
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు అతని కుటుంబాన్ని గ్రామ పెద్దలు తీవ్రంగా అవమానించారు. బులంద్హహర్‌కు చెందిన ఓ దళితుడు యువకుడు ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గ్రామ కట్టుబాట్లకి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నాడని, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతని తండ్రి చేత నేలపై ఉమ్మించి నోటితో నాకించారు. అంతటితో ఆగని గ్రామస్థులు అతని భార్యని, కుతుర్ని పంచాయతీలో నగ్నంగా నిలుచోపెట్టారు.
తన కుమారుడు ముస్లిం యువతిని వివాహం చేసుకున్నందుకు తమను తీవ్రంగా అవమానించి గ్రామం నుంచి వెలివేశారని యువకుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితులకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ డెహత్ తెలిపారు. కాగా, గత ఏడాది బులంద్హహర్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గ్రామస్థుల చేతిలో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment