intercast marriage
-
మన బ్రెయిన్ చిప్ లాకైందా?
ఈమధ్య నేను మానవ జన్యుశాస్త్రం మీద కొంత అధ్యయనం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఎపిజెనెటిక్స్, యునిజెనెటిక్స్ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నాకర్థమైంది. మానవ మెదడు ఒక తరం నుండి మరో తరానికి మేధా శక్తిని జన్యు మార్పు ద్వారా అందిస్తుందని ఈ సైన్సు చాలా స్పష్టంగా నిరూపించింది. ఈమధ్య కాలంలో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ ఒడెడ్ రెచావీ అనే జెనెటిసిస్టు మానవ మెదడులోని ఆలోచనా శక్తి పిల్లలకు చాలా తరాల నుండి సంక్రమిస్తుందని తేల్చాడు.కులం, ఏకవృత్తి మనకేం చేశాయి? ఈ అధ్యయనంలో ఆయన కనుక్కున్నదేమంటే, తల్లిదండ్రుల డీఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటు వారి ఇరు కుటుంబాల తాతముత్తాతల, అమ్మమ్మల, వారి వెనుక తరాల మెదడు జన్యుశక్తితో పాటు వారి అనుభవాల సమూలశక్తి, క్రియాశీల శక్తి, భావ ప్రకటనా శక్తిని ఇప్పుడు పుడుతున్న పిల్లల మెదళ్లు సంక్ర మించుకుంటాయి. ఈ సంక్రమణ వాళ్ళ కుటుంబాలలోని చాలా తరాల నుండి పిల్లలకు వస్తుందట. భారతదేశంలో ఒకే కులం పెళ్ళిళ్లు, ఆయా కులాల తరతరాల ఏక వృత్తి వల్ల ఎన్ని వేల ఏండ్లు మన మెదళ్ళు బంధించబడ్డాయో మన సోషల్ సైన్సు అధ్యయనం చెయ్యలేదు. అసలు కులం, కుల వృత్తులపై ఈ మధ్యనే కొద్దిపాటి చర్చ మొదలైంది. ఏక కుల పెళ్ళిళ్లు ఎదుగుదల లేని, రోగభరిత సంతానాన్ని అందిస్తాయని కొద్దిగా చర్చ జరుగుతోంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న జంటల సభలో ఈ మధ్యనే మాట్లాడుతూ జస్టిస్ రాధారాణి గారు మనం మనుషులుగా బతకడం లేదు, కులాలుగా బతుకు తున్నామన్నారు. అదీ 21 శతాబ్దంలో. అయితే అసలే చర్చకు రాని సమస్య ఏమంటే, మెదడు క్రియాశీల శక్తిని ఒకే కుల వృత్తికి పరిమితి చేసినందువల్ల ఈ తల్లిదండ్రుల సంతానాల మెదళ్ళు పరిమిత అనుభవ, ఆలోచన, క్రియాశీల, కమ్యూనికేషన్ శక్తిని మాత్రమే సొంతం చేసుకోవడం.ఉదాహరణకు నా కుల కుటుంబ వృత్తినే చూస్తే, నా తల్లిదండ్రుల, అమ్మమ్మ, తాతముత్తాతల కుల జన్యు పరిమితి, వారి ఏకవృత్తి అయిన గొర్రెల కాపరి అనుభవ జ్ఞానం మాత్రమే నా మెదడుకు అందింది. అది ఎన్ని రకాల శక్తిని బంధించిందో తెలియదు. నా ముందు తరాల నిరక్షరాస్యత నా క్రియేటివ్, కమ్యూనికేషన్ శక్తులను ఎంత బంధించిందో తెలియదు. ఒకవేళ నా తల్లి గొర్రెల కాపరి కుటుంబం, తండ్రి వడ్రంగి కుటుంబం నుండి వచ్చి ఉంటే నా మెదడు ఎలా పని చేసేదో తెలియదు. ఇదే అంశం ఒక బ్రాహ్మణ మంత్ర పఠన కుటుంబానికీ, చెప్పులు చేసే మాదిగ కుటుంబానికీ వర్తిస్తుంది. ఈ ప్రక్రియ రుగ్వేద కాలం నుండి మొదలైందని మనకు ఆ అధ్యయనం చెబుతుంది.ఒక కుటుంబంలో వివిధ వృత్తులుంటే...ఈ క్రమంలో మన దేశంలోని మానవ మెదళ్ల చిప్ లాక్ చెయ్యబడిందని నా అభిప్రాయం. దీనిపై చాలా అధ్యయనం జర గాలి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి, ఈ మధ్య చనిపోయిన జిమ్మీ కార్టర్ ఆత్మ కథ ‘ఎ ఫుల్ లైఫ్’ చదివాను. ఆయన తండ్రి వేరుశనక్కాయ బాగా పండించే రైతు, ఇండ్లు కట్టే వడ్రంగి, చెప్పులు చేసే మోచి, ఇంట్లో అన్నీ బాగుచేసే ప్లంబర్, మంచి వ్యాపారి. ఆయన తల్లి నర్సు, మంచి వంట పనివంతురాలు, చేను పనుల్లో దిట్ట. వారి వెనుక తరాలు ఎన్ని రకాల పనులు చేశారో ఆయన రాయలేదు. కానీ వారి పిల్లలు, ముఖ్యంగా జిమ్మీ కార్టర్ విభిన్న మానసిక, శారీరక శక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన అతి చిన్న వయస్సు నుండే వేరుశనగ పంట పని చైతన్యమంతా మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అయ్యాడు. అన్నిటినీ మించి తన 95వ సంవత్సరం వరకు తాను పెట్టిన స్వచ్ఛంద సంస్థ ‘హబిటాట్ ఫర్ హ్యుమానిటీ’ తరఫున కార్పెంటర్‌గా ఎన్నో దేశాల్లో వేలాది ఇండ్లు కట్టించాడు. స్వయంగా 400కు పైగా ఇండ్లు కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశాడు. 95వ ఏటి వరకు తన ఇంటి సమీపంలోని స్కూళ్లలో పాఠాలు చెప్పేవాడు. గొప్ప ఉపన్యాసకుడు. వీట న్నిటితోపాటు, జార్జియా స్టేట్ గవర్నర్. ఆ తరువాత అమెరికా 39వ అధ్యక్షుడు. ఆ మెదడు బలంతో క్యాన్సర్‌ను గెలిచి 100 సంవత్సరాలు బతికాడు. మానవ మెదడు చిప్ లాక్ చెయ్యబడి ఉండకపోతే ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యగలడో జిమ్మీ కార్టర్ నిరూపించాడు.కృత్రిమ మేధ ప్రపంచంలో...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని ఏం చెయ్య బోతున్నదోనని చాలా చర్చ జరుగుతోంది. చాలా పనులు ఏఐ తప్పులు జరక్కుండా మనిషిని మించి చెయ్యగలదు. కనుక మును ముందు మానవులకు పని మాయమై, క్రమంగా మానవాళి జీవనమే ఆగిపోతుందా అనేది సమస్య. ఇజ్రాయెల్‌కు చెందిన యువల్ నోవా హరారీ పదేపదే ఈ విషయమే చెబుతున్నాడు. ఐతే మానవ మెదడుకు ఉన్న కొత్త ఆలోచన సృష్టి ఏఐకి ఉండదు. ఇప్పటివరకు ప్రపంచంలో సృష్టించబడ్డ ఆలోచనలను క్రోఢీకరించి ప్రపంచంలో ఏ మూలన జీవిస్తున్న వారికైనా అది అందిస్తుంది. కానీ కొత్త క్రియాశీల ఆలోచనలు, అంచనాలను మానవ మెదడు మాత్రమే చెయ్యగలదు. ఐతే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కుల–ఏకవృత్తి పెళ్ళిళ్ల వల్ల తరాలు, తరాలు లాక్ చెయ్యబడ్డ మెదళ్ళతో పుట్టాం.అందుకే అతి చిన్న దేశంలోని ఇజ్రాయెలీలు సృష్టించగలిగిన కొత్త ఆలోచనలు మన దేశంలోని మనుషులు చెయ్యలేకపోతున్నారు. మత మూఢ నమ్మకాలు తర తరాల మెదళ్ళను క్రియేటివ్ ఆలోచనలోకి పోనియ్యక పోవడం కూడా మరో ప్రతిబంధకం. ఇది మన దేశంలో జరిగింది. ఇతర దేశాల్లో కూడా జరిగింది. ముస్లిం దేశాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది.వేల ఏండ్లు మెదడు చిప్ లాకై ఉన్నప్పుడు అలా ఉన్నదని సమాజం కనుక్కోడానికే చాలా కాలం పడుతుంది. దళితులు, ఆది వాసులు, శూద్రులు, స్త్రీలలో చదువుకునే అవకాశం లేనప్పుడు ఇంత పెద్ద మానవ జెనెటిక్ సైన్సు సమస్య ఉన్నదని గుర్తించడం, దానికి పరిష్కారం వెతుక్కోవడం, దాన్ని కులాల చేత, మతాల చేత ఒప్పించడం చాలా పెద్ద సమస్య. మన దేశంలో ఈ విధమైన సమస్యను లాబరేటరీకి, సోషల్ సైన్సు పాఠాల్లోకి తీసుకుపోవడం చాలా కష్టం. అయితే ఇతర దేశాల్లోని ప్రయోగాలు, అన్ని రంగాల్లో రచనలు, వీడియో చర్చలు బయటికి వస్తున్న నేపథ్యంలో మన దేశంలో కూడా ఆ సామాజిక వ్యాధిని కనుక్కోకపోయినా, దానికి పరిష్కారాలు వెతక్కపోయినా, మనం ఇతర దేశాలకు మానసిక బానిసలవ్వడం తప్పుదు. ఇప్పటికి జరిగింది అదే. ఇక ముందు కూడా జరుగుతుంది. కేవలం మనల్ని మనం జాతీయవాద పొగడ్తల్లో ముంచెత్తుకుంటే మనం ఉపయోగించాల్సిన మెదడు అలాగే లాక్ వెయ్యబడి ఉంటుంది. సమాజం ముందుకు కొత్త ఆలోచన తేగానే కేసులు, దాడులు మామూలయ్యే కుల–మత విలువల్లో అది మరింత నిజం.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబ సభ్యులు అయినా కూడా జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తండ్రి అభీష్టానికి విరుద్ధంగా తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్న ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, ప్రాణభయంతో తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. -
మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్
Nazriya Nazim Says Ante Sundaraniki Story Is Unique: ‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రకథానాయిక నజ్రియా నజీమ్ మాట్లాడుతూ– ‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా నా కెరీర్ మొదలుపెట్టాను. టీవీలో పని చేశాను. రెండేళ్లు వరుసగా సినిమాలు చేశాను. ఆ తర్వాత ఫాహద్ ఫాజిల్ (మలయాళ హీరో)ని పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ‘అంటే.. సుందరానికీ’ కథ ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో రీ ఎంట్రీ ఇచ్చాను. ఇందులో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. చదవండి: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘అంటే.. సుందరానికీ’కి మొదట నేను సైన్ చేశాను. తర్వాత ఈ సంస్థలో ఫాహద్‌కి ‘పుష్ప’ అవకాశం వచ్చింది. ఈ రెండూ గొప్ప కథలు కావడం మా అదృష్టం’’ అన్నారు. కులాంతరం, మతాంతర వివాహాల గురించి మాట్లాడుతూ – ‘‘కులం, మతం.. వీటన్నింటికంటే ప్రేమ గొప్పది. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా ఉంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య ఉండకూడదని కోరుకుంటున్నాను’’ అన్నారు నజ్రియా. -
ప్రేమ వివాహం చేసుకున్నాడు.. బలవంతంగా సూసైడ్‌నోట్ రాయించి..
పానిపట్: హర్యానా రాష్ట్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మమత, వికాస్ నగర్‌కు చెందిన నీరజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అది అతనికి రెండో పెళ్లి. వీరికులాలు వేరుకావడంతో ఈ కులాంతర వివాహానికి నీరజ్ కుటుంబం అంగీకరించకపోవడంతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఐతే ఏమైందో తెలియదు కొంతకాలానికి బాధితురాలి భర్త కుటుంబసభ్యులతో కలిసి తరచూ వేధించేవాడు. కుల దూషణలకు కూడా పాల్పడేవారు. ఇది నిరంతరం కొనసాగినా ఆమె దానిని సహిస్తూ వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రోజు తన భర్త తనకు నీళ్లలో మత్తు మందు కలిపి తాగించి, బలవంతంగా సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత భార్య మమతకు ఉరివేసి, అక్కడినుంచి పారిపోయాడు నీరజ్. కుటుంబ సభ్యులు గమనించి మమతను కిందికి దించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు ఆస్పత్రిలో ఆమె జీవన్మరణ పోరాటం చేసింది. చివరికి ఆమె ప్రాణం రక్షించబడినప్పటికీ, ప్రస్తుతం మంచానికే పరిమితమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 307, 328 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని చాందినీ బాగ్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి మంజిత్ సింగ్ తెలిపారు. మరోవైపు, మమతకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గౌరవ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతుందని, ఐతే లేచి నడవలేక ఇబ్బంది పడుతుందన్నాడు. కాగా తాజాగా వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు.. -
‘మమ్మల్ని వెలివేశారు.. న్యాయం చేయండి’
నిజాంపేట(మెదక్): ‘మేము వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని కులం నుంచి వేలివేశారు. మాకు న్యాయం చేయాలని మండల పరిధిలోని రజాక్‌పల్లి గ్రామానికి చెందిన చిందం రాములు సోమవారం విలేకరులతో మొరపెట్టుకున్నాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. 30 ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన వేరే కులం అమ్మాయి అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం నా కుమారుడు వేణు సైతం నా భార్య అన్న కూతురు మమతను ప్రేమించి జనవరి ఒకటిన వివాహం చేసుకున్నాడు. ఇలా వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నందుకు మమ్మల్ని మా కులం వారే ఏ కార్యక్రమానికి పిలవడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని పంచాయతీ పెడితే మేము మీ ఇంటికి రాము.. మీరు మా ఇంటికి రావొద్దని తేల్చి చెప్పారు’ అని తెలిపాడు. ‘రెండు, మూడు రోజుల క్రితం మా అక్క తరఫున బంధువు మరణిస్తే మమ్మల్ని, మా అక్క, భావలను కూడా అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా మా కులంలో నుంచి ఎవరైనా మా ఇంటికి వస్తే వారికి రూ.లక్ష జరిమానా విధిస్తామని మాట్లాడుకున్నట్లు తెలిసింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు మమ్మల్ని వేలివేస్తారా? మాకు న్యాయం చేయాలని’ మీడియాతో వారు తమ బాధను వెలిబుచ్చారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని తెలిపాడు. -
చావు కోరిన ప్రేమ
దౌల్తాబాద్: లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో వీడలేనంత దగ్గరయ్యాయి. పెద్దలు వద్దని వారించినా వినకుండా పెళ్లి చేసుకున్నారు. కాపురం సవ్యంగా సాగుతున్న సమయంలో చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి. అయితే భార్య శుక్రవారం తెల్లవారజామున ఇంట్లో అనుమానస్పదంగా మృతిచెంది ఉంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.... మండలంలో యాంకి గ్రామానికి చెందిన నర్సింగమ్మ(25)ను అదే గ్రామానికి చెందిన మాణిక్యప్ప పదేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో ఆ వివాహాన్ని వద్దని పెద్దలు వారించారు. అయినా వారి మాట వినకండా పెళ్లి చేసుకున్న వారు ఒక్కటయ్యారు. అనంతరం వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. గ్రామంలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్‌లో కూలీపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగునెలల కింద గ్రామానికి వచ్చారు. మృతురాలు నర్సింగమ్మ దళిత మహిళ కావడంతో పాటు సంతానం లేకపోవడంతో భర్త మాణిక్యప్ప తరచూ వేధిస్తుండేవాడు. మరో వివాహం చేసుకుంటానని భర్త వేధించడంతో నర్సింగమ్మ మనస్తాపం చెందేది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎప్పటిలాగే ఇద్దరూ భోజనం చేసి నిద్రించారు. తెల్లారేసరికి నర్సింగమ్మ ఇంట్లో ఓ గదిలో విగతజీవిగా పడి ఉంది. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు వచ్చి శవాన్ని పరిశీలించగా నోట్లో నుంచి నురుగు రావడం, మెడపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో భర్తే హత్య చేశాడంటూ సుమారు గంటసేపు శవాన్ని ఇంట్లో ఉంచి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వర్రావు, ఎస్ఐ విశ్వజాన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా మృతురాలి కుటుంబసభ్యులు వినకపోవడంతో సీఐ నాగేశ్వర్రావు కేసును పూర్తిస్థాయిలో విచారించి నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిగి డీఎస్పీ పరిశీలించారు. మృతురాలి అన్న మాలశీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ చిచ్చు.. కిడ్నాప్, చిత్రహింసలు!
ఓ జంట కులాంతర ప్రేమ వివాహం ఇరు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపింది. ప్రియురాలి కుటుంబం ప్రియుడి మీద కనెర్ర జేసింది. ప్రియుడితో పాటు అతడికి సహకరించిన ఓ రాజకీయ పార్టీ నాయకుడ్ని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురిచేసింది. సినీ తరహాలో సాగిన ఈ పరిణామాల సమాచారంతో పోలీసులు సకాలంలో స్పందించారు. ఇద్దర్ని రక్షించారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్నాయి. పెద్దల పరువుకు, కుల చిచ్చుకు ఇప్పటి వరకు వంద మంది వరకు పరువు హత్యలకు గురైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని వెలుగులోకి రాగా, మరికొన్ని చాపకింద నీరులా చతికిలపడిపోయాయి. ఈ పరువు హత్యలను మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టుగా భరోసా ఇచ్చి ఉంది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చే రీతిలో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించింది. ఇందుకుగాను ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఆదేశాల్ని ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో సేలంలో సోమవారం రాత్రి జరిగిన ఓ కులాంతర వివాహం ఇరు సామాజిక వర్గాల మధ్య చిచ్చురేపింది. పోలీసులు సకాలంలో స్పందించడం వివాదం స్థానికంగానే పరిమితమైంది. ప్రేమ వివాహం... ఈరోడ్ జిల్లా భవానికి చెందిన సెల్వం, ఇలమది వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు. ఈ ఇద్దరూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరి పరిచయం ప్రేమకు దారితీసింది. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చిన ఈ జంట కులాంతర వివాహానికి సిద్ధమైంది. సేలం మేట్టురు సమీపంలో సోమవారం సెల్వం, ఇలమదికి ద్రావిడ విడుదలై ఇయక్కం స్థానిక నాయకుడు ఈశ్వరన్ సమక్షంలో కులాంతర వివాహం జరిగింది. వివాహం ముగియడంతో ఎవరికి వారు తమ ఇళ్లకు వెళ్లారు. రాత్రి సమయంలో సినీ తరహాలో కార్లు వచ్చి ఈశ్వరన్ ఇంటి ముందు ఆగాయి. వచ్చీ రాగానే, పదుల సంఖ్యలో వ్యక్తులు ఆయన మీద దాడి చేశారు. అనంతరం అతడిని కిడ్నాప్ చేశారు. అక్కడి సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొత్త జంట వీరి నుంచి తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించేందుకు మోటారు సైకిల్ మీద ఉరకలు తీసింది. సినీ తరహాలో ఆ జంటను ఛేజింగ్ చేసిన ఆ ముఠా, వారిని కూడా కిడ్నాప్ చేసింది. అస్సలు ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ ఓ వైపు పెరగడంతో పెరియార్ ద్రావిడర్ ఇయక్కం వర్గాలు కొళత్తూరు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కరుంగళ్లు వద్ద ఓ కారును పట్టుకున్నారు. అందులో ఇలమది తండ్రి జగన్నాథన్ ఉండడంతో వివాదం ముదిరింది. కులాంతర వివాహం చేసుకున్న ఆ జంటను, ఈశ్వరన్‌ను జగన్నాథన్ కిడ్నాప్ చేసిన సమాచారంతో ఆ పరిసరాల్లో టెన్షన్ బయలు దేరింది. ఇరు సామాజిక వర్గాల మధ్య వివాదం రేగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరి రక్షింపు జగన్నాథన్ వద్ద జరిపిన విచారణతో మూడు వేర్వేరు కార్లలో వేర్వేరు మార్గాల్లో ఈశ్వరన్, ఇలమది, సెల్వన్‌ను తరలించినట్టు తేలింది. అర్ధరాత్రి వేళ పోలీసులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీ చేపట్టారు. చివరకు మంగళవారం వేకువ జామున ఈశ్వరన్, సెల్వంను రక్షించారు. ఆ ఇద్దర్నీ ప్రథమ చికిత్స అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి రక్షణ కల్పించారు. ఇలమది సమాచారం తెలియక పోవడంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమెను ఎక్కడికి తరలించారో అన్న విషయాన్ని జగన్నాథన్ చెప్పక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తన భార్యకు ప్రాణహాని ఉందని, ఆమెను రక్షించాలని సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈశ్వరన్ పార్టీ వర్గీయులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో ఈ వ్యవహారం ముదరకుండా చాకచక్యంగా వ్యవహరించి ఇలమదిని రక్షించేందుకు తగ్గట్టుగా ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. -
కులాంతర వివాహం చేసుకుంటే పండగే..
సాక్షి, మంచిర్యాల: సమాజంలో అంతరాలను తగ్గించేందుకు.. కులాంతర వివాహాలను ప్రో త్సహించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచింది. కులాంతర వివాహాలు ఈ రోజుల్లో సాధారణ అంశంగా మారగా.. ప్రోత్సాహకాన్ని ఐదు రెట్లు పెంచడంతో యువత వీటివైపు మొగ్గు చూపనుంది. ప్రేమ వివాహాలతోపాటు పెద్దలూ కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానుకను పెద్ద మొత్తంలో పెంచినట్లు తెలుస్తోంది. సమాజంలో కులాంతర వివాహాలపై అవగాహన పెరిగింది. ఈ వివాహాలు చేసుకున్న జంటలను ఆయా కుటుంబాలు తమలో కలుపుకుపోతున్నాయి. ప్రభుత్వం కూడా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 31 నాటికి మొత్తం 13 మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు. వీరిలో ముగ్గురికి రూ.50 వేల చొప్పున రూ.1.50లక్షలను అందించారు. మిగిలిన వారికి బడ్జెట్ విడుదల కాగానే ఇవ్వనున్నారు. కేవలం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అంటే ఏడునెలల్లోనే 13మంది జిల్లాలో కులాంతర వివాహాలను చేసుకున్నట్లు, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ఐదురెట్లు పెంచడంతో.. ఈనెల ఒకటోతేదీ నుంచి కులాంతర వివాహాలను చేసుకున్న వారికి పెంచిన ప్రోత్సాహకాలు వర్తింపనున్నాయి. రూ.2.50 లక్షల ప్రోత్సాహకం జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణం అయ్యాయి. గతంలో ఒకే కులం అయితేనే పెళ్లి జరిపించేవారు. సంబంధాలు కలుపుకునేవారు. తమ కులానికి చెందిన వారినే పెళ్లి చేసుకోవాలనే పట్టింపులూ ఉండేవి. రానురాను ఆ పట్టింపులు తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. ఆయా కులాలు ఏవైనా సరే వారి అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే పెద్దలను ఒప్పించి కులాంతర వివాహాలను చేసుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకుంటే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం కులాంతర వివాహాలను చేసుకునే వారికి గత అక్టోబర్ నెల వరకు కేవలం రూ.50వేలను మాత్రమే ప్రోత్సాహకంగా అందించింది. కళ్యాణలక్ష్మి కంటే ఆ ప్రోత్సాహకం తక్కువగా ఉండడంతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు కళ్యాణలక్ష్మి పథకం వైపు మొగ్గు చూపారు. కులాంతర వివాహాలను పెద్దలు కూడా ఒప్పుకుంటుండడంతో ఆ పథకం కింద దరఖాస్తు చేసుకుని నగదు అందుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోని జంటలు మాత్రం ప్రభుత్వం అందించే రూ. 50 వేలతోనే సరిపెట్టుకుంటున్నాయి. ఆర్థికభారం పెరగడంతో ఆ జంటలు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. 2011లో ఈ మొత్తం రూ.10 వేలు ఉండగా.. 2012లో రూ.50 వేలకు పెంచగా.. ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెంచుతూ అక్టోబర్ 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ ప్రోత్సాహకాలు అమల్లోకి వచ్చాయి. ప్రోత్సాహకాలు ఇలా.. వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటే వారి వివాహానికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వారి పెళ్లి ఆధారాలను బట్టి అధికారులు విచారణ చేసి ప్రోత్సాహకాలకు అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. దరఖాస్తుకు అవసరమైనవి వివాహం చేసుకున్న జంట ఫొటోలు మూడు తహసీల్దార్ ధ్రువీకరించిన ఇద్దరి కులాల పత్రాలు వయసు ధ్రువీకరణకు విద్యాసంస్థలు ఇచ్చిన టీసీ, మార్కుల మెమో వివాహం చేయించిన అధికారి ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రం గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన ఫస్ట్‌మ్యారేజ్ సర్టిఫికేట్ వివాహం చేసుకున్న జంట కలిపి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు వివాహానికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధార్‌కార్డు రేషన్ కార్డు ఈ నెల నుంచే అమల్లోకి కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను రూ.50 వేల నుంచి రూ. 2.50 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం గత నెల 31న ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల ఒకటి నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఈ పెంపు వర్తిస్తుంది. దీనిపై యువతకు అవగాహన కల్పిస్తాం. -రవీందర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి -
అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ
సాక్షి, తిర్యాణి(ఆదిలాబాద్) : కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడలో పరువు దాడి చోటు చేసుకుంది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నాయకపుగూడకు చెందిన సత్యంచారికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు కావ్య అదే గ్రామానికి చెందిన నవీన్ గత కొద్ది ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నూతన దంపతులు మంచిర్యాల జిల్లాలోని సోమంగూడెంకు మకాం మార్చారు. దసరా సందర్భంగా నవీన్ వాళ్ల తల్లిదండ్రులు భార్యభర్తలిద్దరిని నాయకపుగూడకు తీసుకొచ్చారు. కూతురు గ్రామంలోకి వచ్చిందని తెలుసుకున్న సత్యంచారి నవీన్‌పై కోపం పెంచుకున్నాడు. అదను కోసం ఎదురుచూస్తున్న సత్యంచారి ఆదివారం అర్ధరాత్రి నవీన్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దీంతో నవీన్ చేతిపై, పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని ప్రతిఘటించి అరుపులు వేయడంతో పక్క గదిలో ఉన్న నవీన్ సోదరుడు కిరణ్ వచ్చాడు. కిరణ్ రాకను గమనించిన సత్యంచారి అక్కడి నుంచి పారిపోయాడు. నవీన్‌ను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు సత్యంచారిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామరావు తెలిపారు. -
ఉరికి వేలాడిన నవ వధువు..
కర్ణాటక, మండ్య: రెండు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మండ్య తాలూకా తిబ్బనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాచహళ్లి గ్రామానికి చెందిన అర్పిత (19) మృతురాలు. ఈమె అదే గ్రామానికి చెందిన యతిన్ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరని ఇరు కుటుంబాలు వివాహానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో మే 16వ తేదీన ప్రేమికులు దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అర్పిత తల్లిదండ్రులు ఆమెను ఇంటికి రానివ్వడం లేదు. ఈ తరుణంలో మంగళవారం రాత్రి యతిన్ ఇంట్లోనే అర్పిత ఉరేసుకొన్న స్థితిలో శవమైంది. యతిన్, అతని తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ అర్పిత తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
చంపేస్తారు; ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది!
లక్నో : మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న తర్వాతే పోలీసులు తమకు రక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చారని యూపీ బీజేపీ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా అన్నారు. దళితుడిని పెళ్లి చేసుకున్న కారణంగా తనను, తన భర్తను తండ్రి చంపేస్తాడంటూ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్త అజితేశ్‌తో కలిసి సోషల్ మీడియాలో ఆమె సెల్ఫీ వీడియో అప్లోడ్ చేశారు. తమకు సహాయం చేయాల్సిందిగా మీడియా, పోలీసులకు విఙ్ఞప్తి చేశారు. చదవండి : మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆయన.. దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు కూతురిపై కోపం లేదని, వాళ్లకు ఉద్యోగం లేకపోవడం వల్ల కష్టాలు పడాల్సి వస్తుంది కాబట్టే వివాహానికి అడ్డుచెప్పానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సాక్షి మిశ్రా మాట్లాడుతూ..‘ మా ఇంట్లో కుల వ్యవస్థ, ప్రేమపై ఉన్న అభిప్రాయం ఎలాంటిదో నాకు తెలుసు. ఒకవేళ నేను సొంత కులం వాడిని ప్రేమించినా వాళ్లు ఒప్పుకునే వాళ్లు కాదు. నా తల్లి, సోదరుడు నన్ను చిత్రహింసలకు గురిచేసేవారు. మా నాన్నకు ఇవేమీ తెలియదు. నన్ను, నా భర్తను చంపాలన్నదే ఆయన ధ్యేయం. భద్రత గురించి పోలీసులను ఆశ్రయించినా తన పలుకుబడితో మమ్మల్ని బెదిరించారు. అయితే మీడియాను ఆశ్రయించడం వల్ల ఎస్పీ మాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది’ అని పేర్కొన్నారు. సాక్షి భర్త అజితేశ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తమ ఎమ్మెల్యే రాజీవ్ మిశ్రాను పిలిచి ఈ విషయమై ఆయనకు కాస్త కౌన్సిలింగ్ ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. క్షమించమన్న కూతురు.. కాల్ కట్ చేసిన తండ్రి -
దారుణం : గర్భంతో ఉన్న భార్య కోసం వెళితే..
గుజరాత్లో అమానవీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్సీ / ఎస్టీ సెల్)మన్వర్ అందించిన వివరాల ప్రకారం దళిత యువకుడు హరేష్ సోలంకి (25) వర్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిలా బెన్ను కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ తమ కూతురు ఊర్మిలాబెన్ దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు సోలంకి. అయితే ఊర్మిలా గర్భం దాల్చడంతో మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని వారాల తరువాత ఆమెను తిరిగి పంపిస్తామని చెప్పారు. అయితే రెండు నెలలైనా భార్యను తన వద్దకు పంపించక పోవడంతో, తిరిగి పంపమని అత్తమామలను ఒప్పించటానికి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మహిళల హెల్ప్‌లైన ‘అభయం 181’ సహాయం కూడా తీసుకున్నాడు. ఆ అధికారుల సహాయంతో హెల్స్‌లైన్ వాహనంలో అత్తమామల ఇంటికి వెళ్లాడు. హెల్ప్‌లైన్ సిబ్బంది ఊర్మిలాబెన్ను పంపించేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వాహనంలో సోలంకి ఉన్నాడని తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పదునైన దారుణంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో హెల్ప్‌లైన్ వాహనం కూడా దెబ్బతిందన్నారు. ఈ సంఘటన తర్వాత నిందితులు తమ ఇంటి నుంచి పారిపోయారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అత్తమామలు సహా ఎనిమిది మందిపై హత్య, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు, ప్రభుత్వ అధికారికపై దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఎస్పీ ప్రకటించారు. -
దారుణం : గదిలో బంధించి, కిరోసిన్ పోసి నిప్పు
సాక్షి, ముంబై : మహరాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న యువ జంటపై స్వయంగా అమ్మాయి తరపు బంధువులే కిరోసిన్ పోసి నిప్పంటించారు. సంఘటన మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని నిగోజ్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మే 1వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగేష్ రాన్సింగ్(23),రుక్మిణి(19) కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చివరకు మంగేష్ తల్లిదండ్రుల సమక్షంలో గత అక్టోబరులో వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవలే మంగేష్‌తో రుక్మిణికి గొడవ జరిగింది. దీంతో ఆమె ఏప్రిల్ 30న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. రుక్మిణిని తీసుకెళ్లేందుకు మంగేష్ మే 1న అత్తగారింటికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన రుక్మిణి బంధువులు మంగేష్‌ను తీవ్రంగా చితకబాదారు. అనంతరం కన్నకూతురు అన్న కనికరం కూడా ఒక గదిలో బంధించి తాళం వేసి మరీ ఈ దంపతులపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే వీరి అరుపులను గమనించిన పొరుగువారు వారిని ఆసుపత్రికి తరలించారు. 50 శాతం త్రీవ గాయాలతో ప్రస్తుతం మంగేష్ శరీరం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ మృత్యువుతో పోరాడిన రుక్మిణి మాత్రం చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి బాధితుల వాంగ్మూలం ఆధారంగా రుక్మిణి తండ్రి రమా భర్టియా మరో ఇద్దరు బంధువులు సురేంద్ర భర్టియా, జ్ఞాన్‌శ్యామ్ సరోజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తండ్రి రమా భర్టియా పరారీలో ఉండగా, సురేంద్ర, జ్ఞాన్‌శ్యామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. -
కత్తి దొరక్కపోయి ఉంటే..
-
కూతుర్ని చంపి.. తానూ చావాలనుకున్నాడు!
సాక్షి, హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని.. కన్న కూతురినే కడతేర్చాలనుకున్నాడు.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇదీ బుధవా రం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో కన్న కూతురుపైనే కత్తితో దాడిచేసిన మనోహరాచారి ఆలోచన. కత్తి దాడి తర్వాత కూతురు మాధవి చనిపోయిందని భావించాడు. దీంతో రైలు కింద పడి చనిపోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని భార్య లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె ఎస్సార్‌నగర్ పోలీసులకు సమాచారం అందించింది. బుధవారం సాయంత్రం 3 గంటలు గాలించి మనోహరాచారిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడిని జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసులో మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మనోహరాచారి ఘా తుకానికి ఒడిగట్టడం వెనుక మిర్యాలగూడ దారుణం ప్రభావమున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరీక్ష కలిపింది ఇద్దరినీ.. మనోహరాచారి స్వస్థలం కర్నూలు జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆ జిల్లాలో కీలక ఫ్యాక్షన్ లీడర్ల వెనుక తిరిగి ఆర్థి కంగా చితికిపోయాడు. విశ్వబ్రాహ్మణ కులానికి చెం దిన వాడు కావడంతో ఆ వృత్తి చేసుకుని బతికేందుకు దాదాపు 20 ఏళ్ల కింద హైదరాబాద్‌కు వలసొచ్చాడు. ప్రస్తుతం అమీర్‌పేటలోని ఓ జ్యువెలరీ దుకా ణం బయట ఆభరణాలకు మెరుగుపెట్టే పని చేస్తున్నాడు. కుమారుడు ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుండగా, భార్య లక్ష్మి హైటెక్‌సిటీలో చిన్న ఉద్యో గం చేస్తోంది. ఆయన కుమార్తె మాధవి 2013లో మోతీనగర్‌లోని డాన్‌బాస్కో స్కూల్ పరీక్ష కేంద్రం లో పదో తరగతి పరీక్షలు రాసింది. అదే కేంద్రంలో సందీప్ పరీక్ష రాశాడు. వీరి నంబర్లు ముందు, వెనుక రావడంతో పరీక్షలు పూర్తయ్యేలోపు వీరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. మాధవాచారి కుటుంబం బోరబండ రాజ్‌నగర్ బస్తీలో, సందీప్ కుటుంబం ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌లో నివసిస్తోంది. ఆర్య సమాజ్‌లో పెళ్లి.. వీరి వివాహానికి సందీప్ కుటుంబం అంగీకరించినా మాధవి తరఫు వారు మాత్రం కుల పట్టింపుతో సమేమిరా అన్నారు. దీంతో వీరిద్దరూ గత బుధవారం మాధవి కుటుంబీకులకు తెలియకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా, ఇరువురూ మేజర్లు కావడంతో వారి కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి సందీప్‌తో మాధవిని పంపారు. ఆ సమయంలో సందీప్ ఏం చేస్తున్నాడని పోలీసులు ఆరా తీశారు. ఓ బిర్యానీ సెంటర్లో సూపర్వైజర్గా పని చేస్తూ నెలకు రూ.8 వేలు సంపాదిస్తున్నానని చెప్పాడు. తనను లెక్కచేయట్లేదని.. వారిద్దరూ సందీప్ ఇంట్లోనే ఉంటు న్నారు. గడిచిన వారం రోజుల్లో మనోహరాచారి సందీప్ ఇంటికి 3సార్లు వెళ్లాడు. అతడి తల్లిని అమ్మా అని సంబోధిస్తూ తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అయితే 4 రోజుల కింద జరిగిన ఓ ఘటనతో మనోహరాచారి మానసికంగా కుంగిపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో సందీప్ ఇంట్లో పంచాయితీ జరిగింది. ఆ సందర్భంగా ఓ దశలో నీ కుమార్తె వస్తే తీసుకెళ్లండంటూ సందీప్ మనో హరాచారితో అన్నాడు. తనతో రావాలని తండ్రి కోరగా.. తనకు భర్తే సర్వస్వమని, కులమతాలకు అతీతంగా తాము కలసి ఉంటామని మాధవి చెప్పింది. దీంతో మానసికంగా దెబ్బతిన్న మనోహరాచారి ఆ తర్వాత మూడుసార్లు ఫోన్ చేసినా కుమార్తె నుంచి స్పందన రాలేదు. దీంతో తనను ఎదిరించడమే కాకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆమెపై కక్షకట్టాడు. కూతురిని ఒంటరిగా రమ్మన్నాడు.. తీవ్ర మనస్తాపానికి గురైన మనోహరాచారి రెండు రోజులుగా ముభావంగా ఉండటంతో పాటు మితిమీరి మద్యం తాగుతున్నాడు. మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ హత్యోదంతాన్ని మీడియాలో చూసి ప్రభావితమయ్యాడు. తీవ్ర ఉద్రేకానికి గురై కుమార్తెను మట్టుపెట్టాలని భావించాడు. మాధవికి ఫోన్ చేసి దుస్తులు కొనేందుకు ఎర్రగడ్డ రావాలని కోరాడు. సందీప్ పనికి వెళ్లి ఉంటాడని, ఇద్దరూ కలసి రారనే భావించాడు. ఫోన్ చేశాక బైక్‌పై ఎస్సార్‌నగర్ వెళ్లి మద్యం కొనుకున్నాడు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఆ మద్యం తాగాడు. కత్తి దొరక్కపోయి ఉంటే.. మద్యం మత్తులోనే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైత్రీ వనం వైపు వస్తూ.. ఓ కొబ్బరిబొండాల దుకాణం వద్దకు చేరుకుని లోపలకు వెళ్లి కొద్ది సేపు ఆగాడు. విజయనగరం నుంచి వలస వచ్చిన దాని యజమాని మూత్ర విసర్జనకు వెళ్లగా అక్కడున్న కొబ్బరి బొండాలు నరికే కత్తిని దొంగిలించి తన బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై బయల్దేరాడు. ఈ దృశ్యాలు బొండాల దుకాణం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫీడ్‌ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాను గోకుల్ థియేటర్ వద్ద ఉన్నానంటూ కుమార్తె నుంచి మనోహరాచారికి ఫోన్ వచ్చింది. 3.30–3.45 గంటల మధ్య అక్కడకు చేరుకున్న మనోహరాచారి.. కుమార్తె వెంట సందీప్‌ను చూసి మొదట అతడిపై, ఆ తర్వాత మాధవిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కొబ్బరి బొండాల దుకాణంలో ఆ కత్తి దొరక్కపోయి ఉంటే కథ వేరేలా ఉండేదని పోలీసులు అంటున్నారు. రెండు మూడుసార్లు పథకం.. ఎంతో గారాబంగా పెంచిన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు తీవ్ర ఆగ్రహన్ని తెప్పించిందని మనోహరాచారి పేర్కొన్నాడు. మాధవిని మాత్రమే చంపాలని నిర్ణయించుకునట్లు చెప్పాడు. రెండు మూడు సార్లు పథకం వేసినా మాధవి, సందీప్ కలసి రావడంతో వదిలిపెట్టినట్లు తెలిపాడు. రద్దీ ప్రాంతానికి పిలిస్తే అనుమానం రాకుండా వస్తారనే భావనతో ఎర్రగడ్డకు పిలిపించానని మనోహరాచారి వివరించాడు. దాడి అనంతరం రోడ్డు దాటి ఆటోలో బల్కంపేట మీదుగా లాల్‌బంగ్లా వద్ద ఆటో దిగి మక్తాలోకి వెళ్లానని చెప్పాడు. భయం భయంగా.. హత్యాయత్నానికి పాల్పడ్డ మనోహరాచారి భార్యా, కుమారుడు భయంతో గడుపుతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకూ భయపడుతున్నారు. బోరబండలో ఉన్న వారి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాతో మాట్లాడేందుకు సైతం వారు ధైర్యం చేయలేకపోతున్నారు. మాల కులంలో పుట్టడమే నేరమా: సందీప్ తల్లి రమాదేవి మాల కులంలో పుట్టడమే తప్పా. నా కొడుకు, మాధవి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను సొంత కూతురిలా చూసుకున్నాను. తమ పుట్టింటి కంటే ఇక్కడే బాగుందని చెప్పింది. కొడుకు, కోడలు జంట ఎంతో బాగుందనుకున్నాను. కానీ అంతలోనే ఈ దారుణం జరిగింది. నిలకడగా మాధవి పరిస్థితి.. కాగా, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వెంటిలేటర్ కూడా తొలగించారు. ఆమెకు ప్రాణాపాయమేమీ లేదని, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, కుల నిర్మూలన పోరాట సమితి, తదితర ప్రజా సంఘాల ప్రతినిధులు గురువారం యశోద ఆసుపత్రిలో మాధవిని పరామర్శించారు. నమ్మించి దాడి చేశాడు: సందీప్ తమ వివాహన్ని మాధవి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే తాము ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నామని సందీప్ తెలిపాడు. గురువారం ఆస్పత్రి నుంచి సందీప్ డిచ్చార్జి అయ్యాడు. 2015లో తమ ప్రేమ విషయం మాధవి ఇంట్లో తెలిసి తల్లి లక్ష్మి, సోదరుడు వచ్చి బెదిరించి వెళ్లారని చెప్పాడు. తమ పెళ్లయ్యాక పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన సందర్భంగా మాధవి కోసం దాచిన రూ.5 లక్షలు ఇస్తానని మనోహరాచారి చెప్పినట్లు తెలిపాడు. వివాహ విందుకు దుస్తులు ఇప్పిస్తానని నమ్మించి దాడి చేశాడని చెప్పాడు. ఎప్పటికైనా తనను, తన భార్యను చంపేస్తాడేమోనని భయంగా ఉందని, తమ కుటుంబానికి భద్రత కావాలని కోరాడు. చనిపోయిందనుకుని.. రక్తపు మడుగులో పడిఉన్న మాధవిని చూసి చనిపోయిందని భావించి పారిపోయాడు. కొద్దిసేపటికే భార్య లక్ష్మికి ఫోన్ చేసి.. మాధవిని చంపేశానని, కుమారుడిని జాగ్రత్తగా చూసుకొమ్మని, తాను రైలు కింద పడి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో లక్ష్మి ఎస్సార్‌నగర్ పోలీసులకు చెప్పింది. సనత్‌నగర్ నుంచి లక్డీకాపూల్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌లపై 3 గంటల పాటు గాలించారు. చివరకు మక్తా వద్ద రైలు పట్టాల సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయానికి తరలించిన తర్వాతే అతడికి మాధవి బతికుందనే విషయం తెలిసింది. గురువారం ఉదయానికి మద్యం మత్తు దిగినాక కూడా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నా భార్యే కారణం: మనోహరచారి
సాక్షి, హైదరాబాద్: కూతురు, అల్లుడిపై పాశవికంగా దాడి చేసిన మనోహరచారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనబడటం లేదు. తనకు చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న అక్కసుతోనే దాడికి పాల్పడినట్టు చెప్పాడు. మనోహరచారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు గురువారం అతడిని నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. దాడి ఎందుకు చేశావన్న ప్రశ్నకు మనోహరచారి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. తన కూతురు మాధవిని చంపాలనుకున్నానని ఒకసారి, భయపెట్టాలనుకున్నానని మరోసారి చెప్పాడు. అసలు దీనంతటికి కారణం తన భార్య అని, ఆమెను చంపితే సరిపోయేదన్నాడు. అల్లుడు సందీప్ మంచోడేనని కితాబిచ్చాడు. ‘నాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకున్న నా బిడ్డను చంపాలనుకున్నా. ఒకమాట చెబితే నేనే పెళ్లి చేసేవాణ్ని. చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చూసుకున్నా. నాకు వచ్చిన డబ్బులన్నీ ఆమెకు ఇచ్చేవాణ్ని. కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటే నన్నే మోసం చేసి వెళ్లిపోయింది. బట్టలు కొనడానికి రమ్మని చెప్పలేదు. బయటకు రమ్మని చెప్పానంతే. భయపెట్టిద్దామనుకున్నా. మద్యం మత్తులో ఉండటం వల్ల దాడి చేశాను. ఆమె బతకాలి. తొందరపడి తప్పుచేశా. మాధవి ప్రేమ విషయం నా భార్యకు తెలుసు. ఆమె నాకు ఒక మాట చెప్పాలి కదా? సందీప్ కొంచెం మంచోడే. అంకుల్ అని నన్ను పిలిచేవాడ’ని మనోహరచారి పేర్కొన్నాడు. -
హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లింను చితకబాదారు..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకున్న ఓ ముస్లిం యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కనికరం లేకుండా దాడి చేశారు. ఆ తర్వాత అతడిని ఈడ్చుకెళ్లి రోడ్డుపై ఊరేగించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడు(ముస్లిం), ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి(హిందూ) వృత్తి రీత్యా నోయిడాలో స్థిరపడ్డారు. ఒకే కంపెనీలో పని చేస్తున్న ఇరువురి మధ్య ప్రేమ చిగురించడంతో వివాహ బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఘజియాబాద్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలను తెలసుకునేందుకు న్యాయవాదితో చర్చిస్తుండగా లాయర్ చాంబర్లోకి దూసుకెళ్లిన కొందరు వ్యక్తులు యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రేమ జంటతో పాటు దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ప్రేమికులు తాము మేజర్లమని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో పాటు ఆధారాలు చూపించడంతో వారిని వదిలిపెట్టారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ ఎస్పీ తెలిపారు. అయితే, దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు ప్రేమ జంట నిరాకరించింది. -
కులాంతరంవైపే యువతరం
భారతీయ యువతరంలో టెక్నాలజీ చైతన్యం నింపుతోందా? ఇందుకు అవుననే సమాధానమిస్తోంది ఢిల్లీ కేంద్రంగా ‘‘పల్స్ ఆఫ్ ద నేషన్’’పేరుతో జరిగిన తాజా అధ్యయనం. ఇన్‌షార్ట్స్ అనే న్యూస్ యాప్ ద్వారా జరిపిన ఈ సర్వేలో 18 నుంచి 35 ఏళ్లలోపు 1,30,000 మంది పాల్గొంటే అందులో 70 శాతం మంది కులాంతర వివాహాలకు సుముఖంగా ఉన్నట్టు తేలింది. అలాగే పెళ్లయ్యాక మహిళలు తమ ఇంటిపేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా 70 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. పెళ్లి ఖర్చులు వధువు తరఫు వారే భరించాలన్న సనాతన భావజాలానికి భిన్నంగా సర్వేలో పాల్గొన్న పురుషులు స్పందించారు. వారిలో 90 శాతం మంది పెళ్లి ఖర్చులను పంచుకుంటామని చెప్పడం భారతీయ యువతరంలో చైతన్యానికి ఉదాహరణగా సర్వే సంస్థ అభిప్రాయపడింది. దాదాపు 84 శాతం మంది మహిళలు తమ భర్తలు తమకన్నా తక్కువ ఆదాయం ఉన్నా అదేం పట్టించుకోబోమని పేర్కొన్నారు. 7 శాతం మంది పురుషులు మాత్రం తమకన్నా తమ భార్యలకు ఎక్కువ ఆదాయం ఉండటం అభ్యంతరకరమన్నారు. పెళ్లిళ్లు, ఒకే కులం వారిని వివాహం చేసుకోవడం, భార్యలు నిర్వహించాల్సిన పాత్రలు, ఆస్తి హక్కు వంటి విషయాలపై భారతీయుల్లో కనిపించే సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా యువతరం స్పందించడం గమనార్హం. -
కులాంతర వివాహ ప్రోత్సాహకాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: కులాంతర వివాహ ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జ్ అధికారి ఎస్.లక్ష్మానాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న గిరిపుత్రిక కళ్యాణం, కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతి పథకాలను చంద్రన్న పెళ్లికానుక పథకంలోకి ప్రభుత్వం చేర్చిందన్నారు. ఏప్రిల్ 20కి ముందు గిరిపుత్రిక కళ్యాణ పథకానికి అన్లైన్ దరఖాస్తు చేసుకోని వారు ఈనెల 31 వరకు ఈపాస్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు -
కులాంతర వివాహం చేసుకున్నాడని..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు అతని కుటుంబాన్ని గ్రామ పెద్దలు తీవ్రంగా అవమానించారు. బులంద్హహర్కు చెందిన ఓ దళితుడు యువకుడు ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గ్రామ కట్టుబాట్లకి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నాడని, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతని తండ్రి చేత నేలపై ఉమ్మించి నోటితో నాకించారు. అంతటితో ఆగని గ్రామస్థులు అతని భార్యని, కుతుర్ని పంచాయతీలో నగ్నంగా నిలుచోపెట్టారు. తన కుమారుడు ముస్లిం యువతిని వివాహం చేసుకున్నందుకు తమను తీవ్రంగా అవమానించి గ్రామం నుంచి వెలివేశారని యువకుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితులకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ డెహత్ తెలిపారు. కాగా, గత ఏడాది బులంద్హహర్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గ్రామస్థుల చేతిలో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. -
ఆ ప్రేమజంటకు రక్షణ కల్పించండి : సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ/బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద ప్రేమకథ తెరపైకి వచ్చింది. అమ్మాయిది రాజకీయ నేపథ్య కుటుంబం కాగా, అబ్బాయి రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం వీరి ప్రేమకథ చర్చనీయాంశమైంది. బీజేపీకి చెందిన మాజీ మంత్రి కూతురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ప్రేమించుకున్నారు. అయితే వారి సామాజిక వర్గాలు వేరే కావడంతో అమ్మాయి తండ్రి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా తాను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమె గుల్బర్గా జిల్లా కోర్టును ఆశ్రయించారు. కానీ తన తండ్రికి ఉన్న పరపతి దృష్ట్యా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన ఆమె ఢిల్లీకి పారిపోయారు. సుప్రీం కోర్టును ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. చట్టబద్ధ వయస్సు వచ్చిన తర్వాత కుల, మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న దంపతుల జీవితంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవద్దని గత నెలలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత కేసులో వివాహం జరగలేదు కాబట్టి ప్రేమజంటకు రక్షణ కల్పించాలని కర్ణాటక పోలీసులను ఆదేశించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పేర్లు వెల్లడించడానికి నిరాకరించిన అమ్మాయి తరఫున ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. అమ్మాయి తండ్రి, సోదరుని నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కర్ణాటక అదనపు సాలిసిటర్ జనరల్‌కు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు సంబంధించి వచ్చే నెలలో విచారణ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అంశం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కులాంతర వివాహం చేసుకుందని....
బర్వాణి, మధ్యప్రదేశ్ : కూతురు కులాంతర వివాహం చేసుకోవడం ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. ఆమె చేసిన పని వల్ల తమ పరువు పోయిందని భావించిన వారు కన్నప్రేమను కూడా మర్చిపోయి రక్తం పంచుకుని పుట్టిన కూతురునే దారుణంగా హతమార్చారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖేతియాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి ఖేతియా పోలీసు స్టేషన్ ఎస్సై రాజేంద్ర ఇంగిల్ మాట్లాడుతూ ‘పట్టణానికి చెందిన సర్లా మాలి (24) సమీప గ్రామానికి చెందిన పంకజ్ ఇద్దరు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే సర్లా మాలి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. కారణం పంకజ్ వారి సామాజిక వర్గానికి చెందినవాడు కాడు. దాంతో సర్లా ఇంటి నుంచి వెళ్లిపోయి పంకజ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత పంకజ్ గ్రామంలోనే దంపతులు నివాసం ఉంటున్నారు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. దాంతో కన్న ప్రేమను కూడా మర్చిపోయి, కూతురుని చంపాలని నిర్ణయించుకుని పథకం రచించారు. దాని ప్రకారం సర్లా సోదరుడు ఆమె ఇంటికి వెళ్లి తల్లికి ఆరోగ్యం బాగాలేదని, తనతో ఇంటికి రావాలని సర్లాను కోరాడు. సర్లా అందుకు ఒప్పుకుని తల్లిని చూడ్డానికి సోదరునితో పాటు బుధవారం నాడు పుట్టింటికి వెళ్లింది. సర్లాను చంపాలని నిర్ణయించుకున్న కుటుంబ సభ్యులు చెరుకు కత్తిరించే పరికరాలతో ఆమెపై దాడి చేసి చంపేశారు’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సర్లా తండ్రి దేవిదాస్ కోలి(55)ను అదుపులోకి తీసుకున్నారు. సర్లా తల్లి తుల్సీబాయి(50), సోదరుడు హీరలాల్(25) పరారీలో ఉన్నారు. నిందుతుల మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద మర్డర్ కేసును నమోదు చేసుకొని, పారిపోయిన వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
వేములవాడలో దంపతుల దారుణ హత్య
-
నూతన దంపతుల దారుణ హత్య
సాక్షి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ ఘటనకు ప్రేమ వివాహమే కారణమని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే... వెంటకంపల్లికి చెందిన హరీష్ (23 ), రచన (21 ) నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే రచన మేనమామలు... నాగరాజు, శేఖర్, అశోక్ ... తమను కాదని ప్రేమ వివాహం చేసుకుందని ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. ఈరోజు సాయంత్రం దంపతులపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. అలాగే జంట వివాహానికి సహకరించిన వేములవాడ మండలం మారుపాకకు చెందినా మల్లేశంను సైతం చంపే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లేశంను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కులాంతర వివాహానికి పెద్దలు నో చెప్పారని!
బద్వేల్: వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బద్వేల్ మండలం అగ్రహారంలో ప్రేమజంట గురువారం వేకువజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు సుమతి మృతిచెందగా, ప్రియుడు బాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలం నుంచి ప్రేమించుకున్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, ప్రియురాలు సుమతి మృతిచెందగా, ప్రియుడు బాలు పరిస్థితి విషమంగా ఉంది. ప్రియుడు బాలును చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కలిసుందామంటూ తీసుకెళ్లి కత్తితో దాడి..
-
కలిసుందామంటూ తీసుకెళ్లి కత్తితో దాడి..
రంగారెడ్డి(షామీర్పేట): కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. వివరాలు..ఎల్బీనగర్లో బీఎన్ రెడ్డినగర్‌కు చెందిన కిరణ్ యాదవ్(23) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన దీపికా రెడ్డి అనే యువతిని ఇంట్లో తెలియకుండా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ సోమవారం సాయంత్రం సమయంలో యువతి బంధువులు కలిసి ఉందామని చెప్పి ఇంటికి తీసుకెళ్లే సమయంలో షామీర్పేటలోని కట్టమైసమ్మ రాజీవ్ రహదారి వద్ద యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్ ఛాతీపై , కాలిపై గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ కిరణ్ వారి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. యువకుడు ప్రస్తుతం ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.