hacked to death
-
Chattisgarh: బీజేపీ నేత దారుణ హత్య
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేతను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మావోయిస్టులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జన్‌పడ్ పంచాయతీ సభ్యుడైన బీజేపీ నేత కట్ల తిరుపతి శుక్రవారం రాత్రి బీజాపూర్ జిల్లాలోని టోయనార్ గ్రామంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వెళుతుండగా కొందరు వ్యక్తులు పదునైన ఆయుధంతో అతడిని పొడిచి చంపారని బీజాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జితేంద్ర యాదవ్ తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు అక్కడ మృతి చెందినట్లు చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకి చెందిన నేత హత్యకు గురవడం గత సంవత్సర కాలంలో ఇది ఏడోసారి కావడం కలకలం రేపుతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారాయణ్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్‌దూబేను మావోయిస్టులు హత్య చేశారు. ఇదీ చదవండి.. జార్ఖండ్‌లో స్పెయిన్ యువతిపై దారుణం -
సంచలనం రేపిన యువతి హత్య: కేసు వెనక్కి తీసుకోలేదని వెంటాడి.. వేటాడి ..!
లక్నో: కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిందన్న అక్కసుతో అత్యాచార బాధితురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై (ఇపుడు 19ఏళ్ల యువతి) లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపిన ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కౌషంబి జిల్లాలోని దేర్హా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన కేసులో పవన్ నిందితుడు. బాధితురాలి (ఇపుడు హత్యకు గురైన) యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే అప్పటినుంచి కేసు వెనక్కి తీసుకోవాల్సిందిగా బాధిత కుటుంబాన్ని, యువతిని వేధిస్తూనే ఉన్నాడు.దీనికి వారు ససేమిరా అనడంతో మరింత కక్ష పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం బెయిల్‌పై వ చ్చిన పవన్ ఎలాగైనా ఆమెను హత మార్చాలని పథకం వేశాడు. సరిగ్గా ఇదే సమయానికి మరో హత్య కేసులో నిందితుడిగా జైలుకెళ్లిన అతని సోదరుడు అశోక్ నిషాద్ కూడా బయటి కొచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి వారిని బెదిరించి, కేసు క్లోజ్ చేయాలని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో పథకం ప్రకారం బాధిత యువతి పశువులను మేతకు తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా, ఆమెపై దాడి చేశారు. అతి దారుణంగా వెంటాడి, వేటాడి గొడ్డలితో నరికి చంపేశారు. దీంతో స్థానికులు సైతం భయాందోళనకు లోనయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు నిందితులను అరెస్టుకు బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు. थाना महेवाघाट के ढेरहा गांव मे एक ही बिरादरी के दो पक्षों के बीच में पुरानी रंजिश और मुकदमेबाजी को लेकर आपस में विवाद हुआ जिसमे एक पक्ष के लोगों द्वारा दूसरे पक्ष की 20 वर्षीय युवती की धारदार हथियार से हमला कर हत्या कर दी गई है। प्रकरण में पुलिस अधीक्षक कौशाम्बी द्वारा दी गई बाइट pic.twitter.com/ve8TBRw5jv — KAUSHAMBI POLICE (@kaushambipolice) November 21, 2023 యూపీలో నేరస్థులు రెచ్చిపోతున్నారని, వారికి ఎలాంటి చట్టాల పట్ల భయంగానీ, గౌరవంగానీ లేదంటూ యూపీ కాంగ్రెస్ మండిపడింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ చీకటి నగరానికి వెలుగెన్నడు ఇంతట అధ్వాన్న స్థితిలో ఆడపిల్లలు స్వేచ్ఛా వాయువులు ఎపుడు పీల్చుకో గలుగుతారు? అంటూ అందోళన వ్యక్తం చేసింది. कौशाम्बी में सरेआम दो दरिंदों ने युवती की कुल्हाड़ी से काटकर हत्या कर दी। इनमें से एक दरिंदा हत्या के मामले में अभी 2 दिन पहले ही जमानत पर बाहर आया था। तो दूसरा इसी मृतक युवती के रेप का आरोपी था। UP में दरिंदे इस कदर बेखौफ़ हैं कि उनके मन में किसी कानून का कोई भय नहीं। कोई… pic.twitter.com/P5eligfE6T — UP Congress (@INCUttarPradesh) November 21, 2023 ఇది ఇలా ఉంటే ఈ ఘటన యూపీలో మహిళలు, యువతుల భద్రతను మరోసారి చర్చకు తెచ్చింది. ఆడబిడ్డలకు రక్షణలేకుండాపోయిందని కాంగ్రెస్ మండిపింది. మహిళలను వేధించిన వారిపై యమ్‌రాజ్ ఖచ్చితమైన ప్రతీకారం తీర్చుకుంటాడని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరిక జారీ చేసిన రెండు నెలల తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. ఎన్సీఆర్బీ డేటా 2021 ప్రకారం యూపీలో మహిళలపై 56వేలకు పైగా నేరాలు నమోదు కాగా, వీటిల్లో అత్యాచారం, మర్డర్, యాసిడ్ దాడులు ఎక్కువగా ఉండటం గమనార్హం. -
నడిరోడ్డుపై హత్య.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
తిరువనంతపురం : కేరళలోని అటానీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. కత్తిలాంటి పదునైన ఆయుధాలతో ముగ్గురు వ్యక్తులు అతడిపై విరుచుకుపడి ఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి... ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని హత్య చేయడంతో అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇక ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని వినయ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడికి నేర చరిత్ర ఉందని.. గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు. -
మహిళ ప్రాణం తీసిన భూ తగాదా
సాక్షి, మిర్యాలగూడ: భూ తగాదాలతో ఓ మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణంలోని చైతన్యనగర్‌కు చెందిన మారెపల్లి అమృతారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి అన్నదమ్ములు. వీరి స్వస్థలం నారాయణపురం. వీరు 20 ఏళ్ల నుంచి మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో కొన్ని సంవత్సరాల నుంచి అమృతారెడ్డికి, వాసుదేవరెడ్డికి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి అతడి భార్య మంజులతో కలిసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో గురువారం ప్రొక్లెయిన్‌తో చెట్లు తొలగించారు. దాంతో అమృతారెడ్డి అతడి కుమారుడితో కలిసి అక్కడికి చేరుకొని భూమి విషయంలో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మారెపల్లి మంజుల, ఆమె భర్త వాసు దేవరెడ్డిపై అమృతారెడ్డి, అతడి కుమారుడు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో మంజుల తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన వాసుదేవరెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ రమేష్‌బాబు, మాడ్గులపల్లి ఎస్ఐ రావుల నాగరాజు ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మంజుల -
దారుణం : గర్భంతో ఉన్న భార్య కోసం వెళితే..
గుజరాత్లో అమానవీయ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గర్భవతిగా ఉన్న తన భార్యను తిరిగి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్సీ / ఎస్టీ సెల్)మన్వర్ అందించిన వివరాల ప్రకారం దళిత యువకుడు హరేష్ సోలంకి (25) వర్మోర్ గ్రామానికి చెందిన ఊర్మిలా బెన్ను కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ తమ కూతురు ఊర్మిలాబెన్ దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కచ్ జిల్లాలోని గాంధీధామ్‌లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు సోలంకి. అయితే ఊర్మిలా గర్భం దాల్చడంతో మాయమాటలు చెప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని వారాల తరువాత ఆమెను తిరిగి పంపిస్తామని చెప్పారు. అయితే రెండు నెలలైనా భార్యను తన వద్దకు పంపించక పోవడంతో, తిరిగి పంపమని అత్తమామలను ఒప్పించటానికి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మహిళల హెల్ప్‌లైన ‘అభయం 181’ సహాయం కూడా తీసుకున్నాడు. ఆ అధికారుల సహాయంతో హెల్స్‌లైన్ వాహనంలో అత్తమామల ఇంటికి వెళ్లాడు. హెల్ప్‌లైన్ సిబ్బంది ఊర్మిలాబెన్ను పంపించేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వాహనంలో సోలంకి ఉన్నాడని తెలుసుకున్న బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పదునైన దారుణంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో హెల్ప్‌లైన్ వాహనం కూడా దెబ్బతిందన్నారు. ఈ సంఘటన తర్వాత నిందితులు తమ ఇంటి నుంచి పారిపోయారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అత్తమామలు సహా ఎనిమిది మందిపై హత్య, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు, ప్రభుత్వ అధికారికపై దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఎస్పీ ప్రకటించారు. -
మహిళా టీవీ జర్నలిస్ట్ దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ లో సుబర్ణ నోది(32) అనే మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య కలకలం రేపింది. పాబ్నా నగరంలో తన ఇంటి వద్ద తెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హత్య చేశారు. స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం మోటార్ సైకిళ్లపై దాదాపు 10-12 మంది సాయుధులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చారు. అనంతరం కాలింగ్ బెల్ మోగించారు. ఆమె తలుపు తీయగానే ముందస్తు పథకం ప్రకారం పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇబ్నె మిజాన్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదనీ, విచారణ జరుగుతోందన్నారు.మరోవైపు పాబ్నాలోని పాత్రికేయులు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. హంతకులకు కఠినమైన శిక్ష విధించాలని పిలుపునిచ్చారు. కాగా సుబర్ణ నోది ఆనంద టీవీ ఛానల్లో న్యూస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. డైలీ జాగృతో బంగ్లా పత్రికకు జర్నలిస్టుగా కూడా సేవలందించారు. తొమ్మిదేళ్ల కూతురితో కలిసి జీవిస్తున్న ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
పండగపూటా.. నలుగురిని నరికి చంపేశారు!
దీపావళి పండుగ రోజున తమిళనాడు రాజధానిలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలలో నలుగురిని నరికి చంపేశారు. కన్నగి నగర్ ప్రాంతంలో పాత కక్షల కారణంగా జరిగిన ఘర్షణలో ముగ్గురిని నరికి చంపగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. వ్యాసర్పాడి జీవా రైల్వేస్టేషన్ సమీపంలో 29 ఏళ్ల రౌడీషీటర్‌ను అతడి ప్రత్యర్థులు నరికి చంపేశారు. కన్నగి నగర్ ప్రాంతంలో ఐదుగురు సభ్యులున్న గ్యాంగు.. నలుగురిపై దాడిచేసింది. పోలీసు స్టేషన్‌కు కేవలం అర కిలోమీటరు దూరంలోనే ఈ దాడి జరిగింది. ఇందులో కాలియా రాజ్ అలియాస్ రంజిత్ కుమార్, సెబాస్టియన్ అలియాస్ మిల్లర్, శక్తివేల్ అక్కడికక్కడే మరణించారు. వాళ్లందరూ కన్నగి నగర్‌కు చెందినవారే. ఇదే దాడిలో గాయపడిన సెంగోటియన్ అనే యువకుడు మాత్రం రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గంజాయి అమ్మే విషయంలో ఈ రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యలకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో జోబితా మణి అలియాస్ మణిమారన్, దాస్తా అలియాస్ తమిళ్ అరసన్, తిలానా అలియాస్ అరుపతరాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక వ్యాసర్పాడి ప్రాంతంలో జరిగిన గొడవలో బీవీ కాలనీకి చెందిన సి.పళని మరణించాడు. అదే ప్రాంతానికి చెందిన తొప్ప గణేశ్, అరివళగన్ అనే ఇద్దరు ఈ హత్యకు కుట్రపన్నారని పోలీసులు తెలిపారు. ఇది పాతకక్షలతో జరిగిన గొడవ అన్నారు. ఎవరో పిలిచారని చెప్పడంతో పళని రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగా, అతడిపై ప్రత్యర్థులు దాడిచేశారు. బీవీ కాలనీకి చెందిన ముత్తు బచ్చా హత్యకేసులో పళని నిందితుడు. 2014లో జరిగిన శరవణన్ అనే వ్యక్తి హత్యకేసులో కూడా ఇతడు అనుమానితుడు. -
వణుకుతున్న చెన్నై వాసులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి దారుణ హత్యాకాండను మరవకముందే మరో కిరాతకం చోటు చేసుకుంది. నందనం ప్రాంతంలో వేలు అనే రౌడీషీటర్ ను దుండగులు సోమవారం నరికి చంపారు. ప్రత్యర్థి గ్రూపు అతడిని హతమార్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నందనం ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. చెన్నైలో పేరుమోసిన రౌడీషీటర్ సీడీ మణి అనుచరులతో సహా 161 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్వాతి హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. నుంగంబాక్కమ్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. హంతకుడు నీలం రంగు చొక్క ధరించివున్నాడని, హత్య చేసిన తర్వాత రైల్వే పట్టాలు దాటి పారిపోయినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. -
వాలీబాల్ ఆడుతుంటే.. నరికి చంపేశాడు!
పశ్చిమబెంగాల్ రాజధానిలో అమ్మాయిల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. 30 మందితో కలిసి వాలీబాల్ ఆడుతున్న ఓ టీనేజి అమ్మాయిని ఓ యువకుడు మాంసం కత్తితో నరికి చంపేశాడు. సంగీతా ఐచ్ (14) స్థానిక స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె మంచి క్రీడాకారిణి. మర్నాడు మ్యాచ్ ఉందని 30 మంది అమ్మాయిలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా.. సుబ్రత సింఘ అనే యువకుడు ఆమె వద్దకు వచ్చి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆమె దాన్ని తిరస్కరించడంతో వెంటనే గొడ్డలితో నరికేశాడు. సంగీతను కాపాడేందుకు అక్కడే ఉన్న కోచ్ స్వపన్ దాస్ ప్రయత్నించారు. తాను కూర్చున్న కుర్చీ తీసుకుని దాంతోనే సుబ్రతను కొట్టాలని చూశారు. సంగీత అక్కడకు దగ్గర్లోనే ఉన్న తన ఇంటివైపు పారిపోవడం మొదలుపెట్టింది. ఈలోపే సుబ్రత ఆమెను పట్టుకుని, పలుమార్లు నరికేసి అక్కడి నుంచి పారిపోయాడు. సంగీత అక్కడే ఉండి ఉంటే అతడు ముందు తనను చంపడానికి వచ్చేవాడని, కానీ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వెంటబడి మరీ చంపేశాడని కోచ్ తెలిపారు. ఈ దారుణ హత్య చూసి.. ఆమెతోపాటు వాలీబాల్ ఆడుతున్న కొందరు అమ్మాయిలు కళ్లుతిరిగి పడిపోయారు. స్థానికులు కూడా సుబ్రతను పట్టుకునేందుకు భయపడ్డారు. సంగీత బాబాయ్ గోపాల్‌కు అక్కడకు దగ్గర్లోనే ఫుడ్ స్టాల్ ఉంది. విషయం తెలిసి వెంటనే వచ్చి, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్దామన్నా ఆటోవాళ్లు ఎవరూ రాలేదు. చివరకు ఒక ఆటో రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె మరణించింది. -
విద్యార్థులు దాడిలో ప్రిన్సిపల్ మృతి
ర్యాగింగ్ చేస్తూ జూనియర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యంలో కాలేజీ హస్టల్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రిన్సిపల్‌పై ముగ్గురు విద్యార్థులు కక్ష కట్టి దాడి చేసి హత్య చేశారు. ఆ ఘటన ట్యూటికారన్ జిల్లా వలనాడులోని జీసెస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సురేష్‌పై ముగ్గురు విద్యార్థులు కత్తులతో దాడి చేశారు. దాంతో కాలేజీ సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు. అయితే దాడి చేసిన విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు తెలపారు. ఇంజనీరింగ్ కాలేజ్ హస్టల్లో సహాచర విద్యార్థులతోపాటు జూనియర్లను వారు ర్యాగింగ్ చేస్తున్నారు. దాంతో ఆ ముగ్గురు విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో హస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని వారిని ప్రిన్సిపల్ ఆదేశించారు. దాంతో విద్యార్థులు కక్ష కట్టి ప్రిన్సిపల్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ట్యూటికారన్ జిల్లా ఎస్పీ దొరయై సందర్శించారు. అనంతరం స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు.