
కులాంతర వివాహానికి పెద్దలు నో చెప్పారని!
బద్వేల్: వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బద్వేల్ మండలం అగ్రహారంలో ప్రేమజంట గురువారం వేకువజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు సుమతి మృతిచెందగా, ప్రియుడు బాలు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
గత కొంత కాలం నుంచి ప్రేమించుకున్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా, ప్రియురాలు సుమతి మృతిచెందగా, ప్రియుడు బాలు పరిస్థితి విషమంగా ఉంది. ప్రియుడు బాలును చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.