గుజరాత్‌లో అమానవీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది.
డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్సీ / ఎస్టీ సెల్)మన్వర్ అందించిన వివరాల ప్రకారం దళిత యువకుడు హరేష్ సోలంకి (25) వర్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిలా బెన్‌ను కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ తమ కూతురు ఊర్మిలాబెన్ దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు సోలంకి. అయితే ఊర్మిలా గర్భం దాల‍్చడంతో మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని వారాల తరువాత ఆమెను తిరిగి పంపిస్తామని చెప్పారు. అయితే రెండు నెలలైనా భార్యను తన వద్దకు పంపించక పోవడంతో, తిరిగి పంపమని అత్తమామలను ఒప్పించటానికి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మహిళల హెల్ప్‌లైన ‘అభయం 181’ సహాయం కూడా తీసుకున్నాడు. ఆ అధికారుల సహాయంతో హెల్స్‌లైన్ వాహనంలో అత్తమామల ఇంటికి వెళ్లాడు. హెల్ప్‌లైన్ సిబ్బంది ఊర్మిలాబెన్‌ను పంపించేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వాహనంలో సోలంకి ఉన్నాడని తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పదునైన దారుణంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో హెల్ప్‌లైన్ వాహనం కూడా దెబ్బతిందన్నారు. ఈ సంఘటన తర్వాత నిందితులు తమ ఇంటి నుంచి పారిపోయారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అత్తమామలు సహా ఎనిమిది మందిపై హత్య, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు, ప్రభుత్వ అధికారికపై దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఎస్పీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment