
నందకిషోర్‌ను ఓదారుస్తున్న నాయిని
అబిడ్స్:ఫోన్ సంభాషణలో మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన ఇద్దరు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నందకిషోర్‌వ్యాస్ కుమారుడు, అతని సోదరుడి కుమారుడిపై కత్తులతో దాడి చేసి పారిపోయిన సంఘటన షాహినాయత్‌గంజ్‌పోలీస్‌ష్టేషన్ పరిధిలోని బేగంబజార్‌లో జరిగింది. వారికి ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నందకిషోర్‌వ్యాస్ కుమారుడు ప్రేమ్‌బిలాల్ వ్యాస్.
అతని సోదరుడు అమిత్‌వ్యాస్ స్నేహితుడు సోలంకీ... అమిత్‌వ్యాస్‌కు ఫోన్ చేయగా ప్రేమ్‌బిలాల్ ఎత్తాడు. అయితే సోలంకీ అసభ్య పదజాలంతో దూషించడంతో మాటామాటా పెరిగింది. ‘దమ్ముంటే బేగంపేట్‌కు రా’ అనడంతో ప్రేమ్, అమిత్, అశీష్, నవజ్యోత్‌సింగ్ అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న ఆకాష్, దీపక్ వీరిపై కత్తితో దాడి చేశారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని ఏసీపీ చెప్పారు. నందకిషోర్‌వ్యాస్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులుపరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment