ప్రతీకాత్మకచిత్రం
పానిపట్: హర్యానా రాష్ట్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మమత, వికాస్ నగర్‌కు చెందిన నీరజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అది అతనికి రెండో పెళ్లి. వీరికులాలు వేరుకావడంతో ఈ కులాంతర వివాహానికి నీరజ్ కుటుంబం అంగీకరించకపోవడంతో భార్యాభర్తలిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఐతే ఏమైందో తెలియదు కొంతకాలానికి బాధితురాలి భర్త కుటుంబసభ్యులతో కలిసి తరచూ వేధించేవాడు. కుల దూషణలకు కూడా పాల్పడేవారు. ఇది నిరంతరం కొనసాగినా ఆమె దానిని సహిస్తూ వచ్చింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రోజు తన భర్త తనకు నీళ్లలో మత్తు మందు కలిపి తాగించి, బలవంతంగా సూసైడ్ నోట్ రాయించాడు. ఆ తర్వాత భార్య మమతకు ఉరివేసి, అక్కడినుంచి పారిపోయాడు నీరజ్. కుటుంబ సభ్యులు గమనించి మమతను కిందికి దించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 15 రోజుల పాటు ఆస్పత్రిలో ఆమె జీవన్మరణ పోరాటం చేసింది. చివరికి ఆమె ప్రాణం రక్షించబడినప్పటికీ, ప్రస్తుతం మంచానికే పరిమితమైంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్ 307, 328 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని చాందినీ బాగ్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి మంజిత్ సింగ్ తెలిపారు. మరోవైపు, మమతకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గౌరవ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతుందని, ఐతే లేచి నడవలేక ఇబ్బంది పడుతుందన్నాడు. కాగా తాజాగా వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
చదవండి: గాడిదపాలు తాగితే కరోనా తగ్గుతుంది! లీటరు రూ. 10వేలు..
Comments
Please login to add a commentAdd a comment