఎక్కువగా పరిష్కరించే వారు. వివక్ష చూపించకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసింగ్‌ అనేది పరిష్కరించడంలో ముందుండేది. ఈ రోజు అలాంటి అధికారులు చంద్రబాబు మాట వినకుంటే.. వాళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. » డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను సైతం వేధింపులకు గురి చేశారు. చంద్రబాబు మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్‌ డీజీ సంజయ్‌లను దళిత ఆఫీసర్లు అని కూడా చూడలేదు. బీసీ ఆఫీసర్‌ ఐజీ కాంతిరాణా టాటాను, ఎస్సీ అధికారి, డీఐజీ విశాల్‌ గున్నీపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్‌ చేశారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణల పేరుతో వేధిస్తున్నారు. » నలుగురు నాన్‌ కేడర్‌ ఎస్పీలు, ఒక కమాండెంట్‌ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్‌ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్‌ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్‌ కమాండెంట్లను హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయిస్తున్నారు. ఎనిమిది మంది డీఎస్పీలను సస్పెండ్‌ చేశారు. 80–100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు మాట విననివారి పరి­స్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తుందో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. డీఐజీ ఓ మాఫియా డాన్‌ » చంద్రబాబు తన మోచేతి నీళ్లు తాగే అధికారులను పెట్టుకుని, వాళ్లను అవినీతిలో భాగస్వాములను చేసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే.. డీఐజీ అనే వ్యక్తి ఓ మాఫియా డాన్‌. ఆ జోన్‌లో ఆయన కింద సీఐలు, ఓ డీఎస్పీ ఉంటారు. అదే ఆయన ఆర్మీ. సదరు నియోజకవర్గంలో ఇసుక, మద్యం, బెల్టుషాపుల అనుమతులు, పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లు, పేకాట క్లబ్బులు నడిపే విషయంలో డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేయడమే పని. » ఇక్కడ పోలీసులు వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇవ్వ­డం విచిత్రం. సగం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మిగిలిన సగ భాగం పైన ఉన్న పెద్దబాబు, చిన్నబాబుకు తీసుకెళ్తున్నారు. ఇలా వసూళ్ల దందాను డీఐజీలతో నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసి భరించలేక కొంత మంది ఐపీఎస్‌ అధికారులు.. సిద్ధార్థ కౌశల్‌ యంగ్‌స్టర్‌ రాజీనామా చేసి వీఆర్‌ఎస్‌ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఢిల్లీకి పోవడానికి చంద్రబాబు రిలీవ్‌ చేయడు.. ఇక్కడే ఉండి వేధింపులు ఎందుకని రాజీనామాలు చేస్తున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీకి మౌలిక హక్కులు తెలియవా? » చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీలో రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో తెలీదా? ఈ పెద్ద మనిషి ఇన్నాళ్లు రాజకీయాలు ఎలా చేశాడు? మీటింగులు పెట్టుకోవడం, ప్రజల దగ్గరకు వెళ్లడం.. వాళ్లను చైతన్య వంతులు చేయడం.. ఇవన్నీ రాజకీయ పార్టీల హక్కులు కావా? ప్రభుత్వం ఏదైనా అన్యా­యం చేసినా, నష్టం జరిగినా, ప్రభుత్వం మోసం చేసినా, ఆ ప్రభుత్వాన్నిప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటన కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. » గుడివాడలో అక్కడి స్థానిక (గుడ్లవల్లేరు) జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ బీసీ మహిళ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? దుర్భాషలాడుతూ.. నోటికొచ్చి నట్టు ఎందుకు తి­ట్టారు? చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే తప్పేముంది? కారులో వెళ్తుంటే దారి మధ్యలో అడ్డగించారు. సాయంత్రం 5 గంటలకు దాడి మొద­లైంది. 6.30 గంటల వరకు హారికను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ.. కొడుతూ.. కారు అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతున్నా, వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. » ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసినట్టు స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుంటే ఎంత మందిపై కేసులు పెట్టారు? ఎంత మందిని అరెస్టు చేశారు? పై నుంచి ఫోన్లు చేసి దాడికి పంపించారు. 8న పేర్ని నాని ఓ డైలాగ్‌ గురించి మాట్లాడితే.. 11న మూడు రోజుల తర్వాత గుడివాడ ప్రోగ్రాంకు వెళ్తుంటే పథకం పన్ని, దారికాచి దాడి చేశారు. కళ్లముందు కనిపిస్తున్న ఈ వీడియోను పక్కనపెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన తన కారుతో గుద్దారని కేసు. హారిక, రాము ముందర సీటులో కాదు.. వెనుక సీటులో కూర్చున్నారు. హారిక జెడ్పీ చైర్‌పర్సన్‌.. అది ప్రభుత్వ కారు. డ్రైవర్‌ను ప్రభుత్వం ఇచ్చి ంది. ఒక బీసీ మహిళకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాతారు? సిగ్గుండాలి. ఎక్కడైనా దూకిచావాలి వీళ్లంతా? » మరుసటి రోజు పేర్నినాని, కైలే అనిల్‌ కుమార్‌.. పెడనలో సభ పెట్టిన వారందరిపై మరో కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్‌ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు చేసిన మోసాలను క్యాడర్‌ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ .. రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో.. క్యూఆర్‌ కోడ్‌ రిలీజ్‌ చేయకూడదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కనపెడితే పోలీసుల సమక్షంలోనే చేస్తున్న దాడులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు దగ్గరుండి పోలీసులే బాధితులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా? » సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపారు. నీకు అ డైలాగులు నచ్చకపోతే సెన్సార్‌ బోర్డుకు చెప్పి వాటిని తీసేయించొచ్చు కదా? నిజానికి బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో డైలాగులు ఇంకా దారుణంగా ఉంటాయి. సినిమాల్లో డైలాగులు, మంచి పాటలు సహజంగానే పాపులర్‌ అవుతాయి. మంచి పాట పాడితే తప్పు అంటావ్‌.. మంచి డైలాగు పోస్టర్లు పెట్టినా, మాట్లాడినా తప్పంటావ్‌.. సినిమా వాళ్లు చేసే హావభావాలు చేస్తే తప్పంటావ్‌.. బయట ఎవరైనా సరే.. ఇలా అన్నా తప్పే.. అలా అన్నా తప్పే.. అంటే ఎలా? అలాంటప్పుడు సినిమాలను ఆపేయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? ఆలోచన చేసుకోవాలి. » ఎవరో ఏదో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన, పోస్టర్లు ప్రదర్శించిన మాత్రాన మీకొచ్చే నష్టమేమిటి? గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం అన్నట్టుగా ఉంది వీళ్ల తీరు.. 131 మందికి నోటీసులు ఇచ్చారు. సినిమా డైలాగులు పోస్టర్లు పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపించారు. చంద్రబాబు పేరు ఎవరు చెబితే వాళ్లను పిలిపించుకోవడం.. రోజంతా కూర్చోబెట్టుకోవడం.. వేధించడం చేస్తున్నారు. చార్జిషీట్లు చూస్తే ‘అండ్‌ అదర్స్‌’ అని ఖాళీగా పెట్టి.. వాళ్లు టార్గెట్‌ చేసిన వాళ్లను ఇన్‌స్టాల్‌మెంట్‌ బేస్‌లో చేరుస్తున్నారు. » స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ‘అండ్‌ అదర్స్‌’లో అందర్నీ చేర్చి ఎత్తి లోపలేయడం.. ఎందుకింత కుట్రలో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకొనేలా పాలన చేయాలి. అదీ సత్తా. అంతే కానీ ఓ పక్క అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాడు ఇట్టా అన్నాడు.. అట్టా అన్నాడంటూ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం? పోలీసుల దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కొడుకును కోల్పోయిన ఆ పెద్దాయనను పరామర్శించేందుకు నేను వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి మా పార్టీకి చెందిన సర్పంచ్‌. పోలీసుల వేధింపులు వల్ల ఆయన చనిపోతే బెట్టింగ్‌ వలన చనిపోయాడంటూ దొంగ కేసులు పెట్టడం దుర్మార్గం.రైతులు రౌడీషీటర్లా? » మరొక వైపు ధరల్లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే.. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో ఇదే తోతాపురి మామిడి ధర కిలో రూ.25–29 ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.2–3కు పడిపోయింది. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలను జూన్‌ 2వ, 3వ వారమైనా తెరవలేదు. ఫ్యాక్టరీలు నెల ఆలస్యంగా తెరవడం, ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం, సప్లయి ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. ఇది మానవ తప్పిదం కాదా? » చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలు.. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌ వంటి వాటికి మేలు చేసేందుకే ఇదంతా చేశారు. మీరు ప్రకటించిన ధర ప్రకారం ఎంత మంది రైతులకు కిలోకు రూ.12 వచ్చి ంది. ఇది కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని ధర. పొరుగునున్న కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాస్తే కిలో రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తోంది. నువ్వు మాత్రం ఇక్కడ కిలో రూ.12కు కొనిపిస్తానని చెబుతున్నావు. » 2.20 లక్షల ఎకరాల్లో 6.50 లక్షల టన్నుల పంట అమ్ముకునే దారి లేక 76 వేల రైతు కుటుంబాలు చంద్రబాబు పుణ్యమా అని అల్లాడిపోతున్నాయి. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను అక్కడకు వెళ్తే.. తప్పా? నేను వెళ్లడం ఏమైనా నేరమా? బంగారుపాళ్యం పర్యటనలో రైతులు పాలుపంచుకోవడం తప్పా? ఈ పర్యటనలో వందల మందిని నిర్బంధించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 2 వేల మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. » ముగ్గురు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 2 వేల మంది పోలీసులు, ప్రతి గ్రామానికి, ప్రతి సందుకు చెక్‌ పోస్టులు పెట్టారు. వీళ్లంతా నాకు సెక్యురిటీ కోసం కాదు.. నా కార్యక్రమానికి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. బైకులకు పెట్రోల్‌ పోయకూడదని చివరికి పెట్రోల్‌ బంకులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయినా సరే కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం, దేశం దృష్టికి సమస్య వెళ్లాలని మామిడి కాయలను రోడ్లపై పారబోసి నాతో కలిసి వచ్చారు. ఈ పర్యటనపై ఐదు కేసులు పెట్టారు. 20 మందిని అరెస్ట్‌ చేశారు.ఈనాడు.. అదీ ఒక పేపరేనా? » రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన కార్యక్రమం అది. ఇదేదో నేరమన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈనాడు.. అదీ ఒక పేపరేనా? ఈనాడు పేపరు చూస్తుంటే ‘టాయిలెట్‌ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ’ అన్నట్టుగా ఉంది. ఏమిటా రాతలు? ఓ పక్క ధర లేక రైతులు రోడ్డు మీదకు వస్తుంటే రైతులందరూ బ్రహ్మాండంగా కేరింతలు కొడుతున్నారని రాస్తున్నారు. » మామిడి పండ్లను రోడ్లపై వేసినందుకు వాళ్లపై కేసులు పెట్టారు. తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు. రోడ్డెక్కి నిలదీయకూడదన్నట్టుగా ఉంది చంద్రబాబు పాలన తీరు. ఎన్నికల్లో ఇచ్చి న సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌తో సహా 143 హామీలన్నీ నెరవేర్చేశామని ప్రజలంతా భావించాలట! వారంతా ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టుగా భావించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. కాదు.. కుదరదు అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం. పాలకుడని చెప్పుకునేందుకు చంద్రబాబుకు, మీడియా అని చెప్పుకునేందుకు ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. ఇది పైశాకత్వం కాదా?» రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పాలంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి తాను వెళ్లలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆయన ఎప్పుడు అక్కడకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఐ ఏకంగా గన్‌ చూపిస్తున్నాడు. (వీడియో చూపిస్తూ).. అసలు బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలు, పచ్చ శాడిస్ట్‌లు పోలీసుల సమక్షంలోనే ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేసిన ఘటన చేశాం. » ప్రసన్న నిజంగా ఇంట్లో ఉండి ఉంటే చంపేసి ఉండేవారు. (పోలీస్‌ సైరన్‌ మోగుతూ వాహనం ఇంటి బయటే ఉండగానే ఇంట్లోకి చొరబడుతున్న ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ). అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఇంట్లో ఉండి ఉంటే మనిషే లేకుండా చేసే వారు. దాడి చేయించిన, ధ్వంసం చేయించిన ఎమ్మెల్యేపై కానీ, వాళ్ల మనుషులపై కానీ ఎలాంటి చర్యలు.. కేసులుండవు. ఎలాంటి అరెస్ట్‌లు చేయరు. తిరిగి ప్రసన్నపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఇక ఎవరికి రక్షణ ఉన్నట్టు? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కుట్రలతో రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చి , దాన్ని కొనసాగిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్‌ ఆపరండా » ఒక కేతిరెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్‌లే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళితో సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వీరితో పాటు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి వంటి జీవితంలో మచ్చలేని రిటైర్డ్‌ అధికారులపై.. ఇలా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్‌ ఆప­రండా. తమకు కావాల్సినట్టుగా వాంగ్మూలాలు తీసుకోవడం, వాటి ఆధారంగా ఇష్టమొచ్చి నట్టు అరెస్టులు చేయడం. » ఇదే మోడస్‌ ఆపరండాతో దేశంలో ఎవరినైనా, ఎక్కడైనా.. ఎప్పుడైనా అరెస్ట్‌ చేయొచ్చు అని చంద్రబాబు చూపిస్తున్నాడు. ప్రధాని మోదీ, అమిత్‌షాలను కూడా అరెస్ట్‌ చేయొచ్చు. ఎలాంటి మినహాయింపు లేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడైన నాతో పాటు మా పార్టీకి చెందిన గ్రామ, రాష్ట్ర స్థాయి నాయకులు, చివరికి సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూడా ఇదే మోడస్‌ ఆపరండాతో తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారు. » ఇదే సంప్రదాయాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగిస్తే.. దెబ్బలు తిన్న వీళ్లు ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నా. మీరు ప్రారంభించిన ఈ తప్పుడు సంప్రదాయం విష వృక్షంగా మారుతుంది. ఎల్లకాలం రోజులన్నీ ఒకేలా ఉండవు. అధికారం ఎవరి చేతుల్లోనూ శాశ్వతంగా ఉండదు. ఈరోజు పైన మీరు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత మేము పైకి వస్తాం. మీరు కిందకు వస్తారు. అప్పుడు పరిస్థితి ఏమిటి? తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Janasena rayudu Grand Mother Rajeshwari Key Comments On Pawan2
అయ్యా పవన్‌.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ: రాజేశ్వరమ్మ

సాక్షి, శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జి కోట వినుత మాజీ డ్రైవర్‌ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపులేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ స్పందించకపోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెబుతున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను చంపేస్తున్నారని.. టీడీపీ నేతకు కూడా రాయుడు మెసేజ్‌ పెట్టాడు. కానీ, ఆయన ఏమీ స్పందించలేదు. నా పేరు బయటకు చెప్పవద్దు.. మీ చావు మీరు చావండి అని అన్నాడని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. రాయుడు సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్‌ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది.ఇదిలా ఉండగా.. అతి సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్‌ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.హత్య ఎందుకు జరిగింది..ఎలా చేశారంటే?జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసులుపై నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్యనేత అతడికి డబ్బులు ఎర చూపి, వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే గత నెల 21న శ్రీనివాసులును విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్న కొన్ని వీడియోలు బయట పడడంతో అతడిని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్‌ వేసినట్లు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.అయితే అందులోని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్‌నాయుడు అతడిని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్‌ ప్రకారం పార్టీలోని మరో నలుగురు వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులును శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అక్కడ విచక్షణా రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్‌ ఏరియా కూవం నదిలో పడేసి ఆంధ్రాకు తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు.నిందితులను పట్టించిన పచ్చబొట్టుచెన్నై నగరం, నార్త్‌ జోన్‌ సెవన్‌ వెల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రైనేజీ కాల్వలో యువకుడి మృతదేహాన్ని ఈనెల 8వ తేదీన గుర్తించిన పోలీసులు పోస్టుమార్టంలో హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చబొట్టు ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్‌ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్‌చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందిన దస్తా సాహెబ్, శ్రీకాళహస్తికి చెందిన కె.శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందిన ఎస్‌.గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.

USA Alaska Hits Earthquake And Tsunami3
అమెరికాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరిక!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని అలస్కా సముద్ర తీరం భారీ భూకంపం కారణంగా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.3గా నమోదు అయినట్టు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే గుర్తించింది. అలాగే, సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. దీంతో, అధికారులు అప్రమత్తమన్నారు. ఇక, భూకంపానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వివరాల ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతగా దీన్ని గుర్తించారు. 20.కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్యాండ్‌ పాయింట్‌ సిటీకి 87 కి.మీ దూరంలో దీని ఎపీసెంటర్‌ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందస్తు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు.We got this incredible footage of today's earthquake from a resident in Sand Point, about 50 miles from the epicenter. We are grateful to those who shared their experiences -- it allows others to understand what an earthquake is like, and be better prepared. We are also grateful… pic.twitter.com/5tkqcbgp9Y— Alaska Earthquake Center (@AKearthquake) July 17, 2025 #BREAKING: Water levels have dropped significantly in the last 30 minutes near Raspberry Island, Alaska, following the M7.2 earthquake.This could be a sign of an incoming tsunami wave.#TsunamiWarning #Alaska #RaspberryIsland #Earthquake pic.twitter.com/nbK8cSKpil— upuknews (@upuknews1) July 16, 2025మరోవైపు.. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్‌సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 ఉత్తర అమెరికా ప్రాంతంలో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2023లో కూడా అలస్కాలో భూమి కంపించింది. అప్పుడు 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. Receding waters ahead of the Alaska Tsunami pic.twitter.com/IEaF9UDCRS— Gpena (@SunPowerFusion) July 16, 2025🚨 BREAKING: Water is now receding along the Alaskan coast following the 7.3 earthquake, a clear sign a tsunami is approaching.Residents of Sand Point, Alaska have been ordered to EVACUATE IMMEDIATELY.The National Weather Service and U.S. Tsunami Warning Center have issued an… pic.twitter.com/tcg1GslJsV— Hank™ (@HANKonX) July 16, 2025

Air India Completes Inspection of Fuel Control Switches4
Air India crash probe: ‘ఇంధన స్విచ్‌లలో ఇబ్బందే లేదు’

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గత నెలలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన దరిమిలా, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతున్నాయి. ఇదే కోవలో ఎయిర్‌ ఇండియా కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 787-8 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్‌సీఎస్‌) లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది.ఈ నేపధ్యంలో ఇంధన నియత్రణ స్విచ్‌లతో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)బోయింగ్ విమాన నమూనాల ఎప్‌సీఎస్‌ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 787-8 విమానాలలో పరిశీలనలు చేశారు.తమ ఇంజనీరింగ్ బృందం ఎస్‌సీఎస్‌ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసింది. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు. లాకింగ్ ఫీచర్‌తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ అన్ని బోయింగ్ విమాన నమూనాలలో ఒకే తరహాలోనే ఉంటుందని, అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8లో కూడా ఇదే తరహా స్విచ్‌ ఉందని ఎయిర్‌ ఇండియా అధికారులు తెలిపారు.

Trump says August 1 lot of Money will come into country5
‘ఆగస్టు ఒకటిన మాకు డబ్బే డబ్బు’: ట్రంప్‌‌ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా విధించిన సుంకాల గడువు తరుముకొస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉందని ప్రకటించారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఒకటి తమకు ఒక ముఖ్యమైన రోజు కానున్నదని, ఆ రోజున తమ దేశానికి పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.భారతదేశంతో తాము కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చెబుతూనే, దీనిపై భారతదేశం- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆ సమావేశంలో తెలిపారు. ఆగస్టు ఒకటిన తమ దేశానికి గణనీయంగా డబ్బు వస్తుందని, తాము పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్‌ ప్రకటించారు. ఇప్పడు ఇంకో ఒప్పందం కుదరబోతోందని, అది బహుశా భారతదేశంతో కావచ్చని, దీనిపై చర్చల్లో ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు. వారికి తాము ఒప్పందానికి సంబంధించి, ఒక లేఖ పంపామని తెలిపారు. భారతదేశంతో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.భారత మార్కెట్లకు లబ్ధి చేకూర్చే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని అన్నారు. కాగా భారత్‌- అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (బీటీఏ) ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల మేరకు ముందుకు సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం ఐదవ రౌండ్ చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు ఏఎన్‌ఐకి తెలిపారు.

Bangladesh Beat Sri Lanka By 8 Wickets In 3rd T20I, Clinches T20 Series For First Time In Sri Lanka6
సొంతగడ్డపై శ్రీలంకకు ఊహించని పరాభవం.. చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌

ఇటీవలికాలంలో సొంతగడ్డపై ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. అన్ని విభాగాల్లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్‌ ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 16) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్‌ ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌కు శ్రీలంకలో ఇది తొలి టీ20 సిరీస్‌ విజయం. బంగ్లా కెప్టెన్‌గా లిట్టన్‌ దాస్‌కు పరాయి గడ్డపై ఇది రెండో టీ20 సిరీస్‌ గెలుపు. ఈ సిరీస్‌ గెలుపుతో లిట్టన్‌ దాస్‌ చరిత్ర సృష్టించాడు. పరాయి గడ్డపై రెండు టీ20 సిరీస్‌ విజయాలు సాధించిన తొలి బంగ్లాదేశ్‌ కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. లిట్టన్‌ గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించాడు. శ్రీలంక, వెస్టిండీస్‌లో కాకుండా బంగ్లాదేశ్‌ పరాయి దేశాల్లో మరో రెండు టీ20 సిరీస్‌ విజయాలు మాత్రమే సాధించింది. ఈ రెండు కూడా జింబాబ్వేలో కాగా.. ఒకటి మష్రఫే మొర్తజా నేతృత్వంలో (2012లో 3-1 తేడాతో), మరొకటి మహ్మదుల్లా సారథ్యంలో (2021లో 2-1 తేడాతో) సాధించింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. మెహిది హసన్‌ (4-1-11-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముస్తాఫిజుర్‌ (4-0-17-1), రిషద్‌ హొస్సేన్‌ (4-0-20-0) కూడా అదే పని చేశారు. షొరిఫుల్‌ ఇస్లాం (4-0-50-1), తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ (2-0-23-0) మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. షమీమ్‌ హొస్సేన్‌ 2 ఓవర్లలో ఓ వికెట్‌ తీసి పర్వాలేనిపించాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (46), దసున్‌ షనక (35 నాటౌట్‌), కమిందు మెండిస్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకంతో బంగ్లాదేశ్‌కు సునాయాస విజయాన్నందించాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌ (0) ఔటైనా.. లిట్టన్‌ దాస్‌ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, సిక్స్‌), తౌహిద్‌ హృదోయ్‌ (25 బంతుల్లో 27 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) తమీమ్‌కు సహకరించారు. ఫలితంగా బంగ్లాదేశ్‌ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో నువాన్‌ తుషార, కమిందు మెండిస్‌ తలో వికెట్‌ తీశారు.

Hari Hara Veera Mallu Poster On Burj Khalifa Is Real Or Fake7
'వీరమల్లు' ఈ రుద్దుడు ఎందుకు..?

'గబ్బర్ సింగ్' సినిమాలో 'నాకు కొంచెం తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది' అంటూ పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది. అయితే, ఆయన అభిమానులు 'హరి హర వీరమల్లు' సినిమా విషయంలో ఇదే లెక్కను ఫాలో అవుతున్నారనిపిస్తుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఎలాంటి బజ్‌లేని ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ట్రైలర్‌ విడుదల సమయంలో వ్యూస్‌ పరంగా ఫేక్‌ చేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ వేశారు. ఈ క్రమంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద హరి హర వీరమల్లు పోస్టర్‌ అంటూ అందుకు సంబంధించిన ఫేక్‌ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. అయితే, అవి నిజమేనని అందరూ నెటిజన్లు కూడా షేర్‌ చేస్తున్నారు. విషయం తెలిసిన వారు మాత్రం ఇలాంటి ఫేక్‌ ప్రచారాలు ఎందుకు చేసుకుంటారని ఘాటుగానే విమర్శిస్తున్నారు.గత కొన్ని గంటలుగా సోషల్‌మీడియాలో బుర్జ్ ఖలీఫా మీద 'హరి హర వీరమల్లు' పోస్టర్ అంటూ ట్రెండ్‌ అవుతుంది. అయితే, అది నిజమైనది కాదు. సినిమా అధికారిక హ్యాండిల్‌ను అనుకరించే నకిలీ ఖాతా నుంచి మొదటసారి పోస్ట్‌ చేయబడింది. ఆపై వందల కొద్ది పలు పేజీలు దానిని షేర్‌ చేయడంతో వైరల్‌ అయిపోయింది. అంతపెద్ద ఎత్తున పోస్టర్‌ను పంచుకుంటే.. చిత్ర యూనిట్‌ తప్పకుండా తమ అధికారిక పేజీలో షేర్‌ చేస్తుంది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, సినిమా ప్రచార మాత్రం పెద్దగా లేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, టాలీవుడ్‌లో సినిమా బజ్‌ బాగున్నప్పటికీ.. హిందీ, తమిళ్‌లో పెద్దగా బజ్‌ లేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమోషన్‌ కార్యక్రం కూడా చిత్ర యూనిట్‌ నిర్వహించలేదు. హిందీ హక్కులను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు.పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికను మేకర్స్‌ ఫైనల్‌ చేశారు. జులై 24న పాన్‌ ఇండియా రేంజ్‌లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.Trust the Process 🔥🦅#HariHaraVeeraMallu #BurjKhalifa pic.twitter.com/tvH2Y8FGo1— HariHaraVeeraMallu (@HHVMTeam) July 16, 2025Nice job @HHVMFilm, @AMRathnamOfl, @MegaSuryaProd HHVM hits Burj Khalifa, excellent promotions👏🏻👏🏻#HariHaraVeeraMallu pic.twitter.com/siMGeNqnkl— Megha Shyam Reddy 🦅🚩 (@MSRv96) July 16, 2025

TDP Leader Emotional Comments Over Chandrababu8
విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ!.. టీడీపీకి బిగ్‌ షాక్‌?

సాక్షి, చీరాల: ‘తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలువునా మోసం చేసి చంపేశారు. మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది. చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్‌ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏదైనా విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ..!’ బాపట్ల జిల్లా, చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్‌ పొత్తూరి సుబ్బయ్య ఆవేదనా పూరిత వ్యాఖ్యలివి.వివరాల్లోకి వెళితే, మే 14న చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం, బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌ స్థానానికి పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్‌గా ఎంపీ ప్రతిపాదించగా, ఆ­య­న ఎన్నికయ్యారు.అప్ప­టి వరకు తనకే ఆ అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్‌ హాలు నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి 16 వేల ఓట్లు ఉన్నాయని, 83 శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలో­నూ రెండు సార్లు తనకు చైర్మన్‌ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. అమ్ముకోవడానికి ఇక మి­గి­లింది కిడ్నీలు, లివర్‌ మాత్రమేనని వాపోయారు. వైఎస్సార్‌సీపీని కాదనుకొని వస్తే.. ఇంత అన్యాయమా? వైఎస్సార్‌సీపీని కాదనుకొని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తూరి వాపోయారు. తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేస్తానన్నారు.

ex showroom price updates for the Maruti Baleno and Ertiga9
మారుతీ ఎర్టిగా, బాలెనో ధరలు పెరిగాయ్‌..

మారుతీ సుజుకీ ఎర్టిగా, బాలెనో కార్ల ధరలు పెంచింది. ఈ మోడళ్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌ బ్యాగులు అందిస్తున్న కారణంగా వీటి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎర్టిగా ఎక్స్‌షోరూమ్‌ ధర 1.4% మేర పెరగ్గా.. బాలెనో ధర 0.5% పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జులై 16 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బాలెనో ధర రూ.6.7 లక్షలు – రూ.9.92 లక్షలుగా ఉంది. ఎర్టిగా ధర రూ.8.97 లక్షల నుంచి ప్రారంభమై రూ.13.25 లక్షల వరకు ఉంది.ఇదీ చదవండి: ఉపాధి కల్పించేలా రూ.200 కోట్లు పెట్టుబడిధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుఉక్కు, అల్యూమినియం, రబ్బరు వంటి ముడి పదార్థాలు సంవత్సర ప్రాతిపదికన గణనీయమైన పెరుగుదలను చూశాయి. అల్యూమినియం 10.6%, రబ్బరు దాదాపు 27% పెరిగింది. ఇవి నేరుగా తయారీ వ్యయాలను పెంచుతాయి.యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి బలహీనపడింది. దిగుమతి చేసుకునే విడిభాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి.భారత్ స్టేజ్ 7 ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహన తయారీదారులు శుభ్రమైన సాంకేతికతల్లో పెట్టుబడి పెట్టాలి.ఆపరేషనల్ & లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. ఇంధనం, రవాణా, గిడ్డంగుల ఛార్జీలు పెరిగాయి.స్థానిక తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతి చేసుకునే విడిభాగాలపై సుంకాలు పెరిగాయి. ఇది మార్జిన్లపై ప్రభావం చూపింది.

A high drama on Banakachar in Delhi10
ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా

బనకచర్లపై ఏపీ ప్రస్తావన తేలేదు అసలు బనకచర్లను ఏపీ వాళ్లు కడతామని ప్రస్తావిస్తేనే కదా? ఆపమని మేం అభ్యంతరం తెలిపేది? ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనధికార భేటీ మాత్రమే. – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిబనకచర్లపై సానుకూలం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైంది. చర్చలు ఫలప్రదమయ్యాయి. – రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుసాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల నుంచి తీవ్ర వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై ఢిల్లీ వేదికగా చంద్ర­బాబు ప్రభుత్వ కపటత్వం బట్టబయలైంది. బనకచర్ల ఏ ఎజెండాగా బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమక్షంలో తెలంగాణ సీఎంతో సమావేశం అవుతున్నట్లు బీరాలు పలికినా... అసలు ఆ ప్రాజెక్టు చర్చకే రాలేదని తేలింది. దీంతో బనకచర్లపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. కేంద్ర మంత్రి వద్ద జరిగిన భేటీలో బనకచర్ల ప్రస్తావనే రాలేదంటూ మీడియా సమావేశంలో సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో... చంద్రబాబు సర్కారు హైడ్రామా బయటపడింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనధికార భేటీ మాత్రమేనని రేవంత్‌ పేర్కొనడం, అసలు బనకచర్ల కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తేనే కదా? ఆపమని తాము అభ్యంతరం తెలిపేది అనడం... కేంద్రం ఎలాంటి ఎజెండా పెట్టుకోకుండా, వేదిక అందించిందని స్పష్టం చేయడంతో చంద్రబాబు ప్రభుత్వ బండారం వెలుగులోకి వచ్చింది.బనకచర్లపై చర్చించలేదని కేంద్రమూ చెప్పింది...కేంద్ర మంత్రితో భేటీ అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడగా, చంద్రబాబు మాత్రం మొహం చాటేశారు. తమది అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కాదని, సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార (ఇన్‌ఫార్మల్‌) సమావేశమని కూడా రేవంత్‌ పేర్కొన్నారు. అయితే, ఏపీ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఏకంగా బనకచర్లపై నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని ప్రకటించేశారు. కానీ, సమావేశంలో చర్చించిన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో బుధవారం రాత్రి 7.27 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో బనకచర్ల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. తాము సాధారణ అంశాలే చర్చించామంటూ రేవంత్‌ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో బనకచర్ల సింగిల్‌ పాయింట్‌ అజెండా అంటూ బీరాలు పోతూ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా ఆ ప్రాజెక్టుపై చర్చనే జరగలేదని తేలిపోయింది.సింగిల్‌ పాయింట్‌ అజెండాగా వెళ్లినా...అసలు బనకచర్ల ప్రతిపాదనలోనే చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సాగునీటి నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఎర్త్‌ వర్క్‌లు చేసి భారీఎత్తున కమీషన్లను కొట్టేసేందుకే బనకచర్లను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బనకచర్ల అసాధ్యం అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తేల్చి చెప్పింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలను తరలించే వీలుంటుందని, 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని కేంద్ర జల్‌శక్తి శాఖకు స్పష్టం చేస్తూ లేఖ రాసింది. ఇదిలాఉంటే పోలవరంలో 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచర్లకు తరలిస్తామని కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ, పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు పరిమితమైతే.. 42 మీటర్లలో నీళ్లే నిల్వ ఉండవు. లేని నీటిని తరలించేందుకు బనకచర్ల ప్రతిపాదన తేవడం చూస్తుంటే.. చంద్రబాబుకు గోదావరి వరద జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి లేదని బహిర్గతమైంది. బనకచర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీ వెళ్లి ఆ ప్రాజెక్టుపై చర్చే లేకుండా వెనుదిరగనుండడం కూడా దీనిని బలపరుస్తోంది.డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమే...సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా బనక­చర్లను చంద్రబాబు పావుగా వాడు­కున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతు­న్నారు. సీఎంల సమావేశంలో పరి­ష్కారం కుదిరిందని చెబుతున్న నాలుగు అంశాలు కూడా కృష్ణా–గోదావరి బోర్డుల స్థాయిలోనే పరిష్కారం అయ్యేవేనని స్పష్టం చేస్తున్నారు.బనకచర్లపై ఏపీ ప్రస్తావన తేలేదు: రేవంత్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘అసలు బనకచర్లను ఏపీ వాళ్లు కడతామని ప్రస్తావిస్తేనే కదా...? ఆపమని మేం అభ్యంతరం తెలిపేది..? ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనధికార భేటీ మాత్రమే’’ అని తేల్చి చెప్పారు. కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, వేదికను అందించి మధ్యవర్తిలా వ్యవహరించిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఏపీ సీఎంలు, నీటి పారుదల శాఖల మంత్రుల సమావేశం అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఇది అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కాదని... సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార సమావేశమని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయనున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నారు. బనకచర్లపై సానుకూలం చర్చలు ఫలప్రదం: మంత్రి నిమ్మలపోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సాను­కూల స్పందన వ్యక్తమైందని మంత్రి రామానాయుడు తెలిపారు. బనకచ­ర్లతో అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ ఆధ్వ­ర్యంలో పనిచేసే ఈ కమిటీలో సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు ఉంటారని పేర్కొ­న్నారు. సోమవారంలోగానే బనక­చర్లపై కమిటీ నియామకం జరుగుతుందన్నారు. గోదావరి నది నుంచి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీలపై కూడా కమిటీ ఆరా తీసి నివేది­కలో పొందుపరుస్తుందని చెప్పారు. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వాలకు నివే­దిస్తుందన్నారు. తర్వాత మరోసారి సీఎంలు సమావేశమై జల వివాదాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి నిమ్మల పేర్కొ­న్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో సమా­వేశం స్నేహపూ­రిత, సుహృద్భావ వాతావర­ణంలో జరిగిందన్నారు. కృష్ణా బోర్డు అమరావతిలో, గోదా­వరి బోర్డు హైదరాబా­ద్‌లో ఉండాలని నిర్ణ­యం తీసుకున్నట్లు రామానాయుడు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, తెలంగాణ కలిసి కాపాడు­కోవా­లని, మరమ్మతులు, ప్లంజ్‌పూల్‌ రక్షణ విషయంలో సీడబ్ల్యూసీ సిఫార్సులు, నిపుణుల సూచనలు పాటించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు.జల వివాదాలపై సాంకేతిక కమిటీసాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి.. కేంద్ర ప్రభుత్వ, రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులు, ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలపై సమావేశం జరిగింది. భేటీలో నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించాం. ప్రాజెక్టులపై టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు, శ్రీశైలం నిర్వహణ, రక్షణ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా యాజమాన్య బోర్డు ఏపీలో, గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగిలిన సమస్యలను సమగ్రంగా, సాంకేతికంగా పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ అపరిష్కృత సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు సమర్థవంతమైన నీటి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆచరణీయమైన పరిష్కారాలను సూచిస్తుంది. వారంలోగా కమిటీ ఏర్పాటవుతుంది. రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను సులభతరం చేసేందుకు జలశక్తి శాఖ నిబద్ధతతో ఉంది..’ అని పేర్కొంది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్, జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, నీటి పారుదల శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, రెండు రాష్ట్రాల సీఎస్‌లు, నీటి పారుదల శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement