Kerala Youth Self Immolates After Setting 16-Year-Old Girl in Fire, Both Die - Sakshi
Sakshi News home page

దారుణం: బర్త్‌ డే పేరుతో యువతిని ఇంటికి పిలిచి..

Published Sun, Apr 24 2022 5:15 PM | Last Updated on Sun, Apr 24 2022 6:20 PM

Lovers Hospitalized With Serious Burn Injuries At Palakkad - Sakshi

తిరువనంతపురం: దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోటు వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు బర్త్​డే సెలబ్రేషన్​ పేరుతో యువతిని ఇంటికి పిలిచి ఆమెకు నిప్పంటించి.. ఆ తర్వాత తానూ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. పాలక్కాడ్​ జిల్లాలోని కొల్లెంగోడ్​ గ్రామానికి చెందిన బాలసుబ్రమణియం(23) తన బర్త్​డే ఉందంటూ యువతిని తన ఇంటికి పిలిచాడు. దీంతో ఆదివారం ఉదయం ఆమె అతడి ఇంటికి వెళ్లింది. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి బాలసుబ్రమణియం.. యువతికి నిప్పంటించాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో వారి అరుపులు విన్న బాలసుబ్రమణియం తల్లి, తమ్ముడు మంటలను ఆర్పివేశారు. మంటల్లో వారికి తీవ్ర గాయాలు కాగా.. వైద్యం కోసం ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. చాలా కాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వారి ప్రేమను రెండు కుటుంబాలు నిరాకరించిన కారణంగానే బాలసుబ్రమణియం ఇలా చేశాడని స్థానికులు తెలిపారు. ఈ సందర్బంగా బాలసుబ్రమణియం తల్లి మాట్లాడుతూ.. ఈరోజు బాలసుబ్రమణియం పుట్టినరోజు సందర్భంగా ఆమె తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని అన్నారు. వారిద్దరికి పెళ్లి చేస్తామని చెప్పినప్పటికీ ఇలా ఎందుకు చేశాడో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది చదవండి: యువతికి గర్భం.. ఏప్రిల్‌ 8న వివాహానికి ఒప్పుకొని, తెల్లారేసరికి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement