
భర్తతో అర్పిత (ఫైల్)
కర్ణాటక, మండ్య: రెండు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి మండ్య తాలూకా తిబ్బనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాచహళ్లి గ్రామానికి చెందిన అర్పిత (19) మృతురాలు. ఈమె అదే గ్రామానికి చెందిన యతిన్ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరని ఇరు కుటుంబాలు వివాహానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో మే 16వ తేదీన ప్రేమికులు దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అర్పిత తల్లిదండ్రులు ఆమెను ఇంటికి రానివ్వడం లేదు. ఈ తరుణంలో మంగళవారం రాత్రి యతిన్ ఇంట్లోనే అర్పిత ఉరేసుకొన్న స్థితిలో శవమైంది. యతిన్, అతని తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ అర్పిత తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment