తాగిన మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా.. | Brother Killed Elder Brother With Knife | Sakshi
Sakshi News home page

అన్నను చంపిన తమ్ముడు

Published Mon, Apr 2 2018 6:53 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Brother Killed Elder Brother With Knife - Sakshi

రక్తపు మడుగులో నరేష్‌ మృతదేహం

పొన్నెకల్లు(తాడికొండ): తాగిన మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా బూతులు తిడుతున్నాడని అన్నను తమ్ముడు కత్తిపీటతో నరికి చంపిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంపచోటి నరేష్‌ సెంట్రింగ్‌ పని చేస్తుంటాడు, ఆదివారం తాగి ఇంటిలో తల్లి అవ్వమ్మ, సోదరి ధనలక్ష్మిని బూతులు తిడుతుండటంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు నాగేశ్వరరావు కల్పించుకున్నాడు. మాటా మాట పెరగడంతో అన్నపై కత్తిపీటతో దాడిచేసి గుండె, గొంతుపై బలంగా నరకడంతో ఘటన స్థలంలోనే  నరేష్‌(26) మృతి చెందాడు.

హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళగిరి నార్త్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, ఎస్‌ఐ రాజశేఖర్‌లు పరిశీలించి,  స్థానికులను ఆరా తీశారు. మృతుడు నరేష్‌కు నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. భార్య రెండు నెలలు కాపురం చేసిన అనంతరం వెళ్లి పోయింది. సోదరుల మధ్యా తరచూ వివాదాలు జరుగుతుంటాయి. ఆదివారం అవి కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి తల్లి అవమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement