భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు.. | Lovers Suicide Attempt Nizamabad District | Sakshi
Sakshi News home page

భార్య గర్భవతి.. మరో అమ్మాయితో టచ్‌లో భర్త.. చివరకు..

Published Fri, Aug 12 2022 5:19 PM | Last Updated on Fri, Aug 12 2022 5:28 PM

Lovers Suicide Attempt Nizamabad District - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కొన్ని సంబంధాలు పచ్చిన కాపురంలో చిచ్చు పెడతాయి. దీంతో, వారి కుటుంబాలు వీధిన పడటం, ఫ్యామిలీ సభ్యులు సమాజంలో తలెత్తుకోకుండా చేయడం వంటివి జరుగుతాయి. తాజాగా నిజామాబాద్‌లో ఓ వివాహితుడు.. మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, వారిద్దరూ కలిసి పురుగుల మందు సేవించి జంటగా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. బోధన్‌లోని భవానిపేటకు చెందిన రాజుకు ఇప్పటికే వివాహమైంది. రాజు భార్య ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. కాగా, రాజు.. అదే గ్రామానికి చెందిన మైనర్‌(17)తో కొంత కాలంగా స్నేహంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అనూహ్యంగా వారిద్దరూ గడ్డివాము వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. 

ఈ ‍క్రమంలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, వారిద్దరూ ఇంకా స్పృహాలోని రాకపోవడంతో ఏం జరిగిందనే విషయం పూర్తిగా తెలియడం లేదు. ఇక, వారి పేరెంట్స్‌ కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించడంతో అసలు విషయం బయటకు రాలేదు. మరోవైపు.. రాజు వివాహితుడు కావడం ఇలా అమ్మాయితో ఆత్మహత్యాయత్నం చేయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: నైట్‌ డ్యూటీ.. నమ్మించి నర్సుపై వైద్యుడి లైంగికదాడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement