brother killed
-
భూవివాదంలో ఘోరానికి పాల్పడ్డ అన్న
క్రైమ్: అన్నదమ్ముల మధ్య భూ వివాదం ఘోరానికి దారి తీసింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని.. కోపంలో కసి తీరా ట్రాక్టర్‌తో తొక్కి చంపాడు ఓ వ్యక్తి. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘోరం జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ అన్నదమ్ములు. చాలా కాలంగా భరత్‌పూర్‌లోని ఉన్న కాస్త భూమి కోసం కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బహదూర్ కుటుంబం వివాదాస్పద స్థలంలోకి ట్రాక్టర్‌తో వచ్చింది. ఆ విషయం తెలిసి కాసేపటికే అతర్ సింగ్ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు కుటుంబాలు కర్రలతో పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో అతార్ సింగ్ కొడుకు నిర్పత్ కిందపడిపోగా.. అది గమనించిన బహదూర్ కొడుకు దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్ మీదుగా పోనిచ్చాడు. నిర్పత్ వరుసకు దామోదర్‌కు తమ్ముడు అవుతాడు. తమ్ముడిని ఏం చేయొద్దని అక్కడున్న కుటుంబ సభ్యులు బతిమాలుతున్నా.. దామోదర్ వెనక్కి తగ్గలేదు. నిర్పత్ మీద నుంచి ముందుకు వెనక్కి ట్రాక్టర్‌ను ఎక్కించి తొక్కించాడు. చనిపోయాడని నిర్ధారించుకునేదాకా దామోదర్ ఆ ఘోరాన్ని ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. వీడియో కోసం క్లిక్ చేయండి ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజుల క్రితమే ఈ రెండు కుటుంబాలు గొడవ పడ్డాయని.. ఆ ఘర్షణలో బహదూర్ సింగ్, ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనకు సంబంధించి అతర్ సింగ్ తో పాటు నిర్పత్‌పైనా కేసు నమోదు అయ్యింది. తుపాకీ మోత వినిపించిందని స్థానికులు చెబుతున్నప్పటికీ.. పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు ఈ ఘటన రాజకీయ విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రియాంక గాంధీని ఈ ఘటనలో జోక్యం చేసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. -
Crime News: భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ సొంత అన్నని..
బనశంకరి: అనుమానం పెనుభూతమైంది. సొంత అన్ననే కడతేర్చేందుకు వుసిగొల్పింది. కాళ్లు పట్టుకుని వేడుకున్నా తన భార్యతో సంబంధం కలిగి ఉన్నారనే అనుమానంతో సొంత అన్నను హత్య చేశాడు ఇక్కడ ఓ తమ్ముడు. ఈ ఘటన కర్ణాటక బెళగావి జిల్లా చిక్కోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. చిక్కోడి పట్టణంలో అక్బర్ షేక్ (36), అమ్జద్ షేక్ అన్నదమ్ములు. ఒకే అంతస్తులో వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారు. అయితే అక్బర్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం తమ్ముడైన అమ్జద్లో నెలకొంది. దీంతో పలుమార్లు అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి.. అలాంటిదేం లేదని తేల్చారు కూడా. కానీ.. అక్బర్ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం అమ్జద్లో నానాటికీ బలపడుతూ పోయింది. ఈ క్రమంలో.. అన్న అక్బర్‌ను లేకుండా చేయాలని అమ్జద్ పథకం రచించాడు. ఏకంగా ఓ కారు కొనుగోలు చేశాడు. శనివారం బైక్‌లో వెళ్తున్న అక్బర్‌ను కారుతో ఢీ కొట్టించాడు. యాక్సిడెంట్‌గా ఆ కేసు పోతుందని అనుకున్నాడు. అయితే యాక్సిడెంట్ చేసినా అక్బర్ చనిపోలేదని భావించి.. కారు దిగిన అమ్జద్ అక్బర్ వైపు వెళ్లాడు. తనకేం సంబంధం లేదని, వదిలేయాంటూ కాళ్లు పట్టుకున్నాడు అక్బర్. అయినా వినకుండా ఓ ఆయుధంతో అన్నను హతమార్చాడు. ఆపై నేరుగా చిక్కోడిపోలీస్స్టేషన్లో లొంగిపోయాడు అమ్జద్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం.. తమ్ముడిని నమ్మించి గ్రామ శివార్లలోకి తీసుకెళ్లి..
వైరా రూరల్ (ఖమ్మం జిల్లా): అన్న భార్య వదినతో సంబంధం పెట్టుకుని తమ్ముడు దిగజారిపోతే అతడిని గొడ్డలితో నరికి చంపి మనిషిగా మరింత దిగజారిపోయాడు ఓ అన్న. సోమవారం తెల్లవారుజామున ఖమ్మంజిల్లా వైరా మండలం రెబ్బవరంలో ఈ ఘటన జరిగింది. రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామారావు, రామకృష్ణ, నరేశ్(32) అన్నదమ్ములు. రామకృష్ణ కూలిపనులు చేస్తుండగా, దివ్యాంగుడైన నరేశ్ వాటర్‌ప్లాంట్‌లో గుమాస్తా. వీరిద్దరూ తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రామకృష్ణ మొదటి భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోయి రెండోపెళ్లి చేసుకున్నాడు. నరేశ్ భార్య రెండేళ్ల క్రితం వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం తన భార్యతో నరేశ్ సన్నితంగా ఉండటాన్ని చూసిన రామకృష్ణ ఆమెను మందలించాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని రాజమండ్రిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. నరేశ్‌తో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె తనను వదిలేసి పోయిందని కక్ష పెంచుకున్న రామకృష్ణ తమ్ముడిని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసుకున్నాడు. నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు... తల్లి సుబ్బమ్మ దీపావళి పండుగకు కూతురింటికి వెళ్లగా రామకృష్ణ తన తమ్ముడిని హత్య చేసేందుకు పథకం పన్ని ఆదివారంరాత్రి రెబ్బవరం శివార్లలోకి తీసుకెళ్లి మద్యం తాగించాడు. తర్వాత ఇద్దరూ ఇంటికెళ్లి భోజనం చేసి పడుకున్నారు. అనంతరం నిద్రలోకి జారుకున్న నరేశ్‌పై రామకృష్ణ గొడ్డలితో విచక్షణారహితంగా నరికివేశాడు. దీంతో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం విషయాన్ని మేనమామ చెరుకూరి లక్ష్మీనారాయణ, స్నేహితులకు రామకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు. వీరు పోలీసులకు సమాచారం అందిచడంతో అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, తన భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకే తమ్ముడిని హతమార్చినట్లు విచారణలో రామకృష్ణ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. -
ఆమెకు 5 నెలల క్రితమే పెళ్లి.. వావివరుసలు మరిచి వదినతో..
వివాహేతర సంబంధాలు కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. క్షణకాలం తప్పిదాల కోసం మానవ సంబంధాలను మరిచిపోయి కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు. అన్న భార్య అని కూడా చూడకుండా ఓ తమ్ముడు వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో, దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ధనంజయ్ (అలియాస్ పింటూ యాదవ్)కు ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. అనంతరం, ఇంట్లోనే వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో ధనంజయ్ తమ్ముడు శివ బహదూర్.. అన్న భార్యతో చనువు పెంచుకున్నాడు. కాగా, అప్పుడప్పుడు శివ.. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో అన్న పలుసార్లు మందలించాడు. ఇదిలా ఉండగా.. అన్న మాటలను మాత్రం తమ్ముడు పట్టించుకోలేదు. దీంతో, ఆగ్రహంతో రగిలిపోయిన అన్న.. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో తమ్ముడిని హత్య చేశాడు. ఈనెల 10న తన తమ్ముడు నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా తన భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే అనుమానంతో అతడిని అంతమొందించానని అంగీకరించాడు. -
భార్య మృతితో ఒంటరి జీవితం.. ఇంట్లో వదినతో మాటలు కలిపి..
చిల్లకూరు: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారుపాలు చేస్తున్నాయి. క్షణికావేశంలో చేసే తప్పులు దారుణాలకు ఒడిగడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తిరుపతిలో జరిగింది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న తమ్ముడిని అన్న కర్రతో కొట్టి హతమార్చిన సంఘటన చిల్లకూరు మండలం కాకువారిపాళెం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన అద్దెపల్లి బాలాజీ, ప్రతాప్(25) అన్నదమ్ములు. ఇద్దరికి వివాహాలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. 10 నెలల క్రితం ప్రతాప్ భార్య కాన్పు సమయంలో మృతి చెందింది. దీంతో బాలాజీ తన తమ్ముడు ప్రతాప్‌కు తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. అప్పటి నుంచి తన వదినతో చనువుగా ఉంటూ ఆమెతో అక్రమ సంభందం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ప్రతాప్, తన వదిన ఒకే దగ్గర ఉండడం చూసిన అన్న బాలాజీ కోపోద్రిక్తుడై ప్రతాప్‌పై కర్రతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ గోపాల్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇది కూడా చదవండి: రీల్స్ చేస్తూ నీళ్లలో పడి మృతి.. అమృత బతుకుతుందని ఉప్పుపాతర! -
ఘోరం: మటన్ కత్తితో తమ్ముడు, మరదలితో పాటు
లక్నో: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడి కుటుంబంపై రగిలిపోయాడు. వారిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని మటన్ కోసే కత్తి తీసుకుని వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించి తమ్ముడిని.. మరదలును వారి కుమారుడిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచేసి వారిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లాలో చోటుచేసుకుంది. కజియానాలో నౌషద్, జమీల్ సోదరులు. నౌషద్ మటన్ వ్యాపారి. సోదరుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి కుటుంబాన్ని నాశనం చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం నౌషద్ తాను ఉపయోగించే మటన్ కత్తిని తీసుకుని జమీల్ (42), అతడి భార్య రూబీ (38)పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం జాలి కూడా లేకుండా ఏడాది వయసున్న తమ్ముడి కుమారుడిని కూడా పాశవికంగా కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో వారు ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన వెంటనే నౌషద్ తన తల్లితో పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు. -
కారుతో ఢీ కొట్టి.. ఆపై గొడ్డలితో నరికి
నాగర్‌కర్నూల్: ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే కారుతో ఢీకొట్టి.. ఆపై గొడ్డలితో దారుణంగా నరికి చంపిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అనేఖాన్‌పల్లి తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్ హనుమంతు (40), బాదావత్ శంకర్ అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇదే క్రమంలో మంగళవారం మరోమారు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రాణాలైనా తీసేందుకు సిద్ధమని, ఆస్తి మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తమ్ముడు శంకర్ హెచ్చరించాడు. ‘నీ చేతనైన పని చేసుకో’ అని అన్న హనుమంతు బదులిచ్చాడు. దీంతో అన్నను ఎలాగైనా హతమార్చాలనుకున్న తమ్ముడు సమయం కోసం ఎదురుచూశాడు. బుధవారం హనుమంతు వ్యక్తిగత పనులపై వట్టెం గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు శంకర్ మార్గమధ్యలో బైక్‌ను కారుతో ఢీకొట్టాడు. దీంతో కిందపడిన అన్నను గొడ్డలితో తల, కాలిపై నరికి హతమార్చాడు. మృతుడికి భార్య యామిని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటనపై ఎస్ఐ వెంకటేష్‌ని వివరణ కోరగా.. హత్య జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: మహిళతో రెడ్ హ్యండెడ్‌గా దొరికాడు.. భార్య నగలన్నీ ఆమెకు -
ఆస్తి గొడవ.. అన్నను కొట్టి చంపిన తమ్ముడు
సాక్షి, నల్గొండ: భూమి తగాదాలతో సొంత తమ్ముడిపై హత్యకు పాల్పడ్డాడు ఓ అన్న. ఈ ఘటన జిల్లాలోని నాంపల్లి మండలంలోని బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిమీదిగూడెంలో చోటు చేసుకుంది. వివరాలు.. బొదాసు కృష్ణయ్య తన తమ్ముడు బొదాసు వెంకటయ్య (55)కు తొమ్మిదెకరాల భూమిని ఎనిమిదేళ్ల క్రితం అమ్ముకుని హైదరాబాద్‌కు వలసవెళ్లాడు. అయితే లాక్డౌన్ సమయంలో గ్రామానికి వచ్చిన కృష్ణయ్య తన తమ్ముడికి భూమిని అమ్మలేదని వాగ్వాదానికి దిగాడు. వీరి ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. కాగా వెంకటయ్య కుమారుడు భాస్కర్ వ్యవసాయ పనులు చేస్తుండగా బొదాసు కృష్ణయ్యతో పాటు అతని కుమారులు అక్కడకు వెళ్లి గొడవకు దిగి దాడికి యత్నించారు. దీంతో భాస్కర్ గ్రామంలోకి పరుగులు తీశాడు. భాస్కర్‌ను వెంబడిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అతని తండ్రి వెంకటయ్య తన అన్న, అన్న కొడుకులను అడ్డుకున్నాడు. దీంతో వారు వెంకటయ్యపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్న వెంకటయ్యను స్థానికులు 108 ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
ప్యాంట్ కోసం కొట్లాట.. తమ్ముడి హత్య!
అలహాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జీన్స్ ప్యాంట్స్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. అలహాబాద్ బెహ్‌మాల్పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర, సురేంద్రలు అన్నదమ్ములు. ఇటీవల సురేంద్ర స్థానిక మార్కెట్లో రెండు జీన్స్ ప్యాంట్స్ కొనుక్కున్నాడు. ఈ ప్యాంట్ల విషయంలో అన్న రాజేంద్రతో చోటుచేసుకున్న చిన్న గొడవ సురేంద్ర ప్రాణాలను తీసింది. ఆగ్రహంతో రాజేంద్ర కత్తితో తమ్మునిపై దాడి చేసి పరారయ్యాడు. త్రీవ్రంగా గాయపడ్డ సురేంద్రను ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రకు నేర చరిత్ర ఉందని, కొద్ది రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. -
కొత్తపల్లిలో వ్యక్తి దారుణ హత్య
త్రిపురారం(నాగార్జునసాగర్) : అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం సా యంత్రం ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన అలుగుల పెద్దవెంకట్‌రెడ్డి (52)కి తన తమ్ముడు అలుగుల జంగారెడ్డి మధ్య ఆస్తి విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న రెండు ఎకరాల 24 గుంటల భూమి కొలతల్లో కొంత తేడాలు ఉండడంతో ఇరువురి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు అలుగుల జంగారెడ్డి తన భూమిని ఇటీవల రైతు తిరుపతయ్యకు అమ్ముకున్నాడు. విషయం తెలుసుకున్న అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి కొత్తపల్లి గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దల మాటలను పట్టించుకోకుండా జంగారెడ్డి రెండు రోజుల క్రితం తన భూమిని కొలత చేయిస్తుండగా అన్న పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడకు వెళ్లి తమ్ముడితో గొడవపడ్డారు. ఈనేపథ్యంలో తన అన్నపై తమ్ముడు జం గారెడ్డి కక్ష పెంచుకున్నాడు.ఈక్రమంలో మంగళవారం సాయంత్రం అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లాడు. విష యం తెలుసుకున్న జంగారెడ్డి, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి పొలం వద్దకు వెళ్లి అన్న పెద్ద వెంకట్‌రెడ్డిని కత్తులతో పొడిచి చంపాడు. తీవ్ర రక్తస్రావం అయి పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. దాడిచేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హత్య విషయం తెలుసుకున్న హలియా సీఐలు ధనుంజయగౌడ్, ఎస్ఐ సతీష్‌కుమార్ ఘటన స్థలం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనకు గల కారణాలను విచారించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసమే తన భర్తను మరిది జంగారెడ్డి హతమార్చారని మృతుడి భార్య కనకదుర్గ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
తమ్ముడిని హతమార్చిన అన్న
కోల్‌సిటీ(రామగుండం): ఆస్తి తగాదాలతో తమ్ముడిని అన్న హతమార్చిన సంఘటన గోదావరిఖనిలో సోమవారం జరిగింది. తల్లిపై కత్తితో దాడి చేయడానికి వెళ్లిన అన్నను అడ్డుకున్న తమ్ముడు ధనాల దుర్గారావు(23) అలియాస్ చంటి కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా రక్తస్రావమవతుండడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలు. గోదావరిఖని లెనిన్‌నగర్‌కు చెందిన ధనాల రామారావు, ఈశ్వరీ దంపతులకు ముగ్గురు కుమారులు చంద్రశేఖర్, శివశంకర్, దుర్గారావు అలియాస్ చంటి(23), ఇద్దరు కూతుళ్లు. రామారావు సింగరేణి స్కూల్లో పనిచేస్తున్నారు. పెద్దకుమారుడు ధనాల చంద్రశేఖర్ రామగుండంలో భార్య, పిల్లలతో ఉంటున్నారు. రెండో కుమారుడు శివశంకర్ కుటుంబంతో మరో ఊరిలో ఉంటున్నారు. సోమవారం కరీంనగర్లో భార్య పరీక్షలు రాయడానికి ఆమెతో వచ్చి న శివశంకర్..అనంతరం ఇద్దరు గోదావరిఖనికి వచ్చారు. సాయంత్రం మద్యంమత్తులో ఇంటికొచ్చిన పెద్ద కుమారుడు చంద్రశేఖర్, ఇంట్లో తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. రూ.2లక్షలు, ఇంట్లో వాటా కావాలని డిమాండ్ చేయగా తల్లి నిరాకరించింది. తల్లిదండ్రులతోపాటు రెండో తమ్ముడు శివశంకర్ సముదాయించిన శాంతించలేదు. అదే సమయంలో బయట నుంచి అప్పుడే వచ్చిన చిన్నతమ్ముడు దుర్గారావు సైతం అన్నను సుమదాయించే ప్రయత్నం చేశాడు. అయినా చంద్రశేఖర్ వినకుండా తీవ్ర ఆగ్రహంతో తల్లిపై కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుకున్న తమ్ముడు దుర్గారావును అదే కత్తితో పొడిచాడు. ఎడమ తొడకు బలమైన కత్తిపోట్లు కావడంతో తీవ్రరక్తస్రావమైంది. హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. చిన్నకొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచారు. చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని గోదావరిఖని ఏసీపీ అపూర్వరావు, సీఐ వాసుదేవరావు పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
తాగిన మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా..
పొన్నెకల్లు(తాడికొండ): తాగిన మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా బూతులు తిడుతున్నాడని అన్నను తమ్ముడు కత్తిపీటతో నరికి చంపిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంపచోటి నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు, ఆదివారం తాగి ఇంటిలో తల్లి అవ్వమ్మ, సోదరి ధనలక్ష్మిని బూతులు తిడుతుండటంతో కోపోద్రిక్తుడైన తమ్ముడు నాగేశ్వరరావు కల్పించుకున్నాడు. మాటా మాట పెరగడంతో అన్నపై కత్తిపీటతో దాడిచేసి గుండె, గొంతుపై బలంగా నరకడంతో ఘటన స్థలంలోనే నరేష్(26) మృతి చెందాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, ఎస్ఐ రాజశేఖర్‌లు పరిశీలించి, స్థానికులను ఆరా తీశారు. మృతుడు నరేష్‌కు నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. భార్య రెండు నెలలు కాపురం చేసిన అనంతరం వెళ్లి పోయింది. సోదరుల మధ్యా తరచూ వివాదాలు జరుగుతుంటాయి. ఆదివారం అవి కాస్తా ముదరడంతో హత్యకు దారి తీసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి తల్లి అవమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
పరువు పోతుందని సోదరిని..
చెన్నూర్: మండలంలోని కంబోజిపేట అటవీ ప్రాంతంలో హత్య చేసి, కిరోసిన్ పోసి కాల్చి చంపిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో హత్య వివరాలను జైపూర్ ఏసీపీ సీతారాములు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బైన రాజేశ్వరికి (38) దుగ్నెపల్లికి చెందిన బడుగు రాజయ్యతో గత 23 ఏళ్ల క్రితం వివాహమైంది. రాజేశ్వరికి కొడుకు పుట్టిన తర్వాత భర్తను వదిలి వెళ్లిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. పెద్దనాన్న కూతురు రాజేశ్వరి చెడు తిరుగుళ్లు తిరుగుతూ కుటుంబ పరువు పోగొడుతుందని కిష్టంపేట గ్రామానికి చెందిన పున్నేశ్ ఆరు నెలల క్రితం చెన్నూర్ పట్టణంలోని జగన్నాథాలయం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఇచ్చాడు. పోషణ భారం కాకుండా చెన్నూర్ పట్టణంలోని ఒక బట్టల షాపులో ఉద్యోగం ఇప్పించాడు. ఇక నుంచి మంచిగా బతుకుతుందని ఆశించినా అక్క వ్యవహార శైలిలో మార్పు రాలేదు. దీంతో పున్నేశ్ అక్కను హతమార్చాలనే పథకం పన్నాడు. నీకో వ్యక్తితో పరిచయం చేస్తానని నమ్మించి గత జనవరి 30 రాత్రి కిష్టంపేట వైపు వెళ్తున్న కారును లిఫ్ట్ అడిగి లంబాడిపల్లి ప్రాంతానికి తీసుకెళ్లాడు. కారు వెళ్లిపోయిన తర్వాత గొంతుకు చున్నీ చుట్టి హతమార్చాడు. శవాన్ని పక్కన పెట్టి రాత్రి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అడవికి వెళ్లి కట్టెలు తెస్తానని తండ్రి ఎల్లయ్యకు చెప్పి ఎడ్లబండి తీసుకుని వెళ్లాడు. శవాన్ని బండిలో వేసుకుని కంబోజిపేట సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వరిగడ్డి వేసి కిరోసిన్ పోసి కాల్చేశాడు. ఫిబ్రవరి 4న అటవీ ప్రాంతంలో శవం కాలి ఉన్న విషయాన్ని గమనించిన పశువుల కాపరి కిష్టంపేట సర్పంచ్‌కు వివరించాడు. సర్పంచ్ ఫిర్యాదుతో కంబోజిపేట అటవీ ప్రాంతానికి వెళ్లి శవాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో లభించిన ఆనవాళ్ల ప్రకారం తాళాలు వేసి ఉన్న ఇళ్లను పరిశీలించగా పట్టణంలోని జగన్నాథాలయ సమీపంలో గల ఒక ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి ఇల్లు అద్దెకు తీసుకున్న పున్నేశ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. పున్నేశ్ తనే హత్య చేశానని అంగీకరించాడు. ఈ మేరకు హత్యానేరం కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మిస్టరీని ఛేదించిన విషయంలో సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ బాలయ్య, కానిస్టేబుల్ శ్యాంలను ఏసీపీ అభినందించారు. సమావేశంలో సీఐ కొరె కిశోర్‌కుమార్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. -
తమ్ముడే హంతకుడు
కదిరి అర్బన్: గత సంవత్సరం కనిపించకుండా పోయిన కుమ్మరవాండ్లపల్లి గ్రామానికి చెందిన ఈటెల గాయత్రిని తమ్ముడు అంతంమొందించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ పోలీసులు నిందితులను బుధవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు పూర్వాపరాలను డీఎస్పీ శ్రీలక్ష్మి విలేకరులకు తెలిపారు. తన సోదరి ఈటెల గాయత్రీ కనపడుట లేదని ఆమె సోదరుడు కుమ్మరవాండ్లపల్లికి చెందిన గోవర్దన్ గతేడాది రూరల్ మండల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే చాలా విషయాలు సేకరించారు. గోవర్దన్ సోదరి గాయత్రి భర్తను వదిలిపెట్టి పుట్టింటిలో ఉండేది. ఈ క్రమంలోనే తన తమ్ముని స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన సుదర్శన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది తెలుసుకున్న గోవర్దన్ తన అక్కను పద్ధతి మార్చుకోవాలని మందలించాడు. అయినప్పటికీ ఆమె వ్యవహారంలో మార్పు కనిపించలేదు. ఈ క్రమంలోనే 2016 మార్చి 3వ తేదీన గాయత్రి ఇంట్లోనే తన స్నేహితుడైన సుదర్శన్‌తో కలిసి ఉండడాన్ని చూసిన గోవర్దన్ తట్టుకోలేకపోయాడు. ఇది గమనించిన సుదర్శన్ అక్కడి నుంచి పారిపోగా... ఆగ్రహంతో ఉన్న గోవర్దన్ అక్కడే ఉన్న కట్టె తీసుకుని గాయత్రి తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం తన మరో స్నేహితుడైన రాజేశ్‌ను వెంట బెట్టుకుని గాయత్రి మృతదేహాన్ని ముష్టిపల్లి రోడ్డు వద్ద కదిరి కొండకు సమీపంలో ఉపాధి హామీ పనుల్లో తీసిన గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం మూడు రోజుల తర్వాత 2016 మార్చి 6వ తేదీన తన అక్క గాయత్రి కనిపించడం లేదంటూ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి మద్యంమత్తులో తన స్నేహితుడైన రాజేశ్‌తో గొడవపడిన గోవర్దన్ మాటామాటా పెరగడంతో తన అక్కను చంపినట్టే నిన్నూ చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించగా... గాయత్రిని చంపింది తానేనని గోవర్దన్ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు గోవర్దన్‌ను, అతనికి సహకరించిన రాజేశ్‌ను అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ శ్రీధర్, ఎస్ఐ వెంకటప్రసాద్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
చెల్లిని చంపేశాడు?
రామచంద్రపురం: సొంత ఇంట్లోనే యువతి దారుణంగా హత్యకు గురైన సంఘటన రామచంద్రపురం పట్టణంలో సంచలనం రేకెత్తించగా.. తన కొడుకే తన కూతురిని హతమార్చినట్టుగా అనుమానిస్తూ ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ యువతి మర్డర్ కేసు మిస్టరీగా మారింది. స్థానికులు, పోలీసులు, యువతి తండ్రి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు నందుల రాజు కథనం ప్రకారం.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ(రాజు)కు అమృతా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఈయనకు జయదీపిక(20), జయప్రకాశ్‌నాయుడు అను ఇద్దరు కవల పిల్లలున్నారు. జయదీపిక ఎ.అగ్రహారం కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బార్లో పనిచేసే దుర్గసాయి కల్యాణ్ అనే వ్యక్తి నందుల రాజు ఇంటికి వెళ్లగా.. ఇంటిలో తీవ్రగాయాలతో జయదీపిక అపస్మారక స్థితిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దీపికను అంబులెన్స్‌లో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రామచంద్రపురం సీఐ కె.శ్రీధర్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాకినాడ నుంచి క్లూస్ టీం పోలీస్ డాగ్స్‌తో వచ్చి వివరాలను సేకరించింది. అడిషనల్ ఎస్పీ ఎస్. దామోదర్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రేమ వ్యవహారం వల్లే.. తన కుమార్తె ఇటీవల ప్రేమ వ్యవహారం నడుపు తోందని తన కొడుకు జయప్రకాశ్‌నాయుడు తన దృష్టికి తీసుకువచ్చాడని, ఈ నేపథ్యంలో దీపికను అతడే హత్య చేసి ఉంటాడని దీపిక తండ్రి రాజు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఐ శ్రీధర్‌కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన మర్డర్ పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నందులరాజు ఇంటిలో అతి దారుణంగా ఆయన కూతురు హత్యకు గురికావడం మిస్టరీగా మారింది. తన కన్నకొడుకుపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలే, హత్యకు దారి తీశాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దీపిక హత్యపై పట్టణంలో ఎన్నో వదంతులు వ్యాపించాయి. చివరకు తండ్రి నందులరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏదేమైనా పోలీసులు అధికార పార్టీ ప్రలోభాలకు లోనుకాకుండా దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి...
ఆస్తి కోసం... కాలయముడైన తమ్ముడు! ప్రొద్దుటూరు క్రైం: ఆస్తి కోసం తమ్ముడే కాలయముడయ్యాడు... అన్నను వేటాడి వెంటాడి నరికి చంపాడు... వదిన, అన్న పిల్లల శోకానికి కారకుడయ్యాడు.. చివరకు అతను కూడా జైలు పాలయ్యాడు. పెద్దలు సంపాదించిన ఆస్తి అన్నదమ్ముల మధ్య వైరాన్ని పెంచి.. ప్రాణం మీదికి తెచ్చింది. మండల పరిధిలోని కానపల్లె రహదారిలో సోమవారం ఆకుల శ్రీనివాసులరెడ్డి (40)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైకుపై వెళ్తున్న అతన్ని కారుతో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండారెడ్డిపల్లెకు చెందిన ఆకుల శ్రీనివాసులరెడ్డికి వెంకటసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారికి బెంగళూరుతోపాటు స్వగ్రామంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం అతనికి ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వనతేజతో వివాహం అయింది. వారికి అజయ్, మనోజ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వనతేజ తల్లి చనిపోవడంతో కానపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న ఆరవేటి «థియేటర్ కాంప్లెక్స్‌లో మీ సేవా కేంద్రాన్ని శ్రీనివాసులరెడ్డి నిర్వహిస్తున్నాడు. అతని సోదరుడు కృష్ణారెడ్డి వనతేజ చెల్లెలినే పెళ్లి చేసుకొని.. ఉదయగిరిలో మీ సేవా కేంద్రాన్ని నడిపాడు. ఆస్తి కోసం తరుచూ గొడవలు: ఆస్తి కోసం తరుచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. శ్రీనివాసులరెడ్డి తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను మృతి చెందాక కృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య ఆస్తి తగాదాలు మరింత పెరిగాయి. ఘర్షణలకు సంబంధించి నెల్లూరులోని వరికుంటపాడు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. తరుచూ గొడవలు జరుగుతుండటంతో శ్రీనివాసులరెడ్డి కానపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. 8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై దాడి 8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై అన్న దాడి చేశాడు. పడుకొని ఉన్న అతన్ని వాహనంలో తీసుకొని వెళ్లి విచక్షణా రహితంగా కొట్టి, తీవ్రంగా గాయపరచినట్లు పోలీసులు తెలిపారు. అప్పటినుంచి అతను మీ సేవా కేంద్రాన్ని మూసివేసి శ్రీనివాసులరెడ్డిని చంపడానికి కృష్ణారెడ్డి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరాయి హంతకులతో కలసి అతను పలుమార్లు ప్రొద్దుటూరుకు వచ్చి శ్రీనివాసులరెడ్డి నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రం, అతను ఇంటికి వెళ్లే దారుల వద్ద రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి.. మీసేవా కేంద్రం నుంచి శ్రీనివాసులరెడ్డి సోమవారం మధ్యాహ్నం భోజనానికి బైక్‌పై కానపల్లె గ్రామానికి బయలుదేరాడు. అతని కోసం కాపు కాచిన నలుగురు దుండగులు ఏపీ26 ఎన్ 7007 నంబర్ ఇండికా కారులో వెంబడించారు. కానపల్లె సమీపంలోని దర్గా వద్దకు వెళ్లగానే వెనుక వైపు నుంచి కారుతో ఢీ కొట్టారు. దీంతో అతను కింద పడిపోయాడు. ప్రమాదం జరిగిందేమోనని అతనికి సాయపడేందుకు పొలంలో పని చేస్తున్న కూలీలు పరుగెత్తుకుంటూ రోడ్డు వైపు వచ్చారు. ఈ లోపే ముసుగులు ధరించిన నలుగురు దుండగులు కారులోంచి దిగి శ్రీనివాసురెడ్డిని వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి అక్కడివారు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే లోపే అతను మృతి చెందాడు. విషయం తెలియడంతో భార్య వనతేజ, పిల్లలు ఆస్పత్రికి చేరుకొని భోరున విలపించారు. రూరల్ సీఐ ఓబులేసు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, స్థానికులను విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల అదపులో నిందితులు శ్రీనివాసులరెడ్డిని హత్య చేసిన నిందితులు మైదుకూరు వైపు పారిపోయారని సమాచారం తెలియడంతో పోలీసులు అన్ని మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట సమీపంలోని బోయినపల్లె వద్ద ముగ్గురు నిందితులను రాజంపేట డీఎస్పీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. -
సానుభూతి ఓట్ల కోసం సోదరుడిని చంపించాడు
మీరట్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్ కుమార్ ఎన్నికల్లో గెలవడానికి దారుణమైన వ్యూహం పన్నాడు. సానుభూతి ఓట్ల కోసం సొంత సోదరుడిని, స్నేహితుడిని చంపించాడు. చివరకు నేరం చేయించినట్టు పోలీసుల విచారణలో తేలడంతో కటకటాలపాలయ్యాడు. యూపీలోని ఖుర్జా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్ఎల్డీ అభ్యర్థిగా మనోజ్ కుమార్ గౌతమ్ పోటీ చేస్తున్నాడు. ఆయన తొలుత బీఎస్పీ టికెట్ కోసం ప్రయత్నించాడు. టికెట్ లభించకపోవడంతో ఆర్ఎల్డీ తరఫున బరిలో దిగాడు. కుటుంబ సభ్యుడిని చంపించి, రాజకీయ ప్రత్యర్థులు ఈ హత్య చేయించినట్టు ఆరోపించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని పథకం వేశాడు. సోమవారం ఖుర్జాలో ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ కొడుకు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయంత్ చౌదరి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇదే అదునుగా భావించిన గౌతమ్.. ఈ ర్యాలీ ముగిసిన వెంటనే తన సోదరుడు వినోద్, ఫ్యామిలీ ఫ్రెండ్ సచిన్‌లను చంపించాడు. కిరాయి హంతకులు వీరిద్దరిని తుపాకీతో కాల్చి చంపారు. ఓ మామిడి తోటలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా గౌతమే ఈ హత్యలు చేయించినట్టు తేలింది. పోలీసులు ఇంటరాగేషన్‌లో గౌతమ్ ఏడుస్తూ ఏమీ తెలియనట్టుగా నటించినా, తర్వాత నిజం అంగీకరించాడు. ఇద్దరు కిరాయి హంతకులకు లక్ష రూపాయలు ఇచ్చి, హత్యలు చేయించినట్టు చెప్పాడు. పోలీసులు ఓ హంతకుడిని, గౌతమ్‌ను అరెస్ట్ చేశారు. మరో హంతకుడు పరారీలో ఉన్నాడు. -
గర్ల్‌ఫ్రెండ్ వివాదం.. అన్నను చంపిన తమ్ముడు
అర్ధరాత్రి పూట తనను బయటకు పంపి, గర్ల్‌ఫ్రెండ్‌తో కాలక్షేపం చేస్తున్నాడన్న కోపంతో సొంత అన్నను డంబెల్‌తో కొట్టి చంపేశాడో పీజీ విద్యార్థి. ఈ సోదరుల తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఝాన్సీలో నివసిస్తారు. తనను బయటకు ఎందుకు పంపుతున్నావంటూ ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న హిమాంశు వర్మ (23) తన అన్న హితేష్ (28)తో గొడవ పడ్డాడు. రాత్రిపూట చలిలో తాను బయట ఉండలేనని అన్నాడు. ఆ విషయమై ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో కోపంతో డంబెల్ తీసుకుని అన్నమీద విసిరేశాడు. అంతేకాక.. అతడు చనిపోయేవరకు దాంతో కొట్టాడు. బాధితుడు హితేష్ ఓ కాలేజిలో సంస్కృతం చెబుతుంటాడు. రాత్రి 1.30 గంటల సమయంలో అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చి, హిమాంశును బయటకు వెళ్లమని చెప్పాడు. ప్రతి రెండు రోజులకోసారి అతడు అలాగే చేస్తున్నాడని హిమాంశు పోలీసులకు చెప్పాడు. ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటంతో తనకు కోపం వచ్చిందని, ఆ చలిలో బయటకు వెళ్లడానికి తాను నిరాకరించానని అన్నాడు. అన్నను చంపిన తర్వాత తానే పోలీసులకు రాత్రి 3 గంటల సమయంలో ఫోన్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన అన్నను చంపారని కట్టుకథ అల్లాడు. చంపడానికి ఉపయోగించిన డంబెల్‌ను మంచం కింద దాచేశాడు. అయితే రాత్రి ఎవరూ ఇంటికి రాలేదని ఇంటి యజమాని చెప్పారు. మొదటి అంతస్థుకు వెళ్లడానికి ఒకటే దారి ఉండగా.. కింద గ్రౌండ్‌ఫ్లోర్‌లో యజమాని ఉంటారు. గట్టిగా ప్రశ్నించినప్పుడు హిమాంశు ఒక్కసారిగా ఏడ్చేసి, తన నేరాన్ని అంగీకరించాడని డీసీపీ మాధుర్ వర్మ చెప్పారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఢిల్లీకి వచ్చిన రెండు నెలల తర్వాత హితేష్ ఓ అమ్మాయితో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో దాన్ని రహస్యంగా ఉంచినా, తర్వాత హిమాంశుకు తెలిసిపోవడంతో సహకరించాలని కోరాడు. మొదట్లో అంగీకరించినా, అర్ధరాత్రి బయటకు పంపడంతోప తట్టుకోలేకపోయానని హిమాంశు పోలీసులకు చెప్పాడు. -
మంత్రి పల్లె సోదరుని మృతి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోదరుడు పల్లె వెంకటసుబ్బారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లిలో తుదిశ్వాస విడిచారు. సోదరుని మరణవార్త తెలిసిన వెంటనే మైసూరులో అధికార పర్యటనలో ఉన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి హుటాహుటిన పల్లెవాండ్లపల్లె చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం పల్లె సోదరుని అంత్యక్రియలు జరిగాయి. -
తమ్ముడినే చంపేశాడు
నల్గొండ: ఆస్తి కోసం సొంత తమ్ముడినే చంపేశాడు ఓ అన్న. ఈ సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మడమడక గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మడమడక గ్రామ పంచాయతీ పరిధిలోని షాకెల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు నీలం నిరంజన్(28), నీలం రమేష్(22)లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో వారి మధ్య కొద్ది రోజులుగా వచ్చిన మనస్ఫర్థలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున రమేష్ నిద్రిస్తున్న సమయంలో నిరంజన్ రోకలిబండతో అతని పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.